
ఆర్టీఐ పేరిట అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు
ఆదిలాబాద్‌టౌన్: సమాచార హక్కు చట్టాన్ని (ఆర్‌టీఐ) అడ్డు పెట్టుకుని అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్ రెడ్డి తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలోని డీఎస్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం ద్వారా బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడిన వారిపై ఇదివరకు రెండు కేసులు నమోదు చేశామన్నారు. ఆదిలాబాద్ పట్టణా నికి చెందిన సోమ రవి, డీవీఆర్ ఆంజనేయులుపై వన్‌టౌన్‌లో కేసు నమోదు చేశామన్నా రు. ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాన్ని బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడిన షేక్ యూసఫ్, ఎండీ ఆర్షద్, షేక్ సమద్‌పై టూటౌన్‌లో ఇటీవల కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఆర్‌టీఐ సమాచారం అత్యధికంగా సేకరించిన వారిపై ప్రత్యేక బృందం ద్వారా పర్యవేక్షించడం జరుగుతుందన్నారు.