
జనాభా నియంత్రణ అందరి బాధ్యత
ఆదిలాబాద్‌టౌన్: జనాభా నియంత్రణ అందరి బాధ్యత అని డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్ అన్నారు. ప్రపంచ జనాభా నియంత్రణ దినోత్సవం పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని డీఎంహెచ్‌వో సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయ న మాట్లాడారు. జనాభా పెరుగుదలతో అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయని తెలిపారు. ఒకరిద్దరు పిల్లల్ని కని వారి భవితకు బాటలు వేయాలని కోరారు. జిల్లాలో ఈ ఏడాదిలో 4వేల కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సల లక్ష్యం ఉండగా, ఇప్పటివరకు 44 శాతం ఆపరేషన్లు చేసినట్లు తెలిపారు. అత్యధిక ఆపరేషన్లు నిర్వహించిన డీఐవో వైసీ శ్రీనివాస్‌ను సన్మానించి ప్రశంసా పత్రం అందజేశారు. ఇందులో డిప్యూటీ డీఎంహెచ్‌వో సాధన, టీబీ నియంత్రణ అధికారి సుమలత, జిల్లా మలేరియా నివా రణ అధికారి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.