
అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి
ఆదిలాబాద్‌రూరల్: హెచ్‌సీఎల్ టెక్‌బీ ఆధ్వర్యంలో సాఫ్ట్‌వేర్ రంగంలో ఇంటర్మీడియేట్ చదివిన విద్యార్థులకు అందజేస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. జిల్లా కేంద్రంలోని గిరిజన బాలుర సంక్షేమ పాఠశాల ఆవరణలో శుక్రవారం మెగా జాబ్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఇందులో పాల్గొన్న విద్యార్థులు ఉత్తీర్ణత సాధిస్తే రాష్ట్రంలోని హైదరా బాద్‌తో పాటు ఏపీలోని విజయవాడలో గల హెచ్‌సీఎల్ శాఖలలో శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. అనంతరం మంచి ప్యాకేజీ ఉంటుందన్నారు. కార్యక్రమంలో డీఐఈవో జాదవ్‌గణే శ్, హెచ్‌సీఎల్ కోఆర్డినేటర్ రాజేశ్, స్టార్ 50 కో ఆర్డినేటర్ మారుతిశర్మ, విద్యార్థులు ఉన్నారు.