డీల్‌ కుదిరింది! | - | Sakshi
Sakshi News home page

డీల్‌ కుదిరింది!

Jul 11 2025 5:53 AM | Updated on Jul 11 2025 5:53 AM

డీల్‌ కుదిరింది!

డీల్‌ కుదిరింది!

అక్రమ రిజిస్ట్రేషన్లకు ఒప్పందం

లింక్‌ డాక్యుమెంట్‌ లేకున్నా ఓకే

రూ.15వేలు అప్పగిస్తే పని పూర్తి

ఆదిలాబాద్‌ ఎస్సార్వోలో దందా!

సాక్షి, ఆదిలాబాద్‌: ఆదిలాబాద్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కా ర్యాలయం (ఎస్సార్వో) పరిధిలో ఇటీవల ఓ సబ్‌రి జిస్ట్రార్‌ డాక్యుమెంట్‌ రైటర్లతో రహస్యంగా సమావేశమై డీల్‌ కుదుర్చుకున్నారు. లింక్‌ డాక్యుమెంట్‌ లేకున్నా అసెస్‌మెంట్‌ ఆధారంగా రిజిస్ట్రేషన్‌ చేస్తామని, ఇందుకు ఒక్కో డాక్యుమెంట్‌కు రూ.15వేలు ఇవ్వాలని ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారమే లింక్‌ డాక్యుమెంట్‌ లేకున్నా రిజిస్ట్రేషన్లు చేసే పని ఇప్పటికే మొదలైంది. సాధారణంగా ఓ ప్లాట్‌, ఇల్లు రిజిస్ట్రేషన్‌ చేయాలంటే లింక్‌ డాక్యుమెంట్‌ను పరిగణనలోకి తీసుకుంటారు. దరఖాస్తుదారుకు ఆ ప్లాట్‌ ఎలా సంక్రమించిందనేది దాని ద్వారానే తెలుస్తుంది. అయితే లింక్‌ డాక్యుమెంట్లు లేకున్నా మున్సిపాలిటీ నుంచి జారీ చేసే అసెస్‌ మెంట్‌ (డోర్‌ నంబర్‌) ఆధారంగా అక్రమంగా రి జిస్ట్రేషన్లు చేస్తుండటం పరిపాటిగా మారింది. ఇటీవల ఇలాంటి రిజిస్ట్రేషన్లకు సంబంధించి పోలీస్‌ శాఖ కేసులు కూడా నమోదు చేసింది. అయినప్పటి కీ ఈ దొడ్డిదారి దందాకు ఫుల్‌స్టాప్‌ పడటం లేదు. కాగా, పాత ఆస్తులు, వారసత్వంగా ఒకరి నుంచి మరొకరికి వచ్చే ఆస్తులకు లింక్‌ డాక్యుమెంట్లు లేకపోవడంతోనే రిజిస్ట్రేషన్లు చేస్తున్నామని సంబంధిత అధికారులు తమ తప్పు కప్పి పుచ్చుకుంటున్నారు. కానీ.. ప్రస్తుతం జరుగుతున్న రిజిస్ట్రేషన్లలో చాలా కొత్త ఆస్తులవే కావడం గమనార్హం.

అక్రమాలు జరిగేదిలా..

ప్రధానంగా ప్రభుత్వ స్థలాలను ఆక్రమించడం, వాటిలో ఇల్లు కట్టుకుని మున్సిపాలిటీ ద్వారా దొడ్డిదారిన అసెస్‌మెంట్‌ చేసుకోవడం లాంటి అక్రమాలు ముందునుంచి జరుగుతున్నవే. ఇలా అసెస్‌ మెంట్‌ తీసుకుని.. అలా దాని ఆధారంగా రిజిస్ట్రేష న్‌కు వెళ్తున్నారు. కొందరైతే ఏకంగా ఓపెన్‌ ప్లాట్‌పై నే అసెస్‌మెంట్‌ నంబర్‌ తీసుకుని రిజిస్ట్రేషన్‌ చేసుకుంటున్నారు. ప్రధానంగా ఆ స్థలాలను అక్రమ ప ద్ధతిలో స్వాహా చేసేందుకు ఇలాంటి కుయుక్తులకు పాల్పడటం పరిపాటిగా మారింది. ఇలా ప్రభుత్వ స్థలాలను కైంకర్యం చేయడంలో కొందరు అక్ర మార్కులు ఆరితేరారు. అలాంటి వారికి రిజిస్ట్రేషన్‌ అధికారులు సహకరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. దీన్ని అరికట్టాల్సిన రిజిస్ట్రేషన్‌ అధికారులు ‘మామూలుూగా తీసుకోవడంతో వ్యవహారం మూడు పువ్వులు.. ఆరు కాయలుగా సాగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement