
పిల్లలు బడికి వెళ్లేలా ప్రోత్సహించాలి
ఆదిలాబాద్‌టౌన్: పిల్లలు బడికి వెళ్లేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూ చించారు. గురువారం జిల్లా కేంద్రంలోని పోలీస్ కా ర్యాలయంలో ఆపరేషన్ ముస్కాన్ కార్యాచరణపై ఆయా శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆ పరేషన్ ముస్కాన్ కార్యక్రమం నిర్వహించిన 10 రో జుల్లో 37 మంది బాలలను గుర్తించినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 10 కేసులు నమోదు చేసినట్లు పే ర్కొన్నారు. అన్ని శాఖల సమన్వయంతో బాలకా ర్మిక వ్యవస్థను రూపుమాపాలని సూచించారు. హో టళ్లు, ఇటుకబట్టీలు, వ్యాపార సముదాయాల్లో బా లలను పనిలో పెట్టుకున్న వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఏఎస్పీ సురేందర్‌రావు, డీఎస్పీ ఎల్.జీవన్‌రెడ్డి, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ చంద్రశేఖర్, ఇన్‌స్పెక్టర్లు గుణవంత్‌రావు, పద్మ, అసిస్టెంట్ లేబర్ అధికారి రాజలింగు, వినోద్‌కుమార్, డీసీపీవో రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.