
రోడ్లపైకి పశువులను వదలొద్దు
ఆదిలాబాద్‌టౌన్: రోడ్లపైకి పశువులను వదిలితే య జమానులపై కేసులు నమోదు చేస్తామ ని ఆదిలా బాద్ డీఎస్పీ ఎల్.జీవన్‌రెడ్డి హెచ్చరించారు. గురువారం జిల్లా కేంద్రంలోని వన్‌టౌన్, టూటౌన్, మా వల పోలీస్‌స్టేషన్ల పరిధిలో రోడ్లపై తిరుగుతున్న 50 పశువులను గోశాలకు తరలించారు. పశువుల ను రోడ్లపైకి వదులుతున్నందున వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నట్లు తెలిపారు. ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతోందని పేర్కొన్నారు. పట్ట ణంలో నిత్యం స్పెషల్‌డ్రైవ్ చేపట్టి పశువులను రోడ్లపైకి వదిలే యజమానులపై చర్యలు తీసుకుంటామ ని హెచ్చరించారు. ఆయన వెంట వన్‌టౌన్, టూటౌ న్ సీఐలు సునీల్‌కుమార్, కరుణాకర్‌రావు ఉన్నారు.