
బదిలీల అనంతరం పదోన్నతులు చేపట్టాలి
ఆదిలాబాద్‌టౌన్: గెజిటెడ్ హెడ్‌మాస్టర్ల బదిలీ అనంతరం పదోన్నతుల ప్రక్రియ చేపట్టాలని గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గోపాల్‌సింగ్ తి లావత్, జి.శశికళ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో వా రు మాట్లాడారు. నిబంధనల ప్రకారం మొదట బదిలీలు చేపట్టిన తర్వాత అర్హులైన ప్రధానో పాధ్యాయులకుపదోన్నతులు కల్పించాల్సి ఉంటుందన్నారు. అయితే అందుకు విరుద్ధంగా ప దోన్నతులు కల్పించడం సరికాదన్నారు. జిల్లా కు చెందిన ప్రధానోపాధ్యాయులు సుదూర ప్రాంతాల్లో పనిచేస్తున్నారని, రిటైర్మెంట్‌కు దగ్గ ర ఉన్నవారికి జీరో సర్వీస్, మినిమం ఏడా ది సర్వీసుతో ప్రధానోపాధ్యాయులందరికీ బదిలీ లకు అర్హులుగా అవకాశం కల్పించాలని కోరా రు. ఇందులో సంఘ నాయకులు పాల్గొన్నారు.
‘అభివృద్ధిని చూసి కాంగ్రెస్‌లోకి..’
బోథ్: రాష్ట్రంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు, అభివృద్ధి పాలనను చూసి ఇతర పార్టీల నాయకులు కాంగ్రెస్‌లో చేరుతున్నారని ఏఐ సీసీ విచార్ విభాగ్ తెలంగాణ రాష్ట్ర కో ఆర్డినేటర్ తుల అరుణ్ కుమార్ అన్నారు. సొనాల మండల కేంద్రంలో చింతల్‌బోరి గ్రామానికి చెందిన పలువురు బుధవారం కాంగ్రెస్‌లో చేరారు. వారికి ఆయన కండువా కప్పి పార్టీలో కి ఆహ్వానించారు. ఇందులో సీనియర్ నాయకులు జ్ఞానేశ్వర్, పోతన్న, రమేష్ , పోశెట్టి, శ్రీధర్, అనిల్, భోజన్న, శ్రీరామ్ గైక్వాడ్, సంతోష్ ధన్వే, దేవిదాస్, గంగారాం, సదానంద్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.