
కార్మిక సంఘాల ఆందోళన
● సార్వత్రిక సమ్మెలో భాగంగా జిల్లా కేంద్రంలో ర్యాలీ, ధర్నా
కై లాస్‌నగర్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు నిరసిస్తూ చేపట్టిన జాతీయ సార్వత్రిక సమ్మెలో భాగంగా కార్మిక సంఘాలు జిల్లా కేంద్రంలో బుధవారం ఆందోళనకు దిగాయి. మున్సిపల్, రిమ్స్, భవన నిర్మాణ, ఎండీఎం కార్మికులతో కలిసి సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్‌టీయూ సంఘాల ఆధ్వర్యంలో పట్ట ణంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించా రు. అనంతరం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల నాయకులు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కార్మిక, కర్షక ప్రజావ్యతిరేక విధానాలు అవలంభిస్తోందని ఆరో పించారు. కార్మికులు పోరాటాల ద్వారా సాధించుకున్న 29 కార్మిక చట్టాలను కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా నాలుగు లేబర్ కోడ్‌లుగా మార్చడం సరికాదన్నారు. అలాగే జిల్లాకేంద్ర సహకార బ్యాంకు ఎదుట ఉద్యోగులు, సిబ్బంది తమ నిరసన తెలి పారు. ఇందులో ఆయా సంఘాల నాయకులు కిరణ్, రాఘవులు, ఆశాలత, దేవేందర్ పాల్గొన్నారు.