కలిసికట్టుగా పోరాడితేనే.. | - | Sakshi
Sakshi News home page

కలిసికట్టుగా పోరాడితేనే..

Jul 9 2025 6:41 AM | Updated on Jul 9 2025 6:41 AM

కలిసి

కలిసికట్టుగా పోరాడితేనే..

కలిసి కట్టుగా పోరాడితేనే యూనివర్సిటీ ఏర్పాటు సాధ్యపడుతుంది. గతంలో ఉట్నూర్‌ కేంద్రంగా గిరి జన వర్సిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించినా చివరకు ఆది వేరే ప్రాంతానికి తరలిపోయింది. అలాగే 2008లో జిల్లాకు ఐఐటీ మంజూరు చేసి ఆ తర్వాత హైదరాబాద్‌కు తరలించారు. ఈ విషయమై కలెక్టరేట్‌ ఎదుట 54 రోజుల పాటు ఉద్యమించాం. ఫలితంగా బాసరకు ట్రిపుల్‌ఐటీని కేటాయించారు.

– చిట్యాల సుహాసినిరెడ్డి, జెడ్పీమాజీ చైర్‌పర్సన్‌

యువత తలుచుకుంటే..

యువత తలుచుకుంటే విశ్వవిద్యాలయం ఏర్పా టు తప్పక నెరవేరుతుంది. మేధావివర్గం, ఉద్యోగులు, రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు అండగా నిలబడాలి. వారికి ఆర్థికంగా తోడ్పాటునందించాలి.

– రమేశ్‌, ఎస్సీ స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌

వైఎస్సార్‌ హయాంలో మంజూరు

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ఉమ్మడి జిల్లా కు జ్ఞాన సరస్వతీ యూని వర్సిటీని మంజూరు చేశా రు. రాష్ట్ర విభజన అనంతరం ఆ ఫైల్‌ ముందుకు కదలలేదు. విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఏర్పాటు దిశగా ఉద్యమించాలి. – వరప్రసాద్‌,

కీర్తన డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌, బేల

విద్యారంగ అభివృద్ధికి దోహదం..

జిల్లాలో యూనివర్సిటీ లేకపోవడంతో ఉన్నత విద్య కోసం ఇక్కడి వారు సుదూ ర ప్రాంతాలకు వెళ్లి చదువుకోవాల్సి వస్తుంది. జిల్లాకు ప్రకటించిన ఇంజినీరింగ్‌ కళాశాలను సైతం ఏర్పాటు చేయాలి. సామాజిక స్పృహతో ‘సాక్షి’ ముందుకు రావడం అభినందనీయం. – నవీన్‌కుమార్‌,

టీఎన్జీవోస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి

భీం స్ఫూర్తితో ఉద్యమిద్దాం..

కుమురంభీం పోరాట స్ఫూర్తితో ఐక్యంగా ఉద్యమించాలి. పక్కా ప్రణాళిక, నిరంతర పోరాటంతో ఆకాంక్ష తప్పకుండా నెరవేరుతుంది. పాలకుల నిర్లక్ష్యాన్ని ఎప్పటికప్పుడు ప్రశ్నించాలి. –హనుమాండ్లు,

కృష్ణవేణి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌

విశ్వవిద్యాలయం తప్పనిసరి..

జిల్లాలో ఉన్నత విద్య అవకాశాలు లేకపోవడంతో ఈ ప్రాంత విద్యార్థులు సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి. మరికొందరు డిగ్రీతోనే ఆగిపోతున్నారు. విద్యాపరంగా అభివృద్ధి చెందాలంటే జిల్లాకు విశ్వవిద్యాలయం తప్పనిసరి.

– ప్రవీణ్‌కుమార్‌, బీసీ స్టడీసర్కిల్‌ డైరెక్టర్‌

ఆచరణనే ముఖ్యం..

జిల్లాలో గిరిజన యూనివర్సిటీ సాధన కోసం 2017 నుంచి ఉద్యమాలు చేస్తున్నాం. అయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. వర్సిటీ లేక ఈ ప్రాంత విద్యార్థులకు ఏళ్లుగా అన్యాయానికి గురవుతున్నారు. ఇప్పటికై నా అందరూ ఏకతాటిపైకి రావడం శుభపరిణామం. –వెట్టి మనోజ్‌,

తుడుందెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి

కలిసికట్టుగా పోరాడితేనే..
1
1/6

కలిసికట్టుగా పోరాడితేనే..

కలిసికట్టుగా పోరాడితేనే..
2
2/6

కలిసికట్టుగా పోరాడితేనే..

కలిసికట్టుగా పోరాడితేనే..
3
3/6

కలిసికట్టుగా పోరాడితేనే..

కలిసికట్టుగా పోరాడితేనే..
4
4/6

కలిసికట్టుగా పోరాడితేనే..

కలిసికట్టుగా పోరాడితేనే..
5
5/6

కలిసికట్టుగా పోరాడితేనే..

కలిసికట్టుగా పోరాడితేనే..
6
6/6

కలిసికట్టుగా పోరాడితేనే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement