
● జిల్లా కేంద్రం.. హాకీకి కేరాఫ్‌గా మారేనా ● ఇప్పటికే క
సాక్షి,ఆదిలాబాద్: మన జాతీయ క్రీడ హాకీకి జిల్లా కేంద్రం కీలకంగా మారనుంది. ఆదిలాబాద్‌లోనూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పోటీలు నిర్వహించేందుకు వేదిక కానుందా.. అంటే.. అవుననే స మాధానం వినిపిస్తోంది. ఇప్పటికే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో స్థానిక ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో హాకీలో శిక్షణ కోసం ఖేలో ఇండియా సెంటర్ ఏర్పాటు చేయడం తెలిసిందే. ప్రస్తు తం ఈ క్రీడలో అనేక మంది ఇక్కడ శిక్షణ పొందుతున్నారు. రాష్ట్ర,జాతీయస్థాయి పోటీల్లో ప్రతిభ కనబర్చుతున్నారు. ఇదిలా ఉంటే.. ఆదిలాబాద్‌లో సింథటిక్ టర్ఫ్ కోర్టు ఏర్పాటు చేయాలని తాజాగా కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. మంజూరైతే రాను న్న రోజుల్లో జాతీయస్థాయిపోటీలనిర్వహణకు వేది కవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
రూ.7 కోట్లతో ప్రతిపాదనలు..
జిల్లా కేంద్రంలో ప్రస్తుతం స్పోర్ట్స్ స్కూల్ కొనసాగుతుంది. అలాగే ఉట్నూర్, జాతర్లలో ఐటీడీఏ ఆ ధ్వర్యంలో గిరి క్రీడా పాఠశాలలు నిర్వహిస్తున్నారు. ఇందులోని విద్యార్థులు పలువురు హాకీలో శిక్షణ పొందుతున్నారు. అంతేకాకుండా జిల్లాకేంద్రంలోని కొలాం ఆశ్రమ పాఠశాల, గిరిజన సంక్షేమ గురుకు ల పాఠశాల, కళాశాల విద్యార్థులు సైతం ఇక్కడ శిక్షణ పొందుతున్నారు. ఇటీవల జిల్లా నుంచి గజానంద్, రాంకుమార్ ఇద్దరు జాతీయ స్థాయిలో ప్రాతిని ధ్యం వహించారు. ఈ నేపథ్యంలో జిల్లాలో రానున్న రోజుల్లో ఈ క్రీడాభివృద్ధికి అవకాశాలు మెరుగుపడనున్నాయి. ఇదిలా ఉంటే స్థానిక ఎంపీ నగేశ్ తాజా గా కేంద్ర క్రీడలశాఖ మంత్రి మన్సుఖ్ మాండవి యాకు హాకీ కోసం ఆదిలాబాద్‌లో రూ.7 కోట్లతో సింథటిక్ టర్ఫ్ కోర్టు ఏర్పాటు చేయాలని ప్రతిపాదన చేశారు. ఈ ఏడాది చివరిలోగా దీనికి మంజూ రు లభించే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.
పట్టు వదలొద్దు..
జిల్లాలో క్రీడల అభివృద్ధి పరంగా నేతలు, అధికారులు పట్టువదలకుండా కృషి చేయాలన్న అభిప్రా యం పలువురి నుంచి వ్యక్తమవుతుంది. ప్రధానంగా ఆదిలాబాద్‌కు గతంలోనే ఫుట్‌బాల్ అకాడమీ మంజూరై ప్రారంభించబడింది. కొద్ది కాలం పాటు ఇక్కడ శిక్షణ కూడా కొనసాగింది. అయితే మధ్యలో దీన్ని ఖమ్మంకు తరలించారు. దీంతో ఆదిలా బాద్ కు అన్యాయం జరిగిందన్న అభిప్రాయం, ఆవేదన ఈ ప్రాంతవాసుల్లో వ్యక్తమైంది. ఆ తర్వాత ఆదిలా బాద్‌కు స్పోర్ట్స్ స్కూల్ మంజూరు చేశారు. ప్రస్తు తం హాకీ సెంటర్ కొనసాగుతుండగా, ఫోకస్ పెంచితే మరింత అభివృద్ధికి అవకాశాలు ఉంటాయని పలువురు పేర్కొంటున్నారు.
ప్రయోజనాలు ఇలా..
టర్ఫ్ కోర్టు ఏర్పాటు చేసిన పక్షంలో జాతీయ, అంతర్జాతీయ పోటీలకు వేదికగా మారనుంది.
రానున్న రోజుల్లో ప్రత్యేక అకాడమీ ఏర్పాటుకు కూడా అవకాశాలు ఉంటాయి.
స్థానికంగా ఔత్సాహికులైన ఎంతో మంది క్రీడాకారులకు మంచి శిక్షణ సౌకర్యాలు
అందుబాటులోకి వస్తాయి.