
శిక్షణ సద్వినియోగం చేసుకోవాలి
కై లాస్‌నగర్: ఎంపికై న అభ్యర్థులు 50 రోజుల పాటు అందించే శిక్షణను సద్వినియోగం చేసుకుని సర్వేయర్‌గా రాణించాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. జిల్లా కేంద్రంలోని టీటీడీసీలో లైసెన్స్ సర్వేయర్ల శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించారు. శిక్షణకు అవసరమైన మెటీరియల్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూ ముల కొలతల్లో సర్వేయర్ల పాత్ర కీలకమన్నారు. శిక్షణలో నేర్పే అంశాలపైపట్టు సాధించాలని సూచించారు. 155 మందిని రెండు బ్యాచ్‌లుగా చేసి థియరీ, ఫీల్డ్‌లో శిక్షణ ఇవ్వనున్నట్లుగా వెల్లడించారు. ఇందులో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడీ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
సీఎం వీసీలో పాల్గొన్న కలెక్టర్
సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ రాజర్షి షా పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, భూభారతి, వరి ధాన్యం సేకరణ, వ్యవసా యం – మాన్‌సూన్ సంసిద్ధత వంటి అంశాలపై అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దే శం చేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, జెడ్పీ సీఈవో జితేందర్ రెడ్డి, హౌసింగ్ పీడీ బసవేశ్వర్, డీఎస్‌వో వాజీద్ అలీ, మున్సిపల్ కమిషనర్ సీవీఎన్. రాజు తదితరులు పాల్గొన్నారు.