ఆదిలాబాద్: మహిళ తన జీవితంలో కుటుంబం నుంచి మొదలుకొని సమాజం వరకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటుంది. ఆడపిల్ల పుట్టుకనే కాదనుకుంటున్న ప్రస్తుత సొసైటీలో వారి ఉనికిని వారే చాటుకుంటూ, ఆడపిల్లల భాగస్వామ్యం సమాజానికి ఎంత అవసరమో అనే విషయాన్ని చాటి చెబుతున్నారు. మహిళలను చిన్నచూపు చూస్తున్న వ్యవస్థలో ఆమె లేకపోతే సృష్టి లేదనే విషయాన్ని మరిచిపోతుండడం శోచనీయం. నవమాసాలు కడుపులో పిండాన్ని మోసి, ఒక జీవానికి ప్రాణం పోస్తున్న అమ్మతనం ప్రతీ సీ్త్రలో ఉంటుంది. సమాజ పురోగతిలో వారి పాత్ర ఎనలేనిది. అటువంటి అతివను గౌరవించాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిది. – కళ్లెం జీవిత వెంకట్‌రెడ్డి, గైనకాలజిస్ట్, ఆదిలాబాద్
ఆమె లేకపోతే సృష్టి లేదు