
ఆసిఫాబాద్: సభ్య సమాజం తలదించుకునేలా వ్య వహరించి, కన్న కూతురుపై లైంగిక దాడికి పాల్ప డిన తండ్రికి 20 ఏళ్ల జైలు శిక్షతోపాటు రూ.6 వేల జరిమానా విధిస్తూ మంగళవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పీవీ రమేశ్ తీర్పు వెలువరించారు. పీపీ జీవీఎస్ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. కాగజ్‌నగర్ పట్టణంలోని జంజిరాల వెంకటి పదో తరగతి చదువుతున్న తన మైనర్ కుమార్తెను తర చూ లైంగికంగా వేధించేవాడు.
ఈక్రమంలోనే 2022 జూలైలో ఇంట్లోనే లైంగికదాడికి పాల్పడ్డాడు. 2022 నవంబర్ 13 రాత్రి మరోసారి లైంగిక దాడికి యత్నించగా, బాలిక తల్లి వాణి దృష్టికి తీసుకెళ్లింది. వాణి కాగజ్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో భర్తపై ఫిర్యాదు చేసింది. అప్పటి సీఐ రవీందర్ పోక్సో కింద కేసు నమోదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేసి 14 మంది సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టగా నేరం రుజువైంది. జిల్లా ప్రధాన న్యాయమూర్తి నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు.