breaking news
Woman Set Ablaze
-
నిద్రలోనే మహిళకు నిప్పటించారు
లక్నో : వడ్డీ కట్టలేదన్న కారణంతో ఓ మహిళకు నిప్పటించిన ఘటన ఉత్తర ప్రదేశ్లో చోటు చేసుకుంది. తీవ్ర గాయాలపాలైన దళిత మహిళ చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. బల్లియా జిల్లా జజౌలి గ్రామంలో గురువారం రాత్రి ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. జజౌలి గ్రామానికి చెందిన రేష్మా దేవి(45) గ్రామంలోని సోనూ ఓ వ్యాపారి వద్ద రూ. 20 వేలు అప్పుగా తీసుకుంది. ఈ మధ్యే ఆ అప్పును చెల్లించగా.. వడ్డీ కోసం ఆమెను వేధించటం ప్రారంభించారు. ఈ క్రమంలో ఆమె కట్టనని తెగేసి చెప్పటంతో ఘాతుకానికి పాల్పడ్డారు. గురువారం రాత్రి ఆమె ఇంట్లోకి ప్రవేశించి మంచంపై నిద్రిస్తున్న ఆమెపై కిరోసిన్ పోసి తగలబెట్టారు. ఆమె కేకలకు అంతా నిద్రలేవటంతో నిందితులు పరారయ్యారు. కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి స్టేట్ మెంట్ ఆధారంగా ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
బస్సు దగ్ధం, మహిళ సజీవ దహనం
బెంగళూరు: కర్ణాటక ఆర్టీసీబస్సు ప్రమాదంలో ఓ మహిళ సజీవ దహనమైంది. చిక్ మంగుళూరు నుంచి బెంగళూరుకు బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగంతో ఈ ఘటన చోటుచేసుకుంది. భాగ్యమ్మ అనే మహిళ సజీవ దహనమైంది. బస్సులోని ప్రయాణికులు కిందకు దిగిపోవడంతో ప్రాణనష్టం తగ్గింది. ప్రమాద సమయంలో బస్సులో 25 మంది ఉన్నారు. బస్సు ఇంజిన్ లో తలెత్తిన లోపం కారణంగానే మంటలు చెలరేగినట్టు భావిస్తున్నారు. మంటల్లో బస్సు పూర్తిగా కాలిపోయింది. ప్రమాద కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.