breaking news
Water production
-
చందమామపై ఎంచక్కా బతికేయొచ్చు!
చిన్నతనంలో గోరు ముద్దలు తినిపించేందుకు అమ్మ చందమామను చూపిస్తుంది. అన్నం తినేందుకు పరోక్షంగా అక్కరకొచ్చే చందమామ మన శాశ్వత స్థిరనివాసానికి ఆమోదయోగ్యంగా లేదని ఇన్నాళ్లూ అంతా భావించారు. భూమి మాదిరి అక్కడ వాతావరణం, గాలి, నీరు వంటివేమీ అక్కడ లేకపోవడమే ఇందుకు ప్రధానకారణం. జీవన మనుగడకు కీలకమైన ఆక్సిజన్, నీటి కొరతల సమస్యను తీర్చేలా చంద్రుని మట్టి నుంచే ఆ రెండింటినీ తయారుచేసి చూపి చైనా శాస్త్రవేత్తలు మానవాళి చంద్రునిపై స్థిరనివాస కలలకు కొత్త రెక్కలు తొడిగారు. నీటి తయారీకి పనికొచ్చే కీలక మూలకాలు చంద్రుని మట్టిలో పుష్కలంగా ఉన్నాయని చైనా శాస్త్రవేత్తలు తాజాగా ప్రకటించారు. చాంగ్–ఈ–5 మిషన్ ద్వారా తీసుకొచి్చన చంద్రశిలలు, చంద్రుని మట్టిని సమగ్ర స్థాయిలో విశ్లేíÙంచడం ద్వారా చంద్రునిపైనే ఉదజని, జీవజలం పునర్‌సృష్టి సాధ్యమని చైనా శాస్త్రవేత్తలు వెల్లడించారు. కొత్త సాంకేతికత సాయంతో చంద్రుని నేల నుంచి నీరు, ఆక్సిజన్‌ను తయారుచేసి చూపడం విశేషం. సంబంధిత పరిశోధనా తాలూకు వివరాలు సెల్ ప్రెస్ వారి ‘జూలీ’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. లీటర్ నీటికి రూ.19 లక్షలు !! అంతరిక్ష పరిశోధనలో భాగంగా వ్యోమగాములు భవిష్యత్తులో చంద్రునిపై ఎక్కువ కాలం గడపాల్సి రావొచ్చు.ఆ సమయంలో ఆక్సిజన్, నీరువంటి ప్రాణాధార వ్యవస్థలను అక్కడ సమకూర్చుకోవాల్సి ఉంటుంది. భూమి మీద నుంచి వ్యోమనౌక ద్వారా వందల లీటర్ల నీటిని, భారీ స్థాయిలో ఆక్సిజన్ సిలిండర్లను తరలించడం ఎంతో శ్రమతో, అంతకుమించిన ఖర్చుతో కూడిన వ్యవహారం. కేవలం 3.785 లీటర్ల( ఒక గ్యాలన్) నీటిని భూమి మీద నుంచి చంద్రుడి వద్దకు వ్యోమనౌకలో చేర్చాలంటే కనీసం రూ.72 లక్షలు ఖర్చు అవుతుంది. అంటే ఒక లీటర్ నీటిని ఇక్కడి నుంచి అక్కడికి పంపాలంటే అక్షరాలా పంతొమ్మిది లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇంతటి వ్యయప్రయాసలకోర్చి పంపేకంటే అక్కడే నీటిని తయారుచేస్తే ఉత్తమం అన్న నిర్ణయానికొచ్చి ఆమేరకు చైనా శాస్త్రవేత్తలు కొత్త సాంకేతికతను విజయవంతంగా అభివృద్ధిచేశారు. చందమామ మట్టి నుంచి నీటిని సంగ్రహించి ఆ నీటి సాయంతో కార్భన్డయాక్సైడ్ను ఆక్సిజన్‌గా, ఇతర ఇంధన సంబంధిత రసాయనాలుగా మార్చే సాంకేతికతను చైనా శాస్త్రవేత్తలు అభివృద్ధిచేశారు. ఏమిటీ టెక్నాలజీ? ఈ టెక్నాలజీ సాయంతో చంద్రుని మట్టి నుంచి నీటిని సంగ్రహించవచ్చు. ప్రయోగాల కోసం అక్కడే ఉన్న వ్యోమగామని ఉచ్చా్వస నుంచి వెలువడిన కార్భన్డయాక్సడ్ను ఇదే నీటి సాయంతో కార్భన్ మోనాక్సైడ్, హైడ్రోజన్ వాయువుగా మార్చొచ్చు. ఇలా అందుబాటులోకి వచి్చన కార్భన్‌మోనాక్సైడ్, హైడ్రోజన్ ఇంధనం, ఆక్సీజన్ తయారీ కోసం ఉపయోగించుకోవచ్చు. ఇలా తయారైన ఆక్సిజన్‌ను మళ్లీ అక్కడి వ్యోమగాముల కోసం సిలిండర్లలో భద్రపరుస్తారు. ఈ టెక్నాలజీ పనిచేయడానికి అవసరమయ్యే వేడిని తీక్షణమైన సూర్యరశ్మి నుంచి సంగ్రహించనున్నారు. టైటానియం ఐరన్ ఆక్సైడ్ ధాతువులున్న చంద్రుని ‘ఇన్మెనైట్’ మట్టితో నీటిని సృష్టించడం సాధ్యమేనని శాస్త్రవేత్తలు చెప్పారు. ల్యాబ్‌లో సూక్ష్మస్థాయిలో నీటిని, ఆక్సిజన్‌ను సృష్టించగలిగామని, చంద్రునిపై వ్యోమగామలు నిరంతరం శ్వాసించి, ఉపయోగించుకునే స్థాయిలో ఆక్సిజన్ తయారీకి మరికొంత కాలం ఆగకతప్పదని పరిశోధకులు తెలిపారు. ఆ రోజు కోసం మేం కూడా ఎదురుచూస్తున్నామని వారు వ్యాఖ్యానించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
గాల్లోంచి నీరు పుట్టిస్తారు..!
ఎక్స్‌ప్రైజ్.. ఈ పేరు చాలా తక్కువగానే విని ఉంటారుగానీ.. మనిషి ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాలు కనుక్కొనేందుకు పోటీలు పెడుతుంటుంది ఈ సంస్థ. పీటర్ డెమండిస్ అనే వ్యాపారవేత్త 1995లో దీన్ని స్థాపించారు. రెండేళ్ల కింద ‘వాటర్ అబండెన్స్’అనే పోటీ పెట్టింది. గాల్లోని తేమను అతిచౌకగా నీరుగా మార్చే యంత్రం, లేదా సాంకేతికతను అభివృద్ధి చేసిన వారికి 10.5 లక్షల డాలర్లు.. (రూ.9.75 కోట్లు) ఇస్తామని ప్రకటించింది. రోజుకు కనీసం 2 వేల లీటర్ల నీరు ఉత్పత్తి చేయాలని, ఒక్కో లీటరు నీటి తయారీకి 2 సెంట్ల (రూ.1.28)కు మించి ఖర్చు కాకూడదన్నవి నిబంధనలు. మొత్తం 98 సంస్థలు ఈ ప్రైజ్‌మనీ కోసం పోటీపడ్డాయి. రెండు వారాల కింద తుది పోటీలకు 5 జట్లు ఎంపికైనట్లు ప్రకటించింది. ఆ జాబితాలో హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ‘ఉరవు’ఉంది. ఉరవు వ్యవస్థాపకుడే స్వప్నిల్! మూడేళ్లలో 80 పైసలకే లీటర్.. నమూనా యంత్రం ద్వారా లీటర్ నీరు ఉత్పత్తి చేసేందుకు దాదాపు రూ.2 ఖర్చు అవుతోందని, సిలికా పదార్థం ఆధారంగా నమూనా యంత్రాన్ని తయారు చేశామని స్వప్నిల్ చెప్పారు. మరిన్ని మెరుగులు దిద్దడం ద్వారా ఎక్కువ నీటిని ఉత్పత్తి చేయగలగడంతో పాటు ఖర్చు తగ్గిస్తామని పేర్కొన్నారు. మరో మూడేళ్లలో నీటి ఉత్పత్తి ఖర్చును లీటర్‌కు 80 పైసలకు తగ్గించొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎక్స్‌ప్రైజ్ ఫౌండేషన్ ఫైనల్ పోటీలు ఈ ఏడాది జూలైలో జరగబోతున్నాయని పేర్కొన్నారు. నమూనా యంత్రాన్ని హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో విజయవంతంగా పరీక్షించామని, వాతావరణంలో తేమ తక్కువగా ఉండే డిసెంబర్‌లోనూ పూర్తిస్థాయిలో నీరు ఉత్పత్తి చేయగలిగినట్లు వివరించారు. రాష్ట్రంలో ఫ్లోరైడ్ బాధిత గ్రామాల్లో ఈ యూనిట్లను ఏర్పాటు చేసే ఆలోచనతో ఉన్నామని, ఇందుకు ప్రభుత్వం సహకరిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ‘గాల్లోంచి నీరును ఉత్పత్తి చేసే యంత్రాలు ఇప్పటికే చాలా ఉన్నా వాటి ఖరీదు చాలా ఎక్కువ. ఇంటి అవసరాలు తీర్చే యంత్రం ఖరీదు రూ.50 వేల వరకు ఉండొచ్చు. ఒకసారి ఇంట్లో పెట్టుకుంటే చాలు.. దీర్ఘకాలం పాటు స్వచ్ఛమైన మంచినీరందిస్తుంది’అని స్వప్నిల్ వివరించారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ చేతులు కలిపిన యువశక్తి.. ఐదుగురు యువకులు కలసి ఈ సంస్థను స్థాపించారు. స్వప్నిల్ ఆర్కిటెక్చర్ చదివితే అమిత్ ఎంబెడెడ్ డిజైనింగ్‌లో డిప్లొమో చేశాడు. వీరికి మెకా నికల్ ఇంజనీరింగ్ చేసిన భరత్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ విద్యనభ్యసించిన సందీప్, ఆర్కిటెక్చర్ చదు వుకున్న వెంకటేశ్ తోడయ్యారు. అందరూ చదువుకు న్నది కేరళలోని కాలికట్లో. ఎక్స్‌ప్రైజ్ పోటీ ముందే వీరంతా కలసి గాల్లోంచి నీటిని ఉత్పత్తి చేసేందుకు ఓ యంత్రాన్ని అభివృద్ధి చేశారు. సంక్షేపణం అనే భౌతిక ప్రక్రియ ద్వారా ఇది పనిచేస్తుంది. ఎవా అని దీనికి పేరు పెట్టారు. గాజు గ్లాసులో చల్లటి నీటిని ఆరుబయట పెడితే గ్లాస్ బయటివైపున నీటి బిందు వులు ఏర్పడతాయి కదా అలాగన్నమాట. ఇది పనిచే సేందుకు విద్యుత్ అవసరం. ఎక్స్‌ప్రైజ్ నిబంధనల ప్రకారం పూర్తిగా సంప్రదాయేతర ఇంధన వనరుల పైనే ఆధారపడాలి. దీంతో ప్రత్యేకమైన డిజైన్‌ను ఉపయోగించామని, అదనపు ఖర్చుల్లేకుండా ఎక్కడైనా నీరు ఉత్పత్తి చేయొచ్చని స్వప్నిల్ ‘సాక్షి’కి చెప్పారు. ఈ సరికొత్త యంత్రంతో రోజుకు 15–20 లీటర్ల నీరు ఉత్పత్తి చేయొచ్చని అన్నారు. స్వప్నిల్ (ఎడమ నుంచి రెండో వ్యక్తి) బృందం -
నీటి ఆవిరిని ఒడిసిపట్టేస్తుంది!
కారణాలు ఏవైనా కావొచ్చు.. ప్రస్తుతం నీటి కొరత ప్రపంచాన్ని పీడిస్తోంది. తాగునీటి కొరతను తగ్గించేందుకు నెదర్లాండ్స్‌లోని హేగ్ నగరానికి చెందిన సన్గ్లేషియర్స్ అనే సంస్థ.. 20 అంగుళాలున్న వాటర్ క్యూబ్‌ను తయారు చేసింది. పక్కన ఫొటోలో చూపిన క్యూబ్ మీ దగ్గరుంటే చాలు.. ఎలాంటి పరిస్థితుల్లోనైనా గొంతు తడుపుకునేందుకు కావాల్సినన్ని నీళ్లు దొరుకుతాయి. ఇది గాలిలోని తేమను నీరుగా మారుస్తుంది. క్యూబ్‌పై ఏర్పాటు చేసిన సౌర శక్తి ఘటకాలు 40 వాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేస్తే, అందులో 25 వాట్లను వాడుకుని లోపలి వైపున కనిపించే స్టీల్ శంఖు చల్లబడుతుంది. చుట్టుపక్కల నీటి ఆవిరి.. సంక్షేపణం (కన్డెన్సేషన్) అనే ప్రక్రియకు గురై బిందువులుగా మారుతుంది. ఆ తర్వాత నెమ్మదిగా కిందపడే నీటిని మనం తాగొచ్చు. ఒక్కో పరికరంతో ఎంత మోతాదులో నీరు ఉత్పత్తి చేయవచ్చన్నది గాలిలో ఉండే తేమ శాతంపై ఆధారపడి ఉంటుంది. తక్కువ విద్యుత్తుతో రిఫ్రిజిరేషన్ వ్యవస్థను అభివృద్ధి చేయడం దీని ప్రత్యేకతని వాటర్ క్యూబ్‌ను రూపొందించిన ఆప్వెర్ హెగ్గెన్ అంటున్నారు.