breaking news
VIP Industries Ltd
-
మల్టిపుల్స్ చేతికి వీఐపీ
న్యూఢిల్లీ: లగేజీ, ప్రయాణ సంబంధ వస్తువుల తయారీ దిగ్గజం వీఐపీ ఇండస్ట్రీస్‌లో ప్రమోటర్లు ప్రధాన వాటా విక్రయించనున్నారు. దిలీప్ పిరమల్, కుటుంబ సభ్యులు 32 శాతంవరకూ వాటాను ఆల్టర్నేట్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ మల్టిపుల్స్‌కు అమ్మివేసేందుకు తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఈ అంశాన్ని రెండు సంస్థలు సంయుక్త ప్రకటనలో వెల్లడించాయి. దీంతో వీఐపీ ఇండస్ట్రీస్ వాటాదారులకు సెబీ నిబంధనల ప్రకారం మల్టిపుల్స్ కన్సార్షియం ఓపెన్ ఆఫర్ ప్రకటించింది. పబ్లిక్ వాటాదారుల నుంచి 26 శాతం వాటా(3.7 కోట్ల షేర్లు) కొనుగోలుకి షేరుకి రూ. 388 ధరలో ఆఫర్‌ను ప్రకటించింది. ఇందుకు వాటాదారులు పూర్తిస్థాయిలో స్పందిస్తే రూ. 1,438 కోట్లవరకూ మల్టిపుల్స్ ఇన్వెస్ట్ చేయవలసి ఉంటుంది. కాగా.. ఓపెన్ ఆఫర్ శుక్రవారం ముగింపు ధర రూ. 456తో పోలిస్తే 15 శాతం తక్కువకావడం గమనార్హం! గత ఏడాది కాలంలో కంపెనీ షేరు 2024 సెపె్టంబర్ 24న రూ. 590 వద్ద గరిష్టాన్ని తాకగా.. 2025 ఏప్రిల్ 7న రూ. 249 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. 2025 మార్చికల్లా ప్రమోటర్లు, ప్రమోటర్ సంస్థ 51.73 శాతం వాటాను కలిగి ఉన్నాయి. వాటా కొనుగోలుకి సెబీ, సీసీఐ అనుమతులు లభించవలసి ఉంది. ఈ లావాదేవీ తదుపరి కంపెనీ నియంత్రణ మల్టిపుల్స్ పీఈకి బదిలీ కానుంది. దిలీప్ పిరమల్, కుటుంబ సభ్యులు వాటాదారులుగా కొనసాగనున్నారు. దిలీప్ పిరమల్ కంపెనీకి చైర్మన్ ఎమిరిటస్‌గా వ్యవహరించనున్న ట్లు వీఐపీ ఇండస్ట్రీస్ పేర్కొంది. మల్టిపుల్స్ పీఈ ఫండ్స్‌తోపాటు.. సమ్విభాగ్ సెక్యూరిటీస్, మిథున్ పాదమ్ సాచేటి, సిద్ధార్థ సాచేటి, ప్రాఫిటెక్స్ షేర్స్ అండ్ సెక్యూరిటీస్ కన్సార్షియం వీఐపీ ఇండస్ట్రీస్‌ను సొంతం చేసుకోనుంది. ఆహ్వానిస్తున్నాం.. కంపెనీలో వ్యూహాత్మక భాగస్వామికానున్న మల్టిపుల్స్ కన్సార్షియంకు ఆహ్వానం పలుకుతున్నట్లు వీఐపీ చైర్మన్ దిలీప్ పిరమల్ పేర్కొన్నారు. కంపెనీకున్న పటిష్ట బ్రాండ్ విలువ పునరుద్ధరణలో ఇది కీలక ముందడుగుగా వ్యాఖ్యానించారు. దీంతో ఇటీవల కొన్నేళ్లుగా సవాళ్లు ఎదుర్కొంటున్న కంపెనీ దేశీ లగేజీ మార్కెట్లో తిరిగి బలపడనున్నట్లు అభిప్రాయపడ్డారు. అత్యంత పటిష్ట కార్యకలాపాలు కలిగిన వీఐపీ యాజమాన్య మారి్పడిపై ఉద్వేగంగా ఉన్నట్లు మల్టిపుల్స్ ఆల్టర్నేట్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ వ్యవస్థాపకుడు, ఎండీ, సీఈవో రేణుకా రామ్‌నాథ్ వ్యాఖ్యానించారు. కంపెనీ బ్రాండు విలువను మరింత పెంచడంతోపాటు.. తదుపరి దశ వృద్ధికి కృషి చేయనున్నట్లు తెలియజేశారు. వీఐపీ సంగతిదీ.. ముంబై కేంద్రంగా 1971లో ఏర్పాటైన వీఐపీ ఇండస్ట్రీస్ లగేజీ తయారీకి ప్రపంచంలోనే రెండో పెద్ద కంపెనీగా నిలు స్తోంది. ఆసియాలోకెల్లా అతి పెద్ద కంపెనీకాగా.. శామ్సోనైట్, సఫారీ ఇండస్ట్రీస్‌తో దేశీయంగా పోటీ పడుతోంది. వీఐపీ ఇండస్ట్రీస్ మార్కెట్ విలు వ రూ. 6,482 కోట్లుకాగా.. అరిస్ట్రోకాట్, వీఐపీ, కార్ల్టన్, స్కైబ్యాగ్స్, క్యాప్రీస్ బ్రాండ్లను కలిగి ఉంది. 2024కల్లా బ్రాండెడ్ లగేజీ మార్కెట్లో 50 శాతం మార్కెట్ వాటాను పొందింది. అయితే ప్రత్యర్థి కంపెనీలతో పోటీ పెరగడంతో మార్కెట్ వాటాను కోల్పోతూ వస్తోంది. గతేడాది (2024–25) వీఐపీ ఇండస్ట్రీస్ ఆదా యం రూ. 2,170 కోట్లకు చేరింది. ఈ వార్తల నేపథ్యంలో వీఐపీ ఇండస్ట్రీస్ షేరు బీఎస్ఈలో 6 శాతం జంప్‌చేసి రూ. 482 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 487–431 మధ్య ఊగిసలాడింది. -
బిగ్బుల్... వీఐపీ ..!
కరోనా వైరస్ ప్రభావంతో పర్యాటక రంగం ఎఫెక్ట్ ... ప్రయాణాలకు బ్రేక్... లగేజ్‌కు నో డిమాండ్... అంటే ఖండిస్తున్నారు మార్కెట్ విశ్లేషకులు. ఈ రంగానికి చెందిన వీఐపీ షేరుపై ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు ఈపీఎస్(ఎర్నింగ్ పర్ షేరు) అంచనాలను 50శాతం వరకు తగ్గించారు. అయితే వారు ఇప్పటికీ ఈ షేరుపై బుల్లిష్ వైఖరిని కలిగి ఉండటం విశేషం. వారి అంచనాలకు తగ్గట్లు దేశీయ బిగ్బుల్ రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా దంపతులు ఈ కంపెనీలో వాటాను పెంచుకున్నారు. మార్చ్ క్వార్టర్ షేర్‌హోల్డింగ్ డాటాను పరిశీలిస్తే... ఈ త్రైమాసికంలో రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా 2.85లక్షల ఈక్విటీ షేర్లను కొనుగోలు చేశారు. దీంతో కంపెనీలో అతడి వాటా 1.42శాతం నుంచి 1.62శాతానికి పెరిగింది. అలాగే అతని సతీమణి షేర్లను విక్రయించకపోవడం 3.69శాతంగానే ఉంది. బ్రోకేరేజ్ సంస్థల నివేదికలు: ఐడీబీఐ క్యాపిటల్: వరుస రెండేళ్లగా బలహీనంగా సర్వీసు రంగానికి అసాధారణ డిమాండ్ నెలకొనడంతో లగేజ్ ఇండస్ట్రీస్ బలపడింది. అయితే వచ్చే ఆర్థిక సంవత్సరం(ఎఫ్వై 22)లో మరింత రికవరిని సాధిస్తుంది. ఈ నేపథ్యంలో వీఐపీ కంపెనీ అదే ఏడాది(ఎఫ్వై 22)లో అమ్మకాలు 22శాతం, ఎబిటిడా 35శాతం వృద్ధిని సాధిస్తుంది. షేరుకు టార్గెట్ రూ.275గా నిర్ణయించడమైంది. కేటాయించిన టార్గెట్ ధర ప్రస్తుత ధరకు 25శాతం అప్‌సైడ్ పొటెన్షియల్‌ను కలిగి ఉంది. కోటక్ సెక్యూరిటీస్: వీఐపీ తన సహచర కంపెనీలతో పోలిస్తే మెరుగ్గా రాణిస్తుంది. వ్యయాలకు తగ్గించుకోవడం, సేవింగ్స్‌పై దృష్టిని పెట్టడం లాంటి చర్యలు మార్జిన్ల పెరుగుదలకు సహాయపడతాయి. అలాగే ఈ-కామర్స్ కంపెనీలతో భాగస్వామ్య ఒప్పందాలను చేసుకోవడంతో అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే ఆర్థిక సంవత్సరం 21 - 22 ఆదాయాల డిమాండ్‌పై కోవిడ్ -19 ప్రత్యక్ష, పరోక్ష ప్రభావాన్ని చూపుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కనుక షేరుకు గతంలో కేటాయించిన టార్గెట్ ధర(రూ.320)ను రూ.295గా తగ్గించడమైంది. అయితే షేరుపై మాత్రం ‘‘బై’’ రేటింగ్ కొనసాగిస్తామని బ్రోకేరేజ్ సంస్థ తెలిపింది. ఐసీఐసీఐ సెక్యూరిటీస్: జూన్ త్రైమాసికం కంపెనీకి ఒక క్లిష్టమైన కాలం. ఎందుకంటే కంపెనీ ఏడాదిలో వచ్చే మొత్తం ఆదాయంలో 30 శాతం వాటా ఈ క్వార్టర్‌లోనే వస్తుంది. అలాగే 45శాతం లాభదాయం ఇదే త్రైమాసికంలో వస్తుంది. కరోనాను అరికట్టేందుకు చాలా రాష్ట్రాలు షాపింగ్ మాల్స్‌ను మూసివేశాయి. రిటైల్ వ్యాపారస్థులు తన అమ్మకపు గంటలను తగ్గించారు. అమ్మకాలు కేవలం 5 శాతం మాత్రమే నమోదు కావడంతో ఏప్రిల్-మే నెలల్లో నష్టం గణనీయంగా ఉంది. ఇది ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు ఆదాయాల పనితీరుపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. వివాహాలను వాయిదా వేయడం కూడా పెద్ద ఆందోళన కలిగించే అంశం మారింది. వీఐపీ ఆదాయంలో వివాహ సీజన్ అమ్మకాలు 30 శాతంగా ఉన్నాయి. -
4 రోజుల లాభాలకు బ్రేక్
వరుస లాభాలకు బ్రేక్ పడింది. టెలికం షేర్లతోపాటు ఐటీ, ఎఫ్ఎంసీజీ, బ్యాంకింగ్ రంగాలు నీరసించడంతో మార్కెట్లు నాలుగు రోజుల తరువాత మళ్లీ వెనకడుగు వేశాయి. సెన్సెక్స్ 42 పాయింట్లు నష్టపోయి 20,334 వద్ద ముగిసింది. తొలుత లాభాలతో మొదలైనప్పటికీ రోజు మొత్తం పలుమార్లు లాభనష్టాల మధ్య ఊగిసలాడింది. ఇక నిఫ్టీ కూడా 10 పాయింట్లు క్షీణించి 6,053 వద్ద నిలిచింది. ఎఫ్ఐఐల వెనకడుగు శుక్రవారం రూ. 267 కోట్ల విలువైన షేర్లను విక్రయించిన ఎఫ్ఐఐలు తాజాగా మరో రూ. 455 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. దేశీయ ఫండ్స్ మాత్రం రూ. 295 కోట్లను ఇన్వెస్ట్ చేశాయి. స్పెక్ట్రమ్ వేలం ధర పెరుగుతున్న నేపథ్యంలో టెలికం షేర్లలో ఒత్తిడి కనిపించింది. ఐడియా 8.5% పతనంకాగా, ఆర్‌కామ్ 4%, భారతీ 3% చొప్పున క్షీణించాయి. ఇతర దిగ్గజాలలో టీసీఎస్, హెచ్‌యూఎల్, హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐ 2-1% మధ్య నష్టపోగా, డాక్టర్ రెడ్డీస్, సన్ ఫార్మా, మారుతీ, ఎల్అండ్టీ, ఓఎన్జీసీ, ఆర్ఐఎల్ 2-1% మధ్య లాభపడ్డాయి. అమన్ రిసార్ట్స్ విక్రయ వార్తలతో డీఎల్ఎఫ్ 3% పుంజుకుంది.