breaking news
Vibe K5
-
లెనోవో 'వైబ్ కె 5' ఓపెన్ అమ్మకాలు నేటినుంచే
చైనీస్ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ లెనోవో తన నూతన స్మార్ట్‌ఫోన్ 'వైబ్ కె 5' ఓపెన్ అమ్మకాలను సోమవారం నుంచి ప్రారంభించింది. ఇటీవలే మార్కెట్లో విడుదల చేసిన ఈ స్మార్ట ఫోన్ ను తొలిసారి ఓపెన్ అమ్మకాల ద్వారా అందుబాటులోకి వచ్చింది. భారతదేశంలో ఆసక్తి వున్న వినియోగదారులు, ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి అవసరం లేకుండానే అమెజాన్ లో కొనుగోలు చేయవచ్చని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. రూ.6,999 ధరకు ఈ స్మార్ట్‌ఫోన్ లభ్యం కానుంది. ఎల్టీఈ క్యాట్ 4 మద్దతుతో 150యంబీసీఎస్ డౌప్ లోడ్ వేగం, 50యంబీపీఎస్ అప్ లోడ్ వేగంతో పనిచేస్తుంది. ఇప్పటికే లక్ష మొబైళ్ల అమ్మకాలు చేపట్టినట్టు కంపెనీ ప్రకటించింది. ఇండియాలో తమకు వైబ్ కె5 మంచి ఆదరణ లభిస్తోందని లెనోవా ఇండియా తెలిపింది. లెనోవో వైబ్ కె5 ఫీచర్లు... 5 ఇంచ్ హెచ్డీ డిస్ప్లే, 720 x 1280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ 1.2 జీహెచ్‌జడ్ ఆక్టాకోర్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 415 ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్ 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్, డ్యుయల్ సిమ్, 4జీ 13 మెగాపిక్సెల్, రియర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్ 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా 2750 ఎంఏహెచ్ బ్యాటరీ, 15 గంటల టాక్ టైమ్ 150 గ్రాముల బరువు -
లెనోవో వైబ్ లో కొత్త ఫోన్
ధర రూ.6,999 న్యూఢిల్లీ: చైనా టెక్నాలజీ కంపెనీ లెనోవో తన వైబ్ స్మార్ట్‌ఫోన్ పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తోంది. ఈ కంపెనీ సోమవారం వైబ్ కే5 స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తెచ్చింది. ధర రూ. 6,999గా నిర్ణయించామని కంపెనీ తెలిపింది. ఏ6000 స్మార్ట్‌ఫోన్‌కు కొనసాగింపుగా దీనిని తెస్తున్నామని పేర్కొంది. ఈ ఫోన్లో 720 బై 1280 పిక్సెల్ రిజల్యూషన్ ఉన్న 5 అంగుళాల హై-డెఫినేషన్ డిస్ప్లే, 64-బిట్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 415 ఆక్టాకోర్ సీపీయూ, ట్విన్ డాల్బీ అట్మాస్-ఎనేబుల్డ్ స్పీకర్లు, 2జీబీ డీడీఆర్3 ర్యామ్, 13 మెగా పిక్సెల్ కెమెరా(వెనక వైపు), 5 మెగా పిక్సెల్ ముందు వైపు కెమెరా వంటి ప్రత్యేకతలున్నాయని వివరించింది. బంగారం, వెండి, తదితర రంగుల్లో లభ్యమవుతుందని తెలిపింది. ఈ ఫోన్లను అమెజాన్‌డాట్‌ఇన్ ద్వారా విక్రయిస్తామని, ఈ నెల 22 మధ్యాహ్నం 2 నుంచి తొలి ఫ్లాష్ సేల్ ప్రారంభమవుతుందని కంపెనీ పేర్కొంది.