breaking news
vh .Hanumanta Rao
-
రాజగోపాల్రెడ్డి,వీహెచ్ వ్యాఖ్యలపై హైకమాండ్ సీరియస్
-
కాపు ఉద్యమాన్ని అడ్డుకోలేరు
దోమలగూడ: పోలీసులు, పారా మిలిటరీ బలగాలతో కాపు ఉద్యమాన్ని అడ్డుకోలేరని, ఆమరణ దీక్ష జరుపుతున్న ముద్రగడ దంపతులకు ఏమైనా జరిగితే అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని రాజ్యసభ సభ్యులు వీహెచ్ హనుమంతరావు హెచ్చరించారు. ముద్రగడ దంపతుల ఆమరణ నిరాహారదీక్షకు సంఘీబావంగా జంటనగరాల కాపు సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఇందిరాపార్కు వద్ద ఆదివారం కాపుల రిలే నిరాహారదీక్ష లు నిర్వహించారు. దీక్షలను ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ ఓబీసీ ఎం పీల ఫోరం కన్వీనర్ అయినప్పటికీ కాపుల డిమాండ్ న్యాయసమ్మతమైనది కాబట్టే మద్దతు ఇస్తున్నానన్నారు. కాపు సంఘాల జేఏసీ ఛైర్మన్ డాక్టర్ వెంకటేశ్వర్రావు, నాయకులు శేషాద్రినాయుడు, బ్రహ్మనాయుడు పాల్గొన్నారు.