breaking news
V Creations Banner
-
అంతా కొత్తవారితో...
శ్రీకాంత్, రీతూరెడ్డి జంటగా గురువారం హైదరాబాద్‌లో పూజాకార్యక్రమాలతో ఓ సినిమా ప్రారంభం అయ్యింది. వరుణ్. కె దర్శకత్వంలో ఈ చిత్రాన్ని వి ప్రొడక్షన్స్ çసంస్థ నిర్మిస్తోంది. గతంలో ‘జ్యోతిలక్ష్మీ’, ‘సఖియా’,‘చిన్నదాన’ తదితర షార్ట్ఫిల్మ్స్కి దర్శకత్వం వహించారు వరుణ్. దర్శకుడిగా తన తొలి చిత్రాన్ని పల్లెటూర్లలో ఉండే పగప్రతీకారాలతో 1998 ప్రాంతంలో జరిగే కథతో తెరకెక్కిస్తున్నారు. ఈ నెలాఖరున రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని చిత్రబృందం తెలిపింది. అంతా కొత్త నటీనటులతో ఈ చిత్రం తెరకెక్కనుంది ఈ చిత్రానికి సంగీతం: రోహిత్. -
20న తెరి గీతావిష్కరణ
తెరి చిత్ర గీతాలావిష్కరణ కార్యక్రమం ఈ నెల 20న జరగనుందన్నది తాజా సమాచారం. ఇళయదళపతి విజయ్ నటిస్తున్న తాజా చిత్రం తెరి. ఇది ఆయన 59వ చిత్రం. విజయ్‌కు జంటగా అందాల భామలు సమంత, ఎమీజాక్సన్ నటిస్తున్నారు. ప్రభు, రాధిక శరత్‌కుమార్, దర్శకుడు మహేంద్రన్, ముట్టై రాజేంద్రన్, విజయ్ కూతురు దివ్య, నటి మీనా కూతురు నైనిక తదితరులు ముఖ్య పాత్రలు ధరిస్తున్న ఈ చిత్రానికి జీవీ.ప్రకాశ్‌కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇది ఈయనకు సంగీత దర్శకుడిగా 50వ చిత్రం కావడం మరో విశేషం. వీ క్రియేషన్స్ పతాకంపై కలైపులి ఎస్ థాను నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి అట్లీ దర్శకుడు. షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను ముమ్మరంగా జరుపుకుంటోంది. తెరి చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. చిత్రంలోని రెండు సాంగ్స్ పల్లవులు యూట్యూబ్‌లో హల్చల్ చేస్తూ విజయ్ అభిమానులను ఖుషీ చేస్తున్నాయి. చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్మాత ఈ నెల 20న భారీ ఎత్తున నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరుకానున్నట్లు సమాచారం. తెరి చిత్రాన్ని తమిళ ఉగాది సందర్భంగా ఏప్రిల్ 14న అత్యధిక థియేటర్లలో విడుదల చేయడానికి నిర్మాత కలైపులి ఎస్.థాను సన్నాహాలు చేస్తున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. తెరి సరికొత్త రికార్డులు:సాధారణంగా భారీ చిత్రాల విడుదలకు రెండు రోజులు లేదా వారం రోజుల ముందు థియేటర్లలో అడ్వాన్స్ టికెట్ల బుకింగ్ ప్రారంభిస్తారు. అలాంటిది తెరి చిత్రానికి ఏకంగా నెల రోజుల ముందే ప్రీ బుకింగ్ ఆరంభం కావడం రికార్డే అవుతుంది.