breaking news
Union minister Rajiv Pratap Rudy
-
రోడ్డు ప్రమాదంలో కేంద్రమంత్రికి గాయాలు
పాట్నా: బిహార్లో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కేంద్ర మంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీ స్వల్పంగా గాయపడ్డారు. ఆయన్ను వెంటనే పాట్నాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మంత్రి క్షేమంగా ఉన్నారని పాట్నా పోలీసులు వెల్లడించారు. చికిత్స అనంతరం మంత్రి ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లారు. శరణ్ జిల్లాలోని ఛాప్రాలో జరిగిన ఓ కార్యక్రమంలో రూడీ పాల్గొని పాట్నాకు తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. మంత్రి ప్రయాణిస్తున్న కారు పాక్షికంగా దెబ్బతింది. -
'ఆ బిల్లు యూపీఏ బేబి'
గువాహటి: కావాలనే వస్తు సేవల పన్ను (జీఎస్టీ) బిల్లును కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటోందని కేంద్రమంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీ అన్నారు. ఈ బిల్లు పాసయితే ఆ క్రెడిట్ అంతా ప్రధాని నరేంద్రమోదీ ఖాతాలోకి వెళ్లిపోతుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తోందని చెప్పారు. గురువారం ఆయన గువాహటిలో జీఎస్టీపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఈ విధంగా స్పందించారు. 'దురదృష్టవశాత్తూ కాంగ్రెస్ పార్టీ ఈ విషయాన్ని నమ్ముతోంది. అదేమిటంటే జీఎస్టీ బిల్లు పాసయితే ఆ ఖ్యాతి కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వానికి దక్కుతుందని' అని చెప్పారు. అందుకే కాంగ్రెస్ పార్టీ ఈ బిల్లు పాసవకుండా అడ్డుపడుతోందని ఆరోపించారు. అసలు ఒకప్పుడు యూపీఏకు ఈ బిల్లు పుత్రికలాంటిదని, చాలామంచి చట్టం అని అభివర్ణించారు.