breaking news
Union Minister of Food and Public Distribution
-
ఐసీయూలో కేంద్రమంత్రి రాంవిలాస్ పాశ్వాన్
-
ఐసీయూలో కేంద్రమంత్రి
పట్నా: కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ వ్యవహారాల మంత్రి, లోక్ జనశక్తి పార్టీ అధినేత రాంవిలాస్ పాశ్వాన్ శ్వాస సంబంధింత వ్యాధితో ఆసుపత్రిలో చేరారు. ఊపిరి తీసుకోవడం ఇబ్బందికరంగా మారడంతో డాక్టర్లు ఆయన్ను ఐసీయూలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉందని చెప్పడంతో గురువారం రాత్రి 8:30 గంటలకు ఆసుపత్రికి తీసుకువచ్చినట్టు రాంవిలాస్ పాశ్వాన్ సోదరుడు పశుపతి కుమార్ తెలిపారు. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా పట్నా, కగారియా, బెగుసరాయ్, మొకమ ప్రాంతాల్లో మంత్రి పర్యటించాల్సి ఉంది. రాంవిలాస్ పాశ్వాన్ ఆసుపత్రిలో చేరారన్న విషయం తెలుసుకున్న ఎల్జేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆసుపత్రి వద్దకు చేరుకుంటున్నారు. మంత్రి భార్య, కుమారుడు చిరాగ్ పాశ్వాన్ ఆసుపత్రి చేరుకున్నారని ఎల్జేపీ అధికార ప్రతినిధి అష్రఫ్ అన్సారీ తెలిపారు.