breaking news
treasur
-
కేసీఆర్ పాలనకు అంతం తప్పదు: గూడూరు
సాక్షి, హైదరాబాద్: నాలుగేళ్ల పాటు సాగిన కేసీఆర్ అరాచక పాలనకు అంతం తప్పదని టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి అన్నారు. శనివారం గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ ఆరోగ్యశ్రీని పట్టించుకోకపోవడంతో ప్రజల ప్రాణాలు పోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆపద్ధర్మ ప్రభుత్వాల్లోని సమస్యలపై సమీక్షించే అధికారం ఉన్నా గవర్నర్ ఎందుకు పట్టించుకోవడంలేదని ప్రశ్నించారు. గవర్నర్ గుడికి కాకుండా ఆసుపత్రులకు వెళితే ప్రజల బాధలు తెలుస్తాయన్నారు. హైదరాబాద్‌ను డల్లాస్ చేస్తానన్న కేసీఆర్.. ఖల్లాస్ చేశారని విమర్శించారు. ప్రజలను వంచించడంలో కేటీఆర్ తండ్రిని మించిపోయాడని అభివర్ణించారు. -
గ్రీకువీరుడి సమాధిలో భారీ నిధి!
ఎథెన్స్: దాదాపు 3500 ఏళ్ల నాటి ప్రాచీన వీరుడి సమాధిని తాజాగా గ్రీస్ లో గుర్తించారు. 3500 ఏళ్ల నుంచి చెక్కుచెదరకుండా ఉన్న ఈ సమాధిలో నాటి వీరుడి అస్థిపంజరంతోపాటు భారీ నిధి కూడా లభించింది. అమెరికాకు చెందిన ఆర్కియాలజిస్టులు తవ్వకాలు జరిపి ఈ సమాధిని కనుగొన్నారు. గ్రీస్ లో గత 65 ఏళ్లలో కనుగొన్న ప్రాచీన అవశేషాలలో ఇదే అత్యంత కీలకమైనదని గ్రీకు సాంస్కృతిక మంత్రిత్వశాఖ ప్రకటించింది. గ్రీస్ లోని పెలొపొన్నెస్ ప్రాంతంలో ఉన్న మైసినెయిన్ రాజభవనం వద్ద చెక్కతో చేయబడిన శవపేటికలో ఆనాటి సైనికుడి ఆస్థిపంజరం బయటపడింది. ఈ సైనికుడి గురించి ప్రస్తుతం ఎలాంటి వివరాలు తెలియకపోయినా.. తన కాలంలో అతను ముఖ్య వ్యక్తి అయి ఉంటాడని భావిస్తున్నారు. మెలిమి బంగారు నగలు, మంచి ముత్యాలు, వెండి ఖడ్గంతోపాటు అతన్ని ఖననం చేశారు. వీటితోపాటు ఎనుగు దంతంతో చేసిన హ్యాండిల్, దువ్వెనలు, వెండి పళ్లెము అతని శవపేటికలో ఉంచారు. క్రెట్ ద్వీపంలో క్రీస్తుపూర్వం 2000 ఏళ్ల కిందట వర్ధిల్లిన నాగరికతను పోలినవిధంగా దేవతా విగ్రహాలు, జంతువులు, పువ్వుల బొమ్మలతో ఈ నగలు రూపొందించారు. మినోయన్స్ నాగరికతగా పేరొందిన ఆనాటి కాలానికి సంబంధించి 1400 వస్తువులు దొరికాయని, మినోయన్స్ నాగరికత త్వరాత మైసినియన్ నాగరికతగా పరిణామం చెందిందని సిన్సినాటి యూనివర్సిటీ ఆర్కియాలజిస్టులు జాక్ ఎల్ డేవిస్, షరాన్ ఆర్ స్టాకర్ తెలిపారు.