breaking news
Tough time
-
ఆ సమయం నాకు బ్యాడ్‌లక్.. అందుకే ఏడ్చేశా: పుజారా
ముంబై: చతేశ్వర్ పుజారా.. సమకాలీన క్రికెట్లో అత్యున్నత టెస్టు ఆటగాడిగా ఇప్పటికే తనదైన ముద్ర వేశాడు. జట్టు క్లిష్ట సమయంలో ఉన్నప్పుడు తన అసాధారణ బ్యాటింగ్‌తో ఎన్నోసార్లు టీమిండియాను గట్టెక్కించాడు. అలాంటి పుజారా తన కెరీర్లోనూ గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నట్లు చెప్పుకొచ్చాడు. తన కెరీర్లో అత్యంత క్లిష్టమైన సమయాన్ని ఎలా అధిగమించాననే విషయాన్ని ఇంటర్య్వూలో చెప్పుకొచ్చాడు. ‘నా కెరీర్లో తొలిసారి నేను గాయపడినప్పుడు దాని నుంచి బయట పడటం చాలా కష్టంగా అనిపించింది. ఆ ఇంజ్యురీ నుంచి రికవర్ అవ్వడానికి ఆరు నెలలు పడుతుందని టీమ్ ఫిజియో చెప్పారు. దీంతో నేను చాలా నిరాశ, ఆందోళనకు గురయ్యా. ఏం చేయాలో పాలుపోక ఏడ్చేశా. అప్పుడు నేను నెగిటివ్ మైండ్‌సెట్‌తో ఉన్నా. మళ్లీ క్రికెట్ ఆడగలనా? ఒకవేళ ఆడినా అంతర్జాతీయ స్థాయిలో రాణించగలనా అనే సందేహాలతో నా బుర్ర వేడెక్కిపోయేది. ఒకానొక సమయంలో నా తల్లి దగ్గరకు వెళ్లి ఏడ్చాశా. అయితే నా తల్లి నాకు అండగా నిలబడి.. జీవితంలో ఇలాంటివి ఎన్నో ఎదుర్కోవాల్సి వస్తుందని.. వాటికి సిద్ధంగా ఉండాలంటూ దైర్యం చెప్పింది. నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ కూడా మద్దతుగా నిలబడ్డారు. దీంతో నా భవిష్యత్తు గురించి ఆలోచించడం ఆపేసి, వర్తమానంపై దృష్టి పెట్టా’ అంటూ పుజారా చెప్పుకొచ్చాడు. పాజిటివ్ మైండ్‌సెట్‌తో ఉండటానికి యోగా, మెడిటేషన్, ప్రార్థన తనకు చాలా ఉపయోగపడ్డాయని పుజారా వివరించాడు. ఇక టెస్టు క్రికెటర్‌గా తనదైన ముద్ర వేసిన పుజారా ఐపీఎల్లో ఆడాలని ఉందంటూ తన మనసులోని కోరికను బయటపెట్టాడు. అందుకు తగ్గట్టుగానే ఫిబ్రవరిలో జరిగిన మినీ ఐపీఎల్ వేలంలో సీఎస్కే రూ.50 లక్షలకు కొనుగోలు చేసింది. అయితే ఈ సీజన్లో సీఎస్కే ఆడిన 7 మ్యాచ్‌ల్లోనూ పుజారాకు అవకాశం రాలేదు. తుది జట్టు పటిష్టంగా ఉండడంతో పుజారా బెంచ్‌కే పరిమితమవ్వాల్సి వచ్చింది. అయితే దురదృష్టవశాత్తూ కరోనా సెగ తగలడంతో ఐపీఎల్ 14వ సీజన్ రద్దు అయింది. దీంతో పుజారాకు నిరాశే మిగిలింది. ఐపీఎల్ సీజన్ పూర్తిగా జరిగింటే కనీసం ఒకటి.. రెండు మ్యాచ్‌లైనా ఆడే అవకాశం వచ్చి ఉండేది. ఇక సీఎస్కే గతేడాది ఐపీఎల్ సీజన్‌ను మరిపిస్తూ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఆడిన 7 మ్యాచ్‌ల్లో 5 విజయాలు.. రెండు ఓటములతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. చదవండి: అందరూ సేఫ్‌గా వెళ్లాకే నేను ఇంటికి పోతా! -
'కష్టకాలంలో నాకు అండగా నిలిచింది'
చెన్నై : టీమిండియా మాజీ కెప్టెన్, సీనియర్ వికెట్ కీపర్ ఎంఎస్ ధోని చెన్నైసూపర్ కింగ్స్ పై ప్రశంసల జల్లు కురిపించాడు. 2019 వన్డే ప్రపంచకప్ సెమీస్ ఓటమి అనంతరం దాదాపు 8నెలలు మైదానానికి దూరమైన మహీ ఐపీఎల్ 2020 సీజన్‌తో రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ జార్ఖండ్ డైనమైట్ ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్‌ను మూడు సార్లు చాంపియన్‌గా నిలపడమే గాక 2010,14లో చాంపియన్ లీగ్ టైటిల్‌ను కూడా సాధించిపెట్టాడు.ఇప్పటికే చెన్నై చేరుకున్న ధోనీ సీఎస్కే ట్రైనింగ్ క్యాంప్‌లో ప్రాక్టీస్ కూడా మొదలెట్టాడు. ఈ సందర్భంగా స్టార్‌స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ధోనీ మాట్లాడాడు. ('కోహ్లిని చూస్తే నవ్వొస్తుంది') '2008లో చెన్నై సూపర్‌కింగ్స్‌తో నా ప్రయాణం మొదలైంది.నేను ఒక క్రికెటర్‌గా మరింత మెరుగవడానికి ఎంతో సహాయపడింది.క్రికెటర్‌గా, ఒక వ్యక్తిగా అత్యంత కఠిన పరిస్థితులు ఎదురైనప్పడు చెన్నై ఫ్రాంచైజీ నాకు అండగా నిలిచింది. ఇక చెన్నై ఫ్యాన్స్ నన్ను 'తాళ' అని పిలుస్తుంటారు. తాళ అంటే సోదరుడని అర్ధం. అభిమానులకు నాపై ఉన్న ప్రేమకు కృతజ్ఞతలు. తాళ అని పిలిచారంటే వారు కచ్చితంగా చెన్నై అభిమానులే అయ్యుంటారు.అది నాపై వారికున్న ప్రేమ, గౌరవం' అని చెప్పుకొచ్చాడు. కాగా ధోనీ తన ఐపీఎల్ కెరీర్లో 190 మ్యాచులాడి 4432 పరుగులు చేశాడు. అందులో 23 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. (మ్యాచ్ రద్దయితే.. ఫైనల్‌కు టీమిండియా) -
ఆ ఉద్యోగులకు నిరాశే..
సాక్షి, ముంబయి : సంక్షోభాలతో సతమతమవుతున్న టెలికాం పరిశ్రమ ఉద్యోగులకు చేదు కబురు అందిస్తోంది. గత ఏడాది అత్యంత క్లిష్ట పరిస్థితులను అధిగమించిన క్రమంలో ఈసారి ఈ రంగంలోని 30 నుంచి 40 శాతం ఉద్యోగులకు వేతన పెంపు ఉండదని, బోనస్ సైతం సగానికి సగం తగ్గుతుందని భావిస్తున్నారు. టెలికాం ఆపరేటర్లు, టవర్లను నిర్వహించే సంస్ధలు రాబడి తగ్గి మార్జిన్లు పడిపోవడంతో ఖర్చులకు కోత పెట్టే పనిలో పడ్డారు. ఈ ఏడాది కనీసం 30 శాతం మంది ఉద్యోగులకు ఎలాంటి ఇంక్రిమెంట్ ఉండకపోవచ్చని, బోనస్‌లు సైతం సగానికి తగ్గే అవకాశం ఉందని రిక్రూట్మెంట్ సంస్థ కోర్న్ ఫెర్రీ ఛైర్మన్ నవ్‌నీత్ సిన్హా చెప్పారు. రిలయన్స్ జియో 2016 సెప్టెంబర్‌లో చేపట్టిన టారిఫ్ వార్తో టెలికాం సంస్థలు కుదేలయ్యాయి. వినియోగదారులను నిలబెట్టుకునేందుకు పలు సంస్థలు పోటాపోటీగా టారిఫ్‌లు తగ్గించడంతో కంపెనీల మార్జిన్లు భారీగా పడిపోయాయి. గత ఏడాదిగా పరిస్థితి దారుణంగా ఉందని, 40 శాతం సిబ్బందికి వేతన పెంపు దక్కలేదని సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఓఏఐ) డైరెక్టర్ జనరల్ రాజన్ మ్యాథ్యూస్ పరిస్థితి తీవ్రతను వివరించారు. ఈ రంగంలో చోటుచేసుకుంటున్న నూతన సాంకేతిక మార్పులకు అనుగుణంగా ఉద్యోగుల నైపుణ్యాలను మెరుగుపరచడంపై కంపెనీలు దృష్టిసారించాలని చెప్పారు.టెలికాం కంపెనీలు నిర్వహణ ఖర్చులను తగ్గించుకునేందుకు కసరత్తు చేస్తున్న క్రమంలో ఉద్యోగుల వేతనాల పెంపును విస్మరించకతప్పదని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. -
‘కష్టకాలం’లో దుష్టచింతన!
సందర్భం ఇతరుల బాధలనుంచి తాము లాభపడటం అనే ఈ భయంకర ధోరణి ఎంతగా విస్తరించిందంటే, పంట నష్టాలు, సహాయ చర్యలపై నిర్ణయాలు తీసుకోవడంలో కొత్త పద్ధతులను చేపట్టడం అనివార్యమైపోయింది. వర్షాలు లేదా వాటి పర్యవ సానాల కారణంగా వ్యవసాయరంగంలో సంక్షోభం ఏర్పడటం అనేది భారత్‌లో సర్వ సాధారణ వ్యవహారంలా మారిపోయింది. తదుపరి సంవత్సరంలో మరింత మెరు గుపర్చిన సమర్థతతో ఆ సం క్షోభాన్ని ఎదుర్కోవడానికి బదులుగా, ప్రభుత్వ ఖజా నాను కొల్లగొట్టేందు కోసం మరింత సమర్థవంతమైన మార్గాలను అన్వేషించే ప్రయత్నాలే రానురానూ పెరు గుతున్నాయి. ఎందుకంటే అక్రమంగా వచ్చి పడే డబ్బు నేడు రాజకీయాలను శాసిస్తోంది. ఉన్నతోద్యోగబృదం కూడా దీన్ని చూసీ చూడనట్లుగా ఊరకుండిపోతోంది. స్వచర్మ రక్షణ లేదా అక్రమ సంపదలో తమ వంతు వాటాపై కన్నేయడం దీనికి కారణం కావచ్చు. అకాల వర్షాలు, ఆకస్మిక తుపానుల కారణంగా దేశ వ్యాప్తంగా రబీ సీజన్లో జరిగిన పంట నష్టాల తీవ్రత గురించిన అంచనాలను కేంద్ర ప్రభుత్వం ఇటీవల సవ రించినప్పుడు ఈ విషయం స్పష్టంగా బయటపడింది. కేంద్రం సవరించిన అంచనాల ప్రకారం 75 లక్షల హెక్టా ర్లలోనే పంట నష్టం జరగగా, అంతకుముందు రాష్ట్రాల న్నీ కలిసి 181 లక్షల హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు కేంద్రానికి లెక్కలు పంపాయి. ఈ లెక్కల బాగోతాన్ని తేల్చడానికి ఆయా రాష్ట్రాలను సందర్శించిన కేంద్ర ప్రభుత్వ అధికారులు వాస్తవ నష్టానికి, లెక్కించిన అంచ నాలకు మధ్య అపారమైన వ్యత్యాసం ఉన్నట్లు కను గొన్నారు. ఈ తేడాకు అనుకోని లోపం కారణం కాదు. ఈ ఘటనను ఒక రైతాంగ కార్యకర్త ఇటీవల విడుదలైన ‘ధాగ్’ అనే మరాఠీ సినిమాలోని ఒక దృశ్యం తో పోల్చి చెప్పారు. గ్రామ శ్మశాన భూమిని నిర్వహిస్తు న్న ఒక వ్యక్తి కుటుంబం ఆ ఊరులో చావు ఘటన సంభ విస్తే తెగ సంతోషపడేది. ఎందుకంటే ఆ వ్యక్తి అంత్య క్రియలకు ఇచ్చే రుసుముతో ఆ పూట ఆ కాటికాపరి కుటుంబం కడుపారా ఆరగించవచ్చు. ఆ ఊరిలో ఎవరై నా ముస్లిం చనిపోతే ఆ కాటికాపరికి పరమ చీకాకు వచ్చేది. ఆ శవం తన ఖాతాలోకి రాదు మరి. ఇలా పంట నష్టాన్ని అతిశయించి అంచనాలు పంపిన రాష్ట్రాల్లో రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, హర్యానా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ లదే అగ్రస్థానం. ఇవన్నీ బీజేపీ లేదా బీజేపీ నేతృత్వం లోని ప్రభుత్వాలే కావడం గమనార్హం. ఇక ఉత్తరప్రదేశ్ అయితే నమ్మశక్యం కానంత భారీ స్థాయిలో పంట నష్టంపై అధిక అంచనాలను కేంద్రానికి పంపింది. ఈ ఎనిమిది రాష్ట్రాలు కలిపి 75 లక్షల హెక్టార్లలో పంట నష్టం జరిగిందని అంచనా పంపితే దీంట్లో ఒక్క ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వమే 60 లక్షల హెక్టార్లలో పంట నష్టం అంచనాలను పంపించింది. ఈ 75 లక్షల హెక్టార్ల పంట నష్టం గురించిన అతి అంచనాలను కేంద్రం పసిగట్టడమే కాకుండా తొలి సారిగా దాన్ని బహిరంగపర్చింది. తాము పంపిన అంచ నాలపై ఆధారపడి కేంద్రం తాము కోరుతున్న మొత్తాల ను కచ్చితంగా తగ్గిస్తుందని రాష్ట్రాలకు తెలిసే ఇలా జరుగుతోందనిపిస్తుంది. దీని ప్రాతిపదికన అవి కేంద్రం నుంచి కోరే భారీ మొత్తాల వార్తలు పతాక శీర్షికల్లో వస్తుంటాయి. రైతులు కాస్త ఉపశమనం పొందడానికే తప్ప ఈ వార్తల వల్ల వారికి ఒరిగేదేమీ లేదు. ఇతరుల బాధలనుంచి తాము లాభపడటం అనే ఈ భయంకర ధోరణి ఎంతగా విస్తరించిపోయిందంటే, పంట నష్టాల ను, సహాయ చర్యలను, వాటిని తక్షణం అందించడం గురించి నిర్ణయాలు తీసుకోవడంలో కొత్త పద్ధతులను చేపట్టడం అనివార్యమైపోయింది. సహాయ, పునరావాస చర్యలు ఎవరికి చెందాలో వారికి చెందకుండా పోతున్న దృష్టాంతాలు అనేకం మనముందున్నాయి. మన వ్యవస్థ ఇలాంటి వాటిని జల్లెడలాగా లీక్ చేస్తూనే ఉంది. ఈ క్రమంలో చోటు చేసుకునే జాప్యం కూడా చిన్నదేం కాదు. వర్షపాతం పరంగా, వాతావరణ పరం గా, వ్యవసాయ దిగుబడులు క్షీణత పరంగా ఒకటీ లేదా కొన్ని రాష్ట్రాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమ యాల్లో కేంద్ర ప్రభుత్వం కూడా పాలనా పరమైన క్యాలెండర్ సంవత్సరంలో యాదృచ్ఛికంగా సంభవించే ఉత్పాతాలకు కొన్నిసార్లు నిధులను విడుదల చేయలేదు. ఇలాంటి అనేక సందర్భాల్లో రైతులను కేవలం గణాంకా లుగానే తప్ప, మనుషులుగా గుర్తించనంత యాంత్రి కత కొనసాగుతుంటుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, చాలామంది రాజకీయ నేతలు వ్యవసాయ నేపథ్యం కలిగినవారు లేదా వ్యవసాయంపై ఆసక్తి కలిగిన వారు. అయితే తమ సంపద పన్నేతర వ్యవసాయ రంగం నుంచి వచ్చిన ఆదాయమే తప్ప మరొకటి కాదని ప్రదర్శించుకోవడాని కే తప్ప వారి నేపథ్యం రైతాంగానికి ఏమాత్రం ఉప యోగపడటం లేదు. ఈ బాధాకరమైన పరిణామాలకు సమాధానం ఆత్మహత్యలు కాదు. వాటిని పరిష్కరించడానికి నిజా యితీతో చేసే ప్రయత్నం అవసరం. కానీ నిధుల కేటా యింపులే ప్రధానమై, ఫలితాలు అప్రాధాన్యమవుతున్న చోట ఈ ప్రయత్నాన్ని ప్రారంభించడం ఎలా? నిరాశా నిస్పృహలతో వేసారిపోయి సమీపంలోని వేప చెట్టుకు ఉరి బిగించుకోవడాన్ని నివారించాలంటే వేగంగా స్పం దించడం అత్యంత అవసరం. దీనికి కావలసింది ప్రక్రియలో మార్పు కాదు.. మనస్థితిలో మార్పు. 1980ల మొదట్లో నా దృష్టికి వచ్చిన విషయమిది. 1970ల మధ్యలో రాయలసీమ ప్రాంతంలో రూ.49 కోట్ల విలువైన కరువు సహాయక చర్యలతీరును పరిశీలిం చిన ఒక అధికారి ఆ మొత్తాన్ని అక్కడి అధికారులే దిగమింగడాన్ని నాతో ప్రస్తావించారు. బంజరు భూము ల్లో పెరిగిన చెట్లను కూలీలతో తొలగించినట్లు తప్పుడు గా నమోదు చేసిన అధికారులు.. సిమెంట్ స్టాక్‌ను నేతల సాయంతో దారి మళ్లించారని ఆయన చెప్పారు. ప్రభుత్వాలు రైతులకు మేలు చేకూర్చే సాకుతో కరవు గురించి రూపొందిస్తున్న అతి అంచనాలు అవధులు మీరిన స్థాయిల్లో కొనసాగుతున్నాయి. ఎవ్రీబడీ లవ్స్ ఎ గుడ్ డ్రాట్ (పెంగ్విన్, 1996) అనే తన పుస్తకంలో పి సాయినాథ్ ఈ విషయంపై చెప్పినవి నూటికి నూరుపాళ్లూ నిజమే. వాళ్లు కరవును ఎందుకు ప్రేమిస్తున్నారో మనకు తెలుసు. (వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు) mvijapurkar@gmail.com