Theatre Artist
-
ఒక్క నాటకంతో బంగళాలు, ఖరీదైన కార్లు!
‘అద్రక్ కే పంజే’ నాటకానికి అన్నీ తానే అయి దేశదేశాల్లో ప్రదర్శించి పేరు ప్రఖ్యాతులు పొందిన బబ్బన్ ఖాన్ హైదరాబాద్‌లో ఈ నెల 17న కన్నుమూశారు. 1980–90 కాలంలో ‘దక్కన్ క్రానికల్’లో సినిమా ప్రకటనలతో పాటు ‘అద్రక్ కే పంజే’ ప్రదర్శన సమాచారం వచ్చేది. రవీంద్ర భారతిలో నెల రోజుల పాటు రోజుకు రెండు షోలు ఉంటాయనీ, షో వేళలు, టికెట్ల రేట్లు, తదితర వివరాలు ఆ ప్రకటనలో ఉండేవి. 60 దేశాల్లో 14 భాషల్లో 10 వేలకు పైగా ఈ నాటక ప్రదర్శనలు కొనసాగాయి.అంతగా ఈ నాటకం ప్రజాదరణ పొందడానికి కారణం సమకాలీన సామాజిక అంశాలపై బబ్బన్ పేల్చే వ్యంగ్య సంభాషణలే. ముందస్తు స్క్రిప్ట్ లేకుండా ఏ రోజుకారోజు కొత్త విషయాలను చేర్చుకుంటూ ప్రేక్షకులను అలరించడమే దీని ప్రత్యేకత. అల్లపు కొమ్ములు అడ్డదిడ్డంగా పెరగడాన్ని నేటి సమాజపు పోకడకు అన్వయించేలా నాటకానికి ఆ పేరు పెట్టారు. బ్యాంక్ క్లర్క్ కుటుంబ నేపథ్యంలో సాగే ఈ నాటకంలో బబ్బన్ ప్రధాన పాత్రధారి. భార్య, పిల్లలు, ఇంటికి వచ్చిపోయేవాళ్ల పాత్రలను ఆయన కుటుంబ సభ్యులే వేసేవారు. ఇంటి కిరాయి, పాల బిల్లు, పిల్లల ఫీజులు, కిరాణా వస్తువులకు ఆదాయం సరిపోక పడే ఇబ్బందులే ప్రధాన అంశాలు.హైదరాబాద్‌లో 1943లో జన్మించిన బబ్బన్ ఖాన్ (Babban Khan) బాల్యం నుండే పేదరికాన్ని అనుభవించాడు. ఆయన కన్నా ముందు పుట్టిన పిల్లలు పౌష్టికా హార లోపంతో చనిపోయారు. ఇతను కూడా బతుకుతాడనే నమ్మకం లేక ఆయనకు పేరు పెట్టలేదు. ముద్దుగా బబ్బన్ అని పిలుచుకొనేవారు. పదేళ్లు బతికాక అదే పేరు ఖాయం అయింది. ఆరేళ్లకే తండ్రిని కోల్పోయిన బబ్బన్ ఇంట్లో కరెంటు లేనందువల్ల వీధి దీపం కింద కూచొని 22వ ఏట ఈ నాటకాన్ని మూడు గంటల వ్యవధిలో రాశాడు.చదవండి: 'మూసీ నది బాగుపడాలంటే చేయాల్సింది ఇది'తల్లి మెడలో ఉన్న ఒకే ఒక బంగారు నగని అమ్మేసి, వచ్చిన సొమ్ముతో తొలి ప్రదర్శనను 1965లో రవీంద్ర భారతిలో ఏర్పాటు చేశాడు. ఆనాటి నుంచి వెనక్కి తిరిగి చూడలేదు. పేదరికంలో పుట్టిన బబ్బన్ను ఈ నాటక విజయం బంగళాలు, ఖరీదైన కార్లు కొనే స్థాయికి తీసికెళ్ళింది. 1984లోనే అయిదు వేలకు పైగా ప్రదర్శనలు పూర్తి చేసుకొని గిన్నిస్ బుక్‌లో చేరింది. మార్గరెట్ థాచర్, నెల్సన్ మండేలా, ఇందిరా గాంధీ వంటి ప్రముఖులు దీన్ని తిలకించారు. బబ్బన్ ఖాన్ ఒక్కరే చేయగల నాటకం అద్రక్ కే పంజే!– బద్రి నర్సన్ కవి–కథకుడు -
పౌరాణికానికి పద్యాలంకరణ
తెలుగు నాటక కళారంగంలో వల్లూరు శ్రీహరి రావు పద్యనాటక నిపుణులు. ‘గాన కోకిల’, ‘మధుర కంఠీరవ’గా బిరుదులు పొందినవారు. ఏడు పదుల వయసులోనూ రాముడుగా, కృష్ణుడుగా పౌరాణిక పాత్రలో రాణిస్తూ కళాభిమానుల ప్రశంసలు అందుకుంటున్నారు. హైదరాబాద్‌లోని సీతాఫల్మండిలో ఉంటున్న ఈ పద్య నాటక కళాకారుడు నేడు ప్రపంచ నాటక రంగ దినోత్సవం సందర్భంగా నాటకరంగం గురించి, చేసిన విశేష సాధన గురించి ప్రస్తావించారు.‘‘ఇప్పుడు నాకు డెబ్భైఆరేళ్లు. మొన్నటి ఉగాది ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌లోని రామానాయుడు కళామండపం లో జరిగిన వేదికపైన ప్రదర్శన ఇచ్చాను. శారీరకంగా కాస్త అలసటగా అనిపించినా, గొంతు మాత్రం పద్యంతో ఇంకా పదం తొక్కుతూనే ఉంది. ఇది ఆ రాముడు ఇచ్చిన శక్తే. అదే నన్ను ఇంకా సజీవంగా ఉంచుతోంది. వదలని ప్రేమ... జీవితాన్ని ప్రతిబింబించేది నాటకమైతే, నాటకానికి ప్రతిస్పందించేది జీవితమే. పదిహేనేళ్ల వయసులో మా పెదనాన్న కుమారుడు వల్లూరు కామేశ్వరరావు ద్వారా నాటకరంగంలోకి వచ్చాను. కంఠం బాగుందని, పద్యాలు పాడించి ప్రోత్సహించేవారు. ఆ విధంగా సతీ సక్కుబాయిలో ‘జ్ఞానయోగి’ గా ప్రేక్షకుల ముందుకు వచ్చాను. ఆ తర్వాత పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్రలో సిద్ధయ్యగా రేణుకా మహత్యంలో ‘నారదుని’గా, కనకదుర్గ మహత్యంలో ‘శంకరుని’గా శ్రీరామాంజనేయ యుద్ధంలో ‘శ్రీరాముని’గా, కురుక్షేత్రం గయోపాఖ్యానంలో శ్రీకృష్ణునిగా, తులసి జలంధరలో ‘దేవేంద్రుని’గా, పాండవ సౌశీల్యంలో ధర్మరాజు’ గా సాయినాథ ప్రస్థానంలో ‘శ్యామా’గా... వివిధ రకాల పాత్రలను పోషించాను. పోషిస్తూనే ఉన్నాను. ఏ పాత్ర ప్రత్యేకత దానిది. పద్యాలను నుడికారాలతో సహా కంఠస్థం చేస్తూ గొంతును నాటకానికి మేటిగా మార్చుకున్నాను. రాముడిగా, కృష్ణుడిగా పాత్రలు పోషించేటప్పుడు ప్రేక్షకులు రాముడిగా భావించి, నాటకం పూర్తయ్యేక నమస్కరించేవారు. అది నాటకం ద్వారా రాముడే ఇచ్చిన గౌరవంగా భావిస్తాను. ఇప్పటికీ ప్రతిరోజూ పద్యాలు సాధన చేస్తూనే ఉంటాను. నాటి నుంచి నేటి వరకు ఏనాడూ ఈ కళను వదిలింది లేదు. నాకరంగంలో తెలుగు రాష్ట్రాలలో సీనియర్ రంగస్థల నటుడిగా గౌరవ పురస్కారాలు అందుకున్నాను.తెల్లవార్లూ పాత్రలో లీనమై... రాత్రి ఎనిమిది గంటలకు నాటకం మొదలైతే తెల్లవారు ఝాము వరకు పాత్రలో జీవిస్తూనే ఉంటాం. సన్నివేశాలను బట్టి ఒక్కో నాటకానికి 40 పద్యాలపైనే ఉంటాయి. ప్రేక్షకులు కూడా తెల్లవార్లూ నాటకాన్ని ఆస్వాదిస్తుంటారు. ఇప్పుడు డిజిటల్ టీవీలు వచ్చాక లైవ్ టెలీకాస్ట్లు కూడా ఇస్తున్నారు. దీనివల్ల ప్రదర్శనకు రాలేని, నాటకంపైన అభిమానం ఉన్న నాటి తరం వాళ్లు లైవ్‌లో చూస్తుంటారు.పోషణకు మరో ఉపాధి... నేను నాటకంలో పాల్గొనాలంటే నాతో పాటు మరో ఇద్దరు వ్యక్తులు కూడా రావాలి. ఒకరు హార్మోనిస్ట్, మరొకరు మేకప్ ఆర్టిస్ట్. నాటకరంగం ఊపిరిగా కొనసాగుతున్నా జీవనోపా«ధి, కుటుంబ పోషణ కోసం ప్రైవేట్‌గా ఉద్యోగాలూ చేశాను. నా చిన్నతనంలోనే మా అమ్మనాన్నలు చనిపోయారు. నా తరువాత ఐదుగురు చెల్లెళ్లు. పసిపిల్లలుగా ఉన్నవారిని పెంచి, పెద్ద చేసి, పెళ్ళిళ్లు జరిపించాను. ఇప్పడు అందరూ వారి వారి కుటుంబాలతో సంతోషంగా ఉన్నారు. నా భార్య సూర్యకుమారి. ఆమెకు నలుగురు చెల్లెళ్లు. మాకు ముగ్గురు పిల్లలు. పిల్లల చదువుల కోసం మా స్వస్థలం కృష్ణా జిల్లా నుంచి హైదరాబాద్‌కు వచ్చాం. ఇప్పుడు పిల్లలందరి బాధ్యతలు పూర్తయ్యి, విశ్రాంత జీవనంలో ఉన్నాం.పెన్షన్ సదుపాయం లేదు... నేటికీ మన తెలుగు పండగలైన వినాయకచవితి, దసరా, సుబ్రహ్మణ్యషష్టి, ఉగాది, శ్రీరామనవమి.. వంటి వేడుకల సమయాలలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాలలో వేదికల మీద నా ప్రతిభ చూపే అవకాశం నేటికీ లభిస్తున్నది. దీని ఆధారంగానే నా జీవనం గడుస్తుంది. కళాకారులకు ఇచ్చే పెన్షన్ సదుపాయం ప్రభుత్వం నుంచి ఏదీ అందడం లేదు. అయినా ఆ కళా రంగమే నాకు ఇంకా ఇంత ముద్దపెట్టి, ఆదుకుంటోంది. నాలాంటి కళాకారులు ఇంకా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ కళను బతికించుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. నాతో పాటు కళను నమ్ముకుని బతుకుతున్న నిరుపేద కళాకారుల కుటుంబాలు ఉన్నాయి. పద్యనాటక కళాకారులను ప్రోత్సహించి, వారు ప్రదర్శనల్లో పాల్గొనేలా నా వంతు సాయం చేస్తుంటాను’’ అంటూ తాను చేస్తున్న నాటక కళారాధన గురించి తెలియజేశారు ఈ కంఠీరవుడు.– నిర్మలారెడ్డి సాక్షి ఫీచర్స్ ప్రతినిధిఫొటోలు: గడిగె బాలస్వామివల్లూరు శ్రీహరి రావు -
మళ్ళీ మన ముందుకు... అలనాటి ఆ మహామహులు!
నూరు వసంతాలు దాటిన తెలుగు నాటక ప్రస్థానంలో ఎన్నో మెరుపులున్నాయి. మరెన్నో నేర్చుకున్న పాఠాలున్నాయి. ఉత్తుంగ తరంగమై నిలిచి, ఉత్థాన పతనాలెన్నో చూసిన ఈ రంగస్థల స్రోతస్విని ప్రయాణంలో ఎందరో మహానుభావులు... తమ జీవితాన్నే కళకు దివ్య సమర్పణం చేసిన ఎందరెందరో మహామహులు.రంగస్థలం, ఆ వెనుక దాన్ని అనుసరించి వచ్చిన వెండితెర రంగుల ప్రపంచం... ఉభయత్రా తమ ప్రతిభా సంపత్తులతో ఆ రంగాలకు కొత్త కాంతులు జోడించిన ఆ దివ్యమూర్తులను నేటి తరానికి పరిచయం చేస్తే? వారిని స్మరిస్తూ, వారి గానం, అభినయాలను శ్రవ్య – దృశ్య రూపంలో కళ్ళ ముందు నిలిపితే? ఆ రూపంలో కొత్త తరానికి మన ‘అలనాటి నాటక ప్రస్థానం’పై స్థూలంగా అవగాహన కలిగిస్తే? అదిగో.... అలాంటి విశిష్ట ప్రయత్నమే ‘అలనాటి నాటక ప్రస్థానం’.పరిశోధన, పరిశ్రమల మేళవింపుగమనిస్తే... 1880ల నుంచి ఇప్పటి వరకు ఎందరో నటులు, నాటక కర్తలు, దర్శకులు, సాంకేతిక నిపుణుల ప్రతిభాపాటవాల వల్లే తెలుగు నాటక రంగం ఇప్పటి అత్యున్నత స్థితిని చేరుకుంది. అయితే, తెలుగునాట నాటక విమర్శ, పరిశోధన... రెండూ తక్కువే. మన తెలుగు నాటక చరిత్రను కూలంకషంగా గ్రంథస్థం చేసినదీ అతి స్వల్పమే. బళ్ళారి రాఘవ నుంచి నిన్న మొన్న దివంగతులైన వందలాది నటీనటుల అభినయ వైదుష్యం అరకొరగా అయినా అక్షరాల రూపంలో ఉందేమో కానీ, వారి గాన మాధుర్యం, నట వైదుష్యాలను ప్రత్యక్షంగా చూసినవారు నేడు అరుదు. అలాంటి పరిస్థితుల్లో... అంతకంతకూ చదవడం తగ్గిపోతున్న నవతరాన్ని సైతం దృష్టిలో పెట్టుకొని, మన నాటక రంగ శ్రవ్య, దృశ్య వైభవాన్ని రూపకంగా అందించేందుకు చేసిన ప్రయత్నం ఇది. ఈ తరానికి అలవాటైన, అందరికీ అందుబాటులో ఉన్న యూ ట్యూబ్ వేదికగా ‘అజో... విభో... కందాళం ఫౌండేషన్’ ఈ అరుదైన కానుకను సమర్పించింది.అలా... నాటి మేటి నటీనటుల శ్రవ్య – దృశ్య కళారూపకం ఈ ‘అలనాటి నాటక ప్రస్థానం’. మొత్తం 8 భాగాలుగా దీన్ని అందించారు. అన్ని భాగాలూ కలిపి దాదాపు 10 గంటల నిడివి గల సిరీస్ ఇది. ఒక్కమాటలో ఈ సిరీస్ ఎంతో శ్రమతో సాగించిన యజ్ఞం. ప్రముఖ నాటక రంగ పరిశోధకుడు – రచయిత డాక్టర్ కందిమళ్ళ సాంబశివరావు ఈ రూపకం కోసం అనేక నెలల పాటు పరిశోధించారు. సంబంధిత నటీనటుల దృశ్య, శ్రవ్య ఖండికల సేకరణ నిమిత్తం చాలానే పరిశ్రమించారు. ఆ పరిశోధన, పరిశ్రమ... ఈ రూపకాన్ని చూస్తున్నప్పుడు కళ్ళకే కాదు... మనసుకు కూడా తడతాయి.మూడేళ్ళ క్రితమే... మరో మహత్తర అక్షర కృషికొద్దిగా వెనక్కి వెళితే... ‘అజో-విభొ- కందాళం ఫౌండేషన్’ వారే మూడేళ్ళ క్రితం ‘తెలుగు నాటకరంగ మూలస్తంభాలు’ పేరిట అపూర్వమైన గ్రంథాన్ని ప్రచురించారు. తెలుగు నాటకరంగ అభివృద్ధికి కృషి చేసిన తొలి, మలి తరాల రచయితలు, నటులు, దర్శకులు, సాంకేతిక నిపుణుల సంక్షిప్త పరిచయాలతో కూడిన వ్యాస సంకలనం అది. తెలుగు రంగస్థలంపై వారి ప్రాథమిక కృషితో పాటు అరుదైన వారి ఛాయాచిత్రాలను కూడా గుదిగుచ్చిన దాదాపు వెయ్యి పేజీల బృహత్ గ్రంథమది. ఆ రచన కూడా డాక్టర్ కందిమళ్ళ సాంబశివరావు చేసినదే! మరో రచయిత వాడ్రేవు సుందరరావు ఆ కృషిలో ఆయనకు భాగస్వామిగా వ్యవహరించారు. అందులో 120 మంది నాటక రచయితలు, 117 మంది నటులు – దర్శకులు, 24 మంది సాంకేతిక నిపుణులు... వెరసి 261 మంది దివంగత మహనీయమూర్తుల గురించిన సమాచారం, అపురూపమైన ఫోటోలతో అందించారు.ఒక రకంగా ఆ బృహత్ రచన సమయంలోనే కందిమళ్ళకు ఈ ‘అలనాటి నాటక ప్రస్థానం’ శ్రవ్య – దృశ్య రూపకం ఆలోచన వచ్చి ఉండాలి. ‘తెలుగు నాటకరంగ మూలస్తంభాలు’ బృహత్ ప్రయత్నాన్ని అక్షర రూపంలో అందించిన ఆయన ఈసారి ఈ ‘అలనాటి నాటక ప్రస్థానం’ అనే ఈ కొత్త ప్రయత్నానికి ఆడియో – విజువల్ పద్ధతిని ఎంచుకున్నారు. బుక్ కల్చర్ కన్నా లుక్ కల్చర్ లోకి ఎక్కువగా ఆకర్షితులవుతున్న నవతరాన్ని ఆకట్టుకొనేలా, అలనాటి నటీనటుల కృషి తెలిసేలా వారే పాడిన గ్రామఫోన్ రికార్డులు, నటించిన సినిమాలలోని దృశ్యాలు కష్టపడి సేకరించి, ఈ అరుదైన రూపకాన్ని రూపొందించారు. అందమైన మాలగా గుదిగుచ్చారు. ఈ ప్రయత్నం రంగస్థల అభిమానులందరికీ అమితమైన ఆనందం పంచుతుంది. పేర్లు చదవడమే తప్ప, ప్రత్యక్షంగా తాము చూడని అమరులైన దాదాపు 84 మంది అలనాటి సుప్రసిద్ధ నటీనటులను మళ్ళీ కళ్ళ ముందు ఉంచుతుంది. అప్పటి వారి మాట, పాట, అభినయాలను ఈ తరం మళ్ళీ మళ్ళీ చూసుకొనే అవకాశం కల్పిస్తుంది.కళ్ళ ముందు... నాటి అపూర్వ కళాప్రతిభబళ్ళారి రాఘవ, బలిజేపల్లి లక్ష్మీకాంతం, యడవల్లి సూర్యనారాయణ, వేమూరి గగ్గయ్య, స్థానం నరసింహారావు, మాధవపెద్ది వెంకట్రామయ్య, తుంగల చలపతిరావు, బందా కనకలింగేశ్వరరావు, అద్దంకి శ్రీరామమూర్తి, దాసరి కోటిరత్నం లాంటి 1920 – 30ల తరం ఈ రూపకంలో కనిపిస్తారు. అలాగే, ఆధునికులైన గరికపాటి రాజారావు, కె. వెంకటేశ్వరరావు, ఎ.ఆర్. కృష్ణ, చాట్ల శ్రీరాములు, బుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రి మొదలు జమునా రాయలు వరకు పలువురి పాటలు, పద్యాలు, నటన నిండిన వీడియోలు కూడా ఇందులో ఉన్నారు. ఎంతో శ్రమ, ఖర్చుతో కూడిన ఈ బృహత్తర యజ్ఞానికి ‘అజో- విభొ- కందాళం ఫౌండేషన్’ పక్షాన ఆచార్య అప్పాజోస్యుల సత్యనారాయణ ఆర్థికంగానూ, అన్ని విధాల గానూ అండగా నిలిచారు. ఈ పదిగంటల రూపకాన్ని పూర్తిగా ఉచితంగా, అందరికీ అందుబాటులో ఉంచారు.యూ ట్యూబ్ వేదిక కావడం ఈ శ్రవ్య – దృశ్య కళారూపకానికి ఉన్న ప్రధానమైన వెసులుబాటు. ఎందుకో తెలియని పరుగుపందేలతో, ఎప్పుడూ తీరిక దొరకని ఈ ఆధునిక కాలంలో... ఎవరి వీలును అనుసరించి వారు ఎక్కడైనా, ఎప్పుడైనా ఈ భాగాలను చూసే సౌకర్యం లభిస్తుంది. దేశ విదేశాలలోని నాటక రంగ ప్రియులకూ, పరిశోధకులకూ అలా ఇది ఓ అయాచిత వరం.తొలిసారిగా... జంట నగరాల్లో!ఇటీవలే గుంటూరులో లాంఛనంగా ఆవిష్కరణ జరుపుకొన్న ఈ రూపకాన్ని ఇప్పుడు హైదరాబాద్ – సికింద్రాబాద్ జంటనగరాల్లోని కళాభిమానులకు తొలిసారిగా పరిచయం చేయనున్నారు. ‘అజో-విభొ-కందాళం ఫౌండేషన్’, ప్రముఖ రంగస్థల వేదిక ‘రసరంజని’ సంయుక్తంగా ఆ పరిచయ సభను నిర్వహిస్తున్నాయి. తెలుగు నూతన సంవత్సర కానుకగా ఈ మార్చి 23, సోమవారం సాయంత్రం 6 గంటలకు ఈ పరిచయ సభ జరగనుంది. హైదరాబాద్ రవీంద్రభారతిలోని పైడి జైరాజ్ థియేటర్లో జరిగే ఈ ప్రత్యేక కార్యక్రమంలో నాటక రంగ ఆచార్యులు డాక్టర్ డి.ఎస్.ఎన్. మూర్తి, కళాపోషకులు – ప్రభుత్వ మాజీ సలహాదారు కె.వి. రమణాచారి, సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్లర్ ఆచార్య వెలుదండ నిత్యానందరావు, కేంద్ర సంగీత – నాటక అకాడెమీ పురస్కార గ్రహీత దీర్ఘాసి విజయభాస్కర్, రూపకాన్ని రూపొందించడానికి శ్రమించిన కందిమళ్ళ సాంబశివరావు, ఆచార్య అప్పాజోస్యుల సత్యనారాయణ తదితరులు పాల్గొంటున్నారు. పది గంటల నిడివి గల ఈ ‘అలనాటి నాటక ప్రస్థానం’ రూపకాన్ని ఆనాటి సభలో ఒక గంట నిడివికి కుదించి, ముఖ్యాంశాలను సభికులందరికీ ప్రదర్శించనుండడం విశేషం. “ఉజ్జ్వలమైన మన గత చరిత్ర, కళారంగంలో మనవాళ్ళు చేసిన ఘనమైన కృషి... నేటికీ సరైన రీతిలో రికార్డు కాలేదు. మన తెలుగు నాటక రంగ పరిణామ క్రమాన్ని వివరిస్తూ, మన సాంస్కృతిక ఘన వారసత్వాన్ని తరువాతి తరాలకు పదిలంగా అందించడం కోసం చేయాల్సింది చాలా ఉంది. ఆ భగీరథ ప్రయత్నంలో నా వంతుగా కళాసరస్వతికి సభక్తికంగా సమర్పించిన చంద్రునికో నూలుపోగు... ఈ ‘అలనాటి నాటక ప్రస్థానం’ రూపకం” అని రంగస్థలంపై అనేక పరిశోధనాత్మక రచనలు చేసిన కందిమళ్ళ సాంబశివరావు వివరించారు.ఒక్కమాటలో... తెలుగు నాటకం, సినిమాలు రెంటితోనూ ముడిపడ్డ అలనాటి మహామహుల కృషిని ఇప్పుడు ప్రత్యక్షంగా చూసేందుకు, వినేందుకు ఈ రూపకం ఓ అద్భుత అవకాశం. నాటక రంగ అభిమానులకే కాదు... మన ఘన చరిత్రపై ఆసక్తి ఉన్నవారందరికీ ఈ కళారూపకం మృష్టాన్నభోజనం. దృశ్య – శ్రవ్య వేదికల్లో నాటి ప్రయోగాల నుంచి నేటి వరకు వచ్చిన మార్పులను తులనాత్మకంగా అధ్యయనం చేయదలుచుకున్నవారికైతే... ఇది సిద్ధాన్నం. తాజా పరిచయ సభ సాక్షిగా పెద్దల మాటలు వింటూ, మన రంగస్థల కళా చరిత్రను దృశ్యరూపంలో ఆస్వాదించే అపూర్వ అవకాశానికి అందరూ ఆహ్వానితులే.- రెంటాల జయదేవ -
జెండర్, లైంగిక సమస్యల పరిష్కారంలో థియేటర్ రోల్
వర్గం, మతం, జెండర్, లైంగిక సమస్యలను పరిష్కార దిశగా న్యూ ఢిల్లీలోని కిరణ్ నాడార్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ థియేటర్లో జరిగిన ఫెస్టివల్ నటీనటుల పెర్ఫార్మెన్స్ను సరికొత్తగా చూపింది. లైంగికతతో పాటు సామాజిక దుర్బలత్వాలను పరిష్కరించడంలో ఈ సమకాలీన థియేటర్ దృష్టి పెడుతుంది.ఫెస్టివల్ క్యూరేటర్‌గా ఉన్న బెంగళూరుకు చెందిన నటుడు, దర్శకుడు, చిత్రనిర్మాత కీర్తన కుమార్ కొత్త విషయాలను అన్వేషించే నాటకాలను ఒకచోట చేర్చాలని కోరుకున్నారు. అలాగే ‘ఈ రోజుల్లో కళాకారులు ఎలాంటి నాటకాలు వేస్తున్నారు’ అనే అంశం గురించి సంభాషణలను ప్రోత్సహించారు. ‘ఈసారి దృష్టి సమకాలీన థియేటర్‌పై ఉంది. ఎందుకంటే కళాకారులు ఏం చెబుతున్నారో తెలుసుకోవాలనే ఆసక్తితో ΄ాటు వారు ఏ రంగస్థల రూపాలు, భాషలను అన్వేషిస్తున్నారు, ఏ సమస్యలు వారిని ఉత్తేజపరుస్తాయి, ఎలా సృష్టిస్తారు, డబ్బు సమస్యలేంటి, వారి ప్రేరణ ఏమిటి, ఏం వ్యక్తం చేయాలనుకుంటున్నారు...అనేవి ఈ విధానం ద్వారా తెలుస్తుంది. అంతేకాదు జాతీయ దృష్టిని ఆకర్షించని కళాకారుల నాటకాలు, వారి ఆలోచనలు, రూపాలను ఆహ్వానించాలనుకుంటున్నాను’అని కీర్తన కుమార్ చెప్పింది.ఇతిహాసాల నుంచి...మైసూరు ప్రాంతాలకు సమీపంలో ఉన్న మలే మహదేశ్వర కొండలలోని హలు కురుబా కమ్యూనిటీ పురుషులతో అనుబంధించబడిన బీసు కంసలే అనే విన్యాస జానపద రూపంతో ఈ పండుగ ప్రారంభమైంది. దీని తర్వాత కటకథ పప్పెట్ ఆర్ట్స్ ట్రస్ట్ సమర్పించిన ది నైట్స్, అరేబియన్ నైట్స్ సిరియన్, చైనీస్, ఇండియన్ వెర్షన్లకు తోలుబొమ్మల గౌరవం, కీటకాలతో నిండిన అద్భుత ప్రపంచంలోకి ప్రేక్షకులను స్వాగతించింది. ఇంకా, రామాయణంలోని అరణ్యకాండ నుండి తీసుకున్న అడవిలో నివసించే సోదరులు, వాలి మరియు సుగ్రీవుల కథను పరిచయం చేసింది.మోహిత్ తకల్కర్ రాసిన ‘లవ్ అండ్ ఇన్ఫర్మేషన్ ఛానల్–హోపింగ్ / సోషల్ మీడియా స్క్రోలింగ్’ వేగాన్ని ప్రతిబింబిస్తుంది. అభి తాంబే ద్వారా పోర్టల్ పెయిటింగ్, థియేటర్లో రాక్ షో అనుభవం మనల్ని సమ్మోహితులను చేస్తాయి. నిషా అబ్దుల్లా సోలో ప్రదర్శన. ఇది పోగొట్టుకున్న, శాశ్వతమైన స్నేహాల గురించి మాట్లాడటానికి పాట, కథ, పురాణం, చరిత్రను కలిపి అల్లినది. -
డైరెక్టర్ బతిమాలినా.. ఆ నటుడు వినలేదు!
సూపర్హీరోయిజం అనేది జస్ట్ ఒక ఎక్స్‌ఫ్యాక్టర్ మాత్రమే. బేసిక్ ఎమోషన్స్‌తో డీల్ చేయగలిగినప్పుడు మాత్రమే అది జనాలకు ఎక్కుతుంది. ఐరన్ మ్యాన్ క్యారెక్టర్ కనెక్టివిటీనే అందుకు ఒక ఎగ్జాంపుల్. మిన్నల్ మురళితో సక్సెస్ అందుకున్న దర్శకుడు బసిల్ జోసెఫ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు. టోవినో థామస్ లీడ్ రోల్లో తెరకెక్కిన సూపర్ హీరో మూవీ నెట్‌ఫ్లిక్స్ ‘మిన్నల్ మురళి’.. మాతృక మలయాళంతో పాటు డబ్బింగ్ వెర్షన్ ద్వారా తెలుగులోనూ ఆకట్టుకుంటోంది. మెరుపు దెబ్బకి సూపర్ పవర్స్ దక్కించుకున్న ఇద్దరి కథే ఈ చిత్రం. ఇందులో ప్రతీ క్యారెక్టర్ ఏదో ఒక రకంగా అలరించేదే. అయితే హీరో తర్వాత షిబు క్యారెక్టర్ జనాలకు ఎక్కువ ఎంటర్టైన్మెంట్ని, అదే టైంలో ఎమోషన్స్‌ని సైతం పంచుతుంది. మిన్నల్ మురళి చిత్రంలో షిబు క్యారెక్టర్ని పోషించింది నటుడు గురు సోమసుందరం. కోలీవుడ్ థియేటర్ ఆర్టిస్ట్ అయిన ఈయన. ఒకవైపు ఎమోషన్స్‌తో పాటు నెగెటివ్ షేడ్స్‌ను అద్భుతంగా పండించాడు. అయితే ఈ క్యారెక్టర్లోకి పరకాయ ప్రవేశం చేసే ముందు దర్శకుడు చేసిన ఓ రిక్వెస్ట్‌ను సున్నితంగా తిరస్కరించాడట ఆయన. వాకిన్ ఫినిక్స్ లీడ్రోల్లో నటించిన హాలీవుడ్ చిత్రం ‘జోకర్’ చూసి.. ఆ తరహా మాడ్యులేషన్‌ను షిబు క్యారెక్టర్ కోసం డెవలప్ చేయమని గురు సోమసుందరానికి సూచించాడట డైరెక్టర్ బసిల్ జోసెఫ్. కానీ, గురు సోమసుందరం మాత్రం అందుకు కుదరదని తేల్చి చెప్పాడట. దీంతో బసిల్ బతిమాలడడం మొదలుపెట్టాడట. అయినా ఆయన నో అనే అనేశారట. వాకిన్ ఫినిక్స్ లాంటి నటుడంటే తనకు ఇష్టమేనని, కానీ, షిబూ క్యారెక్టర్ కోసం వెస్ట్రన్ యాక్టింగ్ టెక్నిక్‌ల ప్రభావం తనపై పడడం తనకు ఇష్టలేక ఆ పని చేయనని చెప్పానని షిబూ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.‘థియేటర్ ఆర్టిస్టులకు శిక్షణలో ఒక విషయాన్ని నేర్పిస్తారు. సినిమా స్టోరీ టెల్లింగ్ అనేది రీజియన్, ఇండియన్, వెస్ట్రన్ సినిమాగా విభజిస్తారు. దాని ప్రకారం ఇతర పాత్రల ప్రభావం.. తమ మీద ఉండకూడదని నటులు బలంగా ఫిక్స్ అవ్వాలి. కానీ, చాలామంది హీరోలు దీనికి భిన్నంగా.. హాలీవుడ్, ఇతర భాషల హీరోలను అనుకరిస్తారు. థియేటర్ ఆర్ట్ మీద నాకు అభిమానం ఎక్కువ. అందుకే నేను ఆ కండిషన్‌కు ఒప్పుకోలేదు. అయినా మా డైరెక్టర్ కన్విన్స్ అయ్యాడు’’ అని చెప్పుకొచ్చారు 46 ఏళ్ల గురు సోమసుందరం. మలయాళం రాకపోయినా బసిల్ తనకు షిబు క్యారెక్టర్ని ఆఫర్ చేసినప్పుడు ఆశ్చర్యపోయానని, కానీ, ఇప్పుడు షిబు క్యారెక్టర్ ద్వారా బాలీవుడ్ ఆఫర్లు సైతం వస్తున్నాయని సంతోషంగా చెప్తున్నారు గురు సోమసుందరం . కోలీవుడ్ మూవీ ‘ఆరణ్య కాండం’తో వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన గురు సోమసుందరం.. పాండియ నాడు, జిగరతాండ, తూంగ వనం, పెట్టా, మారా, జై భీమ్ లాంటి సినిమాలతో మంచి గుర్తింపు దక్కించుకున్నారు. ఇక మిన్నల్ మురళిలో తన చిన్ననాటి స్నేహితురాలు ఉష(నటి షెల్లీ కిషోర్) ప్రేమ కోసం పరితపించే భగ్న ప్రేమికుడిగా షిబు పాత్రలో అలరించాడాయన. -
Telugu Natakam: నటనలో జీవిస్తూ.. నాటకాన్ని బతికిస్తూ!
ఒకప్పుడు తెలుగునాట ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించడమే కాకుండా ప్రజల మదిలో చైతన్య భావాలను రేకెత్తించిన సుందర దృశ్యకావ్యం నాటకం. మారుతున్న కాలంలో నేటి యువతకు నాటకంలోని రసజ్ఞతను ఆస్వాదించే ఆసక్తి లేకున్నా.. వారిని నటనతో కట్టిపడేసే సామర్థ్యం కలిగిన కళాకారులకు పుట్టినిల్లు సిక్కోలు. ఇక్కడి నాటక కళాసమితులపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. కవిటి: పౌరాణిక, సాంఘిక నాటకాల్లో విశేష సేవలందించి శ్రీకాకుళం జిల్లా ఖ్యాతిని దశదిశలా మారుమోగేలా చేసిన కళాకారులు ఎంతోమంది కళామతల్లి ముద్దుబిడ్డలుగా గుర్తింపు పొందారు. పద్మశ్రీ బిరుదుపొందిన యడ్ల గోపాలరావు, మీగడ రామలింగస్వామి, ఉద్దానం ప్రాంతానికి చెందిన దివంగత బెందాళం ప్రకాష్ వంటి ఎందరో ఈ ప్రాంతంనుంచి నాటకాలు వేసి సినిమాల్లో సైతం తమ నటనా ప్రతిభను చాటుకున్నారు. 2000 సంవత్సరం వరకు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో సుమారు 20 వరకు నాటక సమాఖ్యలు ఉండేవి. కాలక్రమంలో వీటిసంఖ్య సగానికి తగ్గిపోయింది. కవిటి ఉద్దానం ప్రాంతం బొరివంకకు చెందిన శార్వాణి గిరిజన సాంస్కృతిక సమాఖ్య, శ్రీకాకుళానికి చెందిన శ్రీశయన నాటక సమాఖ్య, నందిగాం మండలం పెద్దతామరాపల్లి శ్రీవేంకటేశ్వర నాటక కళాసమితి, టెక్కలిలో ప్రజాచైతన్య నాటక కళా సమితి, కోటబొమ్మాళి మండలం లఖిందిడ్డిలో శ్రీనివాస నాటక కళాసమితి, సంతబొమ్మాళి మండలం వడ్డివాడలో చైతన్య నాటక కళాసమితి తమ కళాసేవల్ని నేటికీ కొనసాగిస్తున్నాయి. శ్రీకాకుళంలో మిత్రా సాంస్కృతిక సమాఖ్య, ఉద్దానం ప్రాంతంలో భైరిపురం, బి.గొనపపుట్టేగ, బొరివంక, బెజ్జిపుట్టుగ, మఖరాంపురం, కత్తివరం గ్రామాల్లో నాటక పరిషత్ పోటీలు తరచుగా నిర్వహిస్తూ సాంఘిక నాటిక కళాసౌరభాల్ని భావితరాలకు అందించడంలో విశేషంగా కృషిచేస్తున్నాయి. ఉద్దానం ప్రాంతంలో 60 ఏళ్లుగా నాటికలు వేసే ప్రక్రియ నేటికీ అప్రతిహతంగా కొనసాగుతోంది. ప్రస్తుతం బొరివంకలో పలువురు ఉపాధ్యాయులతో కలిసి ఏర్పడిన శార్వాణి నాటక సమితి సేవలు ప్రశంసనీయంగా ఉన్నాయి. ‘నంది’సంతృప్తి అనిర్వచనీయం నాటిక ప్రదర్శనల్లో మూడు దశాబ్దాలుగా భాగస్వామిగా నటజీవితం కొనసాగడం ఎంతో సంతోషాన్నిస్తోంది. రాష్ట్రప్రభుత్వం ఇచ్చే నంది పురస్కారం పొందడం మరపురాని అనుభూతి. –పిరియాచలపతిరావు, శార్వాణీ నాటక సమాఖ్య, బొరివంక నిర్మాణంలో కళావేదిక.. బొరివంక జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో కళావేదిక ప్రస్తుతం నిర్మాణంలో ఉంది. ఇది పూర్తయిన తర్వాత తెలుగురాష్ట్రాల నాటిక పరిషత్ పోటీలు నిర్వహించాలన్న అభిలాష ఉంది. –బల్లెడ లక్ష్మణమూర్తి, గౌరవాధ్యక్షుడు, శార్వాణీనాటక సమాఖ్య, బొరివంక కళాపోషణ ఉండాలి.. మడిసన్నాక కూసింత కళాపోషణుండాలి.. అనే తెలుగు సినిమా డైలాగు నన్నెంతగానో ప్రభావితం చేసింది. వృత్తి వ్యవసాయమైనా కళారంగంపై మక్కువ నన్ను నటన వైపు ఆకర్షించేలా చేసింది. – బెందాళం శోభన్‌బాబు, సీనియర్ నటుడు, శార్వాణీనాటక సమాఖ్య -
సూత్రధార్.. పాత్రధార్
హిమాయత్‌నగర్:‘‘అలనాటి నటులు ఏఎన్ఆర్, ఎన్టీఆర్, ఎస్వీ రంగారావు తదితర మహా నటులు సైతం నాటకాల ద్వారా తెలుగు తెరకు పరిచయమైన వారే. నటన అనేది థియేటర్ ఆర్ట్స్‌తోనే వస్తుందంటున్నారు నటులు. థియేటర్ ఆర్ట్‌లోనే నటనకు ఓనమాలు దిద్దుకోవచ్చునంటున్నారు ‘సూత్రధార్’ ఫిల్మ్ ప్రొడక్షన్ కంపెనీ అధినేత వినయ్‌వర్మ. కామెడీ, సీరియస్, విలనిజం, ఏడిపించడం, కవ్వించడం ఆయన సొంతం. థియేటర్ ఆర్ట్స్‌లో ఆయనకు తిరుగు లేదు. నటనలో లీనమవ్వడం, ఇతరులను మెప్పించడం ఆయనకే సాధ్యం. దేశవ్యాప్తంగా ఆయనకో క్రేజ్ ఉంది. నవలల్లోని స్టోరీలను ఆధారంగా చేసుకుని నేటివిటీ తగ్గట్టు నాటకాన్ని రూపుదిద్దుతారు. నాటకం పూర్తయ్యే వరకు కుర్చీలో కూర్చోబెట్టగలిగే ప్రతిభ వినయ్‌వర్మ సొంతం. హిమాయత్‌నగర్‌కు చెందిన వినయ్‌వర్మ. 1980లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ‘సోషియాలజీ’ పీజీ పూర్తి చేశారు. యూనివర్సిటీలో చదువుతున్న రోజుల్లో హుషారుగా ఉండేవారు. ఆయన ప్రతిభను గుర్తించిన రీసర్చ్ స్కాలర్ డాక్టర్ గోయల్ నాటకం చేస్తావా..అంటూ అడిగారు. రూ.లక్షలు వదిలి..లక్ష్యం దిశగా ఆయన మాటను కాదనలేక నటించేందుకు ఒప్పుకున్న వినయ్‌వర్మ ‘యాంగ్రీయంగ్ మ్యాన్’గా చేశారు. ఒక లీడర్‌గా వ్యతిరేకంగా వెళ్లే క్యారెక్టర్లో లీనమైన వినయ్‌వర్మ యూనివర్సిటీలోని అందర్నీ తన నటనతో మెప్పించాడు. అందరూ ప్రశంసించడంతో నటనపై దృష్టి సారించాడు. ఇదే నటనతో యావత్ ప్రజానీకాన్ని మెప్పించాలనే ఆలోచనకు శ్రీకారం చుట్టాడు. చదువు పూర్తయ్యాక ‘డేనా’ బ్యాంకులో ఆఫీసర్‌గా ఉద్యోగం వచ్చినా, తన లక్ష్యం కోసం రూ. లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని సైతం వదులుకున్నాడు. ‘ సూత్రధార్’ ద్వారా 65కి పైగా నాటకాలు హిమాయత్‌నగర్‌లో 1998లో ‘సూత్రదార్’ పేరుతో థియేటర్ ఆర్ట్ ఇనిస్టిట్యూట్‌ను ప్రారంభించాడు. దీని ద్వారా అనేక నవలల్లోని అతి ముఖ్యమైన కథలను నాటకాలుగా చిత్రీకరించారు. హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, ముంబై, బెంగళూరు, పూణే, చెన్నై, కలకత్తా, లక్నో, అహ్మదాబాద్, ఇండోర్, భోపాల్, ఉదయ్‌పూర్ తదితర నగరాల్లోనూ నాటక ప్రదర్శనలు ఇచ్చాడు. సుమారు 45 నిమిషాల నుంచి రెండు గంటల పాటు ఉండే ఈ నాటకాల్లో ‘నవ్వించడం, ఏడిపించడం, టెన్షన్‌కు గురి చేయడం, థ్రిల్ అయ్యేలా చెయ్యడం, మెప్పించడం, ఒప్పించడం’ ఆయనకు మాత్రమే సొంతం అనేలా అక్కున చేర్చుకున్నారు ప్రేక్షకులు. ‘లవ్’తో తెరంగేట్రం.. నాటకాల్లో అతడి నటనను చూసి మెచ్చిన టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ డైరెక్టర్లు తమ సినిమాల్లో అతడికి అవకాశాలు ఇచ్చారు. 2001లో ‘లవ్’ సినిమాతో తెరంగ్రేటం చేసిన వినయ్‌వర్మ ఆ సినిమాలో ‘టెర్రరిస్ట్’గా నటించాడు. ఆయన నటకు, తెరపైకి వచ్చిన ప్రతిసారీ ప్రేక్షకులను కుర్చీలలో నుంచి కదలనివ్వకుండా చేశాడు. ఇలా తెలుగులో 19 సినిమాలు, హిందీలో 7 సినిమాలు, హాలీవుడ్లో ‘బీపర్’ అనే సినిమాలో నటించాడు. బుల్లితెరపై కూడా తొమ్మిది సీరియల్స్ చేశాడు. అబ్బే..ఏం లేదు ఇప్పటి వరకు ఆయన చేసిన నాటకాలన్నీ హిందీ, ఉర్దూ, మరాఠి, గుజరాతి తదితర భాషలకు చెందినవే. మొదటిసారి తెలుగు స్టోరీతో తెలుగులో ‘అబ్బే..ఏం లేదు’ అనే నాటకంతో ముందుకొస్తున్నాడు వినయ్‌వర్మ. ఓ కుటుంబంలో భార్య, భర్త, పనివాడు, డాక్టర్, ఇద్దరు దొంగలతో రూపుదిద్దుకున్న నాటకమే ‘అబ్బే..ఏం లేదు’. వినయ్‌వర్మ మొదటిసారి తెలుగులో చేస్తున్న నాటకం కావడంతో సిటీ ప్రజలు ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. ఈ నెల 20, 21 తేదీల్లో బంజారాహిల్స్‌లోని ‘లామాకాన్’ ఈ నాటకాన్ని ప్రదర్శించనున్నారు. ‘థియేటర్ ఆర్ట్’ బేసిక్ నాలెడ్జ్ నాటకం అంటే ఈ రోజుల్లో వారికి పెద్దగా తెలీదు, దానిని లైట్‌గా తీసుకుంటారు. థియేటర్ ఆర్ట్ అనేది బేసిక్ నాలెడ్జ్. దాని నుంచి సినిమాల్లోకి వెళితే అవలీలగా చేయగలిగే శక్తి, సామర్థ్యాలు వస్తాయి. హీరో విజయ్ దేవరకొండ కూడా థియేటర్ ఆర్ట్ నుంచి సినిమాల్లోకి వెళ్లిన వ్యక్తే. విజయ్ నా శిష్యుడు అని చెప్పుకోవడం గర్వంగా ఉంది. నటనపై ఆసక్తి, డెడికేషన్ ఉన్న వారికే నేను నేర్పిస్తా. మొదటిసారి తెలుగు నవలలోని ఓ కథను ‘అబ్బే..ఏం లేదు’ అనే పేరుతో ప్రదర్శిస్తున్నాము. – వినయ్‌వర్మ, నటుడు, ‘సూత్రధార్’ ఫిల్మ్ ప్రొడక్షన్ కంపెనీ అధినేత. -
పట్టపగలే నటి కాల్చివేత
లాహోర్(పాకిస్తాన్): పంజాబ్ ప్రావిన్స్‌కు చెందిన ఓ రంగస్థల నటిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా కాల్చి చంపారు. ముల్తాన్ నగరంలోని తన ఇంటి వద్ద నుంచి కారులో బయలుదేరిన షమీమ్ అనే నటిని దుండగులు కాల్చి చంపినట్లు ఆమె సోదరుడు సయీఫ్ ఉర్ రహమాన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనకు, తన సోదరికి కొన్ని రోజులుగా బెదిరింపు కాల్స్ వస్తున్నాయని అతడు పోలీసులకు తెలిపాడు. సోమవారం ఉదయం 9 గంటల సమయంలో తమ ఇంటి మెయిన్ గేట్ వద్దకు వచ్చిన ఆమెను దుండుగులు కాల్చగా అక్కడికక్కడే చనిపోయిందని చెప్పాడు. ఆమె మాజీ భర్త ఈ ఘటనకు కారణమై ఉంటాడని కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. అందరూ షమోగా పిలుచుకునే షమీమ్ మంచి నృత్యకారిణి కూడా. ఇప్పటి వరకు కిస్మత్ బేగ్ అనే రంగస్థల నటితో పాటు, నద్రా, నాగు, యాస్మిన్, నయినా, మార్వి, కరిష్మా, సంగం, ఆర్జూ తదితర నటీమణులు మాజీ భర్తలు, మాజీ ప్రియుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయారు. వీరంతా లాహోర్, ముల్తాన్ ప్రాంతాలకు చెందిన వారే కావటం గమనార్హం. -
ఆద్యంతం ఆనందం..


