breaking news
thalupula
-
వర్షం కోసం కప్ప దేవర
తలుపుల/నంబులపూలకుంట: వర్షం కురవాలని ప్రార్థిస్తూ తలపులు మండలం పులిగుండ్లపల్లి, నంబులపూలకుంట మండలం రెడ్డివారిపల్లి, చిన్నసానివారిపల్లి గ్రామాల్లో చిన్నారులు అదివారం కప్ప దేవర చేశారు. ఆయా గ్రామాల్లో కప్పలను పూజించి, ప్రతి ఇంటికీ తిరిగి ‘కప్ప కప్ప నీళ్లాడె.. కడవల కొద్దీ నీళ్ళొచ్చా.. ముర్రో వానదేవుడా’ అని పాటలు పాడారు. వీధివీధినా రోడ్డుపై నీళ్లు పోసుకుంటూ గ్రామాల్లోని బొడ్రాయిల వద్ద పూజలు చేశారు. ప్రతి ఒక్కరూ తమకు తోచిన కాడికి ఇచ్చి ధాన్యంతో చెరువుకట్ట వద్దకు చేరుకుని సామూహికంగా వంటలు చేసి అందరూ కలిసి భోజనాలు చేశారు. అనంతరం ‘కప్పమ్మా నీలాడ చెరువులోకి నీళ్లుచ్చే కొర్రో వానదేవుడా’ అంటూ పాటలు పాడుతూ కట్టపైన మూడుసార్లు తిరిగి నోరు కొట్టుకుని, కప్పలను వదిలిపెట్టారు. -
చల్లని ప్రయాణం
తలుపుల : ఏసీ బస్సులు నగరాల్లోనే కాదండోయ్..పల్లెల్లోనూ ప్రయాణిస్తున్నాయి. అందుకు నిదర్శమే ఈ ఏసీ బస్సు. మండలంలోని ఓబులరెడ్డిపల్లి రూట్లో ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు ప్రయాణికుల వేసవి తాపాన్ని తట్టుకునేందుకు నూతనంగా ఎయిర్ కూలర్ బస్సును గురువారం ఏర్పాటు చేశారు. ఈబస్సులో ప్రయాణించే వారికి వడదెబ్బ తగలకుండా సైడ్ గ్లాస్లకు పట్టలు ఏర్పాటు చేసి. వాటికి నీళ్లుపడేలా ఏర్పాటు చేశారు. దీంతో బస్సులో చల్లగా ఉండి ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉంది. ఈబస్సులో ప్రయాణించేందుకు గ్రామీణుల ఆసక్తి చూపుతున్నారు.