breaking news
Telugu tradation
-
విశేషాలకు కొదవ లేని కొడవ కళ్యాణం
అక్కడ పురోహితులు ఉండరు... వేద మంత్రోచ్చారణలు వినిపించవు... వధూవరులు ఏడడుగులు వేయరు... ‘కొడవ’ సంప్రదాయ పద్ధతిలో జరిగే వివాహ వేడక ఇలానే ఉంటుంది. అంతేనా? ఇంకా చాలా విశేషాలుంటాయి. తెలుగు సంప్రదాయానికి పూర్తి భిన్నంగా ఈ వేడుక ఉంటుంది. టాలీవుడ్ లవ్‌బర్డ్స్ విజయ్ దేవరకొండ, రష్మికా మందన్నా ఈ రెండు పద్ధతుల్లోనూ పెళ్లి చేసుకున్నారు. ఫిబ్రవరి 26న ఉదయం తెలుగు సంప్రదాయంలో వీరి పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. అదే రోజు సాయంత్రం కర్ణాటకలోని కొడవ పద్ధతిలో పెళ్లి జరిగింది. దీంతో కొడవ తెగకు సంబంధించిన వేడుక ఎలా జరిగి ఉంటుందా?! అనే చర్చలు మొదలయ్యాయి. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం...విజయ్ దేవరకొండది తెలంగాణలోని నాగర్‌కర్నూలు. రష్మికది కర్ణాటకలోని కొడగు జిల్లాలోని విరాజ్ పేట. కొడగునే కూర్గ్ అని కూడా పిలుస్తారు. అక్కడి స్థానిక వారియర్ కమ్యూనిటీనే కొడవగా పిలుస్తారు. కొడవ ప్రజల సంస్కృతి, ఆహార్యం, సంప్రదాయాలు మిగతా వారితో పోల్చితే భిన్నంగా ఉంటాయి. వారి పూర్వీకులను గౌరవిస్తూ వివాహ వేడుకలను జరుపుతారు. మామూలుగా జరిగే తెలుగు వివాహాలకు భిన్నంగా కొడవ వెడ్డింగ్ ఉంటుంది. అగ్నిసాక్షిగా ఏడడుగులు నడుస్తూ ప్రమాణాలు చేసుకోవడం వంటిది ఏమీ ఉండదు. సుదీర్ఘంగా పెళ్లి మంత్రాలు వినిపించవు. అరిటాకుల్లో విందు, సంప్రదాయ అలంకరణలు ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణ. ఈ వివాహ వేడుకను వాళ్లు ‘మంగళ’ అని పిలుస్తారు. అంతా పెద్దల సమక్షంలో, ప్రకృతి సాక్షిగా జరుగుతుంది. వేదికను అరిటాకులతో పచ్చదనానికి ప్రతీకగా అలంకరిస్తారు.భిన్నమైన కట్టుకొడవ పెళ్లిలో వధూవరులిద్దరూ అభ్యంగన స్నానం చేస్తారు. అనంతరం తమ సంప్రదాయ దుస్తులు ధరిస్తారు. పెళ్లి కొడుకు ‘కుష్య’ అనే నల్లని కోటు, ‘చేలే’ అని పిలిచే నడుముకు కట్టే పట్టీ, ‘పీచే కత్తి’ (చిన్న కత్తి) ధరిస్తాడు. ఇక వధువు చీరకట్టు సంప్రదాయం మిగతా చీరకట్టులతో పోల్చితే భిన్నంగా ఉంటుంది. సాధారణంగా భారతీయ వస్త్రధారణలో చీర పల్లూను ముందు నుంచి వెనక వైపుకు వేస్తారు. కానీ కొడవ సంప్రదాయంలో చీర కొంగును వెనక నుంచి ముందుకు తీసి, వేస్తారు. అలాగే, వెనక వైపు కుచ్చిళ్లు వచ్చేలా కట్టుకునే ప్రత్యేకమైన కట్టు ఈ కమ్యూనిటీలో కనిపిస్తుంది. ఇక వేడుక అంతా డ్రమ్ బీట్స్, పాటలతో వారియర్ నేపథ్యాన్ని గుర్తుచేసే నృత్యాలు చేస్తారు. అలాగే గన్ సెల్యూట్స్ కూడా ఆ వేడుకలో భాగమే. ఈ పద్ధతిని అనుసరిస్తూ విజయ్ దేవరకొండ, రష్మికా మందన్నా కూడా ఈ నృత్యాలు చేశారు.కొడవలు ఎవరు కొడవలను ‘కూర్గులు’ అని కూడా అంటారు. వీరిది కర్ణాటక రాష్ట్రంలోని కొడగు (కూర్గ్) ప్రాంతం. వీరు సుమారు 1.6 లక్షల దాకా ఉన్నారని అంచనా. గతంలో వీరు వ్యవసాయం, ఇతర పనుల మీద ఆధారపడి జీవించేవారు. 19వ శతాబ్దంలో కాఫీ సాగు ద్వారా వీరి పనికి ప్రాధాన్యం లభించింది. మొదట వ్యవసాయ ఆధారిత పండుగలు జరుపుకునే వీరు అనంతరం ఇతర పండుగలూ జరుపుకోవడం మొదలుపెట్టారు. కావేరి నది వీరికి ప్రాధాన్యమైనది. బ్రిటిష్ పాలన సమయంలో వీరు ఇతర రంగాల్లోకి ప్రవేశించారు. వీరి నైపుణ్యాలను గమనించి బ్రిటిష్ అధికారులు వీరిని మొదటి, రెండో ప్రపంచ యుద్ధ సమయాల్లో వినియోగించారు. కొడవల్లో అనేకమంది స్వాతంత్య్ర సమరయోధులు ఉన్నారు.బంగారు నాణేల మూటపెళ్లి వేదికకు వచ్చే మార్గంలో అరటి చెట్టు నాటుతారు. వరుడు దీని చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి, అనంతరం ఆ చెట్టు కాండాన్ని నరకడం ఒక ముఖ్యమైన ఆచారంగా ఉంటుంది. ఇది వరుడి పరాక్రమానికి, అడ్డంకులను తొలగించడానికి ప్రతీకగా నిలుస్తుంది. తర్వాత వరుడు పెళ్లి పీటల చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి, తూర్పు ముఖంగా కూర్చుంటాడు. ఆ సమయంలో ముందుగా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులు వరుడిని ఆశీర్వదిస్తారు. తర్వాత వధువు అక్కడికి చేరుకుని వరుడికి పాలు, బహుమతులు, బంగారం, వెండి, రాగి నాణేలను అందిస్తుంది. ఇది సంపద, శుభం, స్థిరత్వానికి సంకేతంగా భావిస్తారు.12 గులకరాళ్లతో వధువుపై సర్వహక్కులువధూవరులిద్ద్దరూ మల్లెపూల దండలు మార్చుకుంటారు. పవిత్ర దీపం ఎదురుగా నిలబడి వధువు బాధ్యత వరుడికి అప్పగిస్తున్నామని పెద్దలు చెబుతారు. దీంతో పాటు వధువు తరఫు పెద్దలు 12 గులకరాళ్లు వరుడి పెద్దలకు ఇచ్చి, వధువుపై సర్వహక్కులు ఇస్తున్నామని చెబుతారు. అయితే వరుడి వైపు పెద్దలు 11 రాళ్లు తీసుకొని ఒకటి తీసుకోకుండా వదిలేస్తారు. అవసరమైన సందర్భంలో వధువుపై వారికీ హక్కు ఉందనే అర్థంలో ఇలా చేస్తారు. పుట్టింటివారికి కూతురి పట్ల కొంత బాధ్యత ఉంటందని సూచించడానికే ఇలా చేస్తారని చెప్పవచ్చు.నీళ్ల బిందె తలపై పెట్టుకొని..పెళ్లి తర్వాత వధువు తమ అత్తగారి ఇంటి వద్ద గంగా పూజ చేస్తుంది. ఈ పూజ కోసం వధువు బావి నుంచి నీటిని తోడి, ఆ బిందెను తలపై పెట్టుకుని నడుచుకుంటూ వస్తుంది. ఈ సమయంలో వరుడి కుటుంబ సభ్యులు ఆమెను ఆటపట్టిస్తూ, ఆమె నడవకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. ఆమె సహనాన్ని, ఓర్పును పరీక్షించడానికే ఈ ఘట్టం. ఇతర హిందూ వివాహాలకు భిన్నంగా కొడవ పెళ్లిళ్లలో మాంసాహారాన్ని వడ్డిస్తారు. అందులో ప్రధానంగా పంది మాంసం, మద్యం తప్పనిసరిగా ఉంటాయట. దీంతో విజయ్–రష్మిక పెళ్లి వేడుకలో ఈ వంటకాన్ని కూడా వడ్డించారు. ఇలా ఉదయం తెలుగు సంప్రదాయ పద్ధతిలో, సాయంత్రం కొడవ సంప్రదాయ పద్ధతిలో జరిగిన విజయ్–రష్మికల వివాహ వేడుకలు ‘టాక్ ఆఫ్ ది నేషన్’ అయ్యాయి. మార్చి 4న హైదరాబాద్‌లో వీరి వివాహ రిసెప్షన్ అత్యంత వైభవంగా జరగనుంది. ఈ వేడుకకు పలువురు ప్రముఖ రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు హాజరు కానున్నారు.విరోష్ సెలబ్రేషన్స్‘‘దేశంలోని ప్రజలందరూ ఎప్పుడూ మా ప్రయాణం, ప్రేమలో భాగమయ్యే ఉన్నారు. అందుకే మీ అందరితో మా వెడ్డింగ్‌ను సెలబ్రేట్ చేసుకోవడం మాకెంతో సంతోషం. ప్రతి వేడుకను ఇండియా ఎలా అయితే ఫుడ్ అండ్ మిఠాయిలతో సెలబ్రేట్ చేసుకుంటుందో అలా మా జీవితంలోని ఈ బిగ్ మూమెంట్‌ను మీతో కలిసి సెలబ్రేట్ చేసుకునేందుకు మార్చి 1న దేశవ్యాప్తంగా ఫుడ్ అండ్ స్వీట్ ట్రక్స్‌ను పంపిస్తున్నాం (కొన్ని నగరాల్లో మాత్రమే). అలాగే దేశవ్యాప్తంగా ఉన్న దేవాలయాల్లో అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నాం. మాకు మీ అందరి ఆశీస్సులు కావాలి. ప్రేమతో విజయ్ అండ్ రష్మిక’’ అంటూ విజయ్ దేవరకొండ, రష్మిక ‘ఎక్స్’ లో శనివారం రాత్రి ఓ పోస్ట్ షేర్ చేశారు. అలాగే ‘విరోష్ సెలబ్రేషన్స్’ అంటూ, ఏయే నగరాల్లో స్వీట్స్ పంచనున్నారు, ఏయే దేవాలయాల్లో అన్నదానం నిర్వహించనున్నారన్న జాబితాను కూడా ఈ ఇద్దరూ షేర్ చేశారు.స్వీట్స్ డిస్ట్రిబ్యూషన్... ∙తెలంగాణ – హైదరాబాద్, మహబూబ్‌నగర్, కరీంనగర్, ∙ఢిల్లీ (ఎన్సీటీ) – ఢిల్లీ ∙చండీఘర్ (యూటీ)– చండీఘర్ ∙ఉత్తరప్రదేశ్ – నోయిడా, గజియాబాద్ ∙గుజరాత్ – అహ్మదాబాద్ ∙మధ్యప్రదేశ్ – భోపాల్ ∙మహారాష్ట్ర – ముంబై ∙రాజస్థాన్ – జైపూర్ ∙ఆంధ్రప్రదేశ్ – వైజాగ్, విజయవాడ, పుట్టపర్తి ∙కేరళ – కొచ్చి ∙కర్ణాటక – మైసూర్, కూర్గ్, బెంగళూరు ∙తమిళనాడు – కోయంబత్తూర్, చెన్నై ∙పాండిచ్చేరి (యూటీ) – పాండిచ్చేరి ∙బిహార్– (ట్రైన్ యాక్సిడెంట్ కారణంగా సోమవారానికి వాయిదా). -
మూడు రకాల భోజనాలు
- వీవీఐపీలు, వీఐపీలకు ప్రత్యేక మెనూ - శంకుస్థాపననాడు ఇదీ సంగతి సాక్షి, విజయవాడ బ్యూరో: రాజధాని శంకుస్థాపనకు వచ్చే వారి కోసం ప్రభుత్వం మూడు కేటగిరీల భోజనాలను తయారు చేయిస్తోంది. వీవీఐపీలు, వీఐపీలకు ప్రత్యేకమైన మెనూ, రైతులు, ప్రజలకు సాధారణ మెనూ ఖరారు చేశారు. దేశవిదేశాల నుంచి వచ్చే అత్యంత ముఖ్యులకు(వీవీఐపీ) ప్రత్యేకమైన తెలుగు సంప్రదాయ వంటకాలను రుచి చూపించనున్నారు. ఒక్కో భోజనం ఖర్చు రూ.1,250 చొప్పున 1,000 మంది కోసం ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది. వీఐపీల కేటగిరీలో 10,000 మందికి మరో ప్రత్యేకమైన మెనూను ఆర్డర్ ఇచ్చింది. ఈ భోజనానికి రూ.650 వంతున చెల్లిస్తారు. నిజానికి వీఐపీల కేటగిరీలో 1,500 మందికి ఆహ్వానాలు పంపారు. ఆ సంఖ్య కొంత పెరిగినా ఇబ్బంది లేకుండా వేదిక ముందు 2,000 సీట్లను కేటాయిస్తున్నారు. ఈ కేటగిరీలో 10వేల భోజనాలకు ఆర్డర్ ఇచ్చారు. ఇందుకు రూ.77.5 లక్షలు ఖర్చు కానుంది. లక్షన్నర మందికి సాధారణ భోజనం శంకుస్థాపన కార్యక్రమానికి లక్షన్నర మంది రైతులు, ప్రజలు హాజరవుతారని అంచనా. వీరికి సాధారణ భోజనమే అందించనున్నారు. ఒక్కో భోజనానికి రూ.150 చొప్పున చెల్లిస్తున్నారు.సాధారణ భోజనాలకు రూ.2.25 కోట్లు ఖర్చవుతోంది. అంటే మొత్తం భోజనాల కోసం ప్రభుత్వం రూ.3 కోట్లకుపైగా ఖర్చు చేస్తోంది.


