breaking news
telugu mps
-
పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రైవేట్ బిల్లులు
న్యూఢిల్లీ: పార్లమెంట్ ఉభయ సభల్లో శుక్రవారం మధ్యాహ్నం తెలుగు రాష్ట్రాల ఎంపీలు ప్రైవేటు బిల్లులను ప్రవేశపెట్టారు. తెలంగాణకు ప్రత్యేకహోదా ఇవ్వాలని కోరుతూ లోక్సభలో టీఆర్ఎస్ ఎంపీ వినోద్ ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెట్టారు. ఇటు రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ ఎంపీ సుబ్బరామిరెడ్డి ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టారు. విశాఖలో సుప్రీంకోర్టు సర్క్యూట్ బెంచ్ ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. దీనిపై ఉభయ సభల్లో చర్చ జరిగే అవకాశముంది. త్వరలో ఆంధ్రా ఎంపీలు పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రత్యేక హోదా కోసం ప్రైవేట్ బిల్లులు ప్రవేశపెట్టే అవకాశముంది. -
లోక్సభలో తెలుగు ఎంపీల ప్రమాణ స్వీకారం
న్యూఢిల్లీ : 16వ లోక్సభలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ఎంపీలు గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఇరు రాష్ట్రాలకు చెందిన ఎంపీలు తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో ప్రమాణ స్వీకారం చేశారు. ముందుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హిందీలో దైవసాక్షిగా ప్రమాణం చేశారు. అనంతరం ఎల్ కే అద్వానీ, సోనియాగాంధీ, నితిన్ గడ్కరీ, సుష్మా స్వరాజ్, రాజ్నాథ్ సింగ్ వరుసగా ప్రమాణ స్వీకారం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన బుట్టా రేణుకా, వెలుగపల్లి వరప్రసాద్ రెడ్డి ఆంగ్లంలో, వైవీ సుబ్బారెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే టీడీపీకి చెందిన ఎంపీలు అశోక్ గజపతిరాజు ఆంగ్లంలో, జేసీ దివాకర్ రెడ్డి తెలుగులో, నిమ్మల కిష్టప్ప హిందీలో ప్రమాణం చేశారు. కాగా ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమం శుక్రవారం కూడా కొనసాగనుంది.