breaking news
Telugu Literary Critic
-
సుప్రసిద్ధ సాహితీవేత్త 'చేరా' కన్నుమూత
-
సుప్రసిద్ధ సాహితీవేత్త 'చేరా' కన్నుమూత
హైదరాబాద్: సుప్రసిద్ధ సాహితీవేత్త చేకూరి రామారావు(80) కన్నుమూశారు. ఆధునిక భాషా శాస్త్రంలో కొత్త ఒరవడి సృష్టించిన ఆయన 'చేరా' పేరుతో ప్రసిద్దులు. భాషాశాస్త్ర పరిశోధకుడిగా, సాహితీ విమర్శకుడిగా ఖ్యాతి గడించారు. 1934 అక్టోబర్ 1న ఖమ్మం జిల్లా మధిర మండలం ఇల్లందలపాడులో ఆయన జన్మించారు. అమెరికా కార్నెల్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అందుకున్నారు. 2002లో కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు పొందారు. ఆయన 'స్మృతి కిరణాంకం'కు ఈ అవార్డు దక్కింది. ముత్యాలసరాల ముచ్చట్లు, ఇంగ్లీషు-తెలుగు పదకోశం, తెలుగులో వెలుగులు(భాషా పరిశోధన వ్యాసాలు), రెండు పదుల పైన, చేరా పీఠికలు, తెలుగు వాక్యం, కవిత్వానుభవం ఆయన రాసిన పుస్తకాల్లో కొన్ని. చేరాతలు పేరుతో ఏళ్ల తరబడి సాహితీ కాలమ్ నిర్వహించారు.