Team badminton champioship
-
భారత్ మహిళల బ్యాడ్మింటన్ జట్టుకు తొలి విజయం
హోర్సెన్స్ (డెన్మార్క్): ఉబెర్ కప్ టీమ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత మహిళల జట్టు తొలి విజయం అందుకుంది. ఉక్రెయిన్ జట్టుతో జరిగిన గ్రూప్ ‘ఎ’ రెండో లీగ్ మ్యాచ్‌లో భారత్ 4–1తో గెలుపొందింది. తొలి మ్యాచ్‌లో ఉన్నతి హుడా 21–19, 22–20తో పొలీనా బురోవాపై నెగ్గింది. రెండో మ్యాచ్‌లో తన్వీ శర్మ 21–12, 17–21, 21–10తో యెహెనియా కాంటిమిర్ను ఓడించింది. మూడో మ్యాచ్‌లో దేవిక సిహాగ్ 23–21, 21–13తో మరియా స్టొలియారెంకోపై గెలిచి భారత్‌కు 3–0తో విజయాన్ని ఖరారు చేసింది. నాలుగో మ్యాచ్‌లో సెల్వం కవిప్రియ–సిమ్రన్ ద్వయం 11–21, 17–21తో పొలీనా బురోవా–యెహెనియా కాంటిమిర్ జోడీ చేతిలో ఓడిపోయింది. ఐదో మ్యాచ్‌లో పీవీ సింధు–తనీషా క్రాస్టో జోడీ 21–18, 21–15తో మరియా స్టొలియారెంకో–సోఫియా లావ్రోవా జంటపై విజయం సాధించింది. గ్రూప్ ‘ఎ’లోని మరో మ్యాచ్‌లో చైనా 5–0తో డెన్మార్క్ జట్టును ఓడించింది. వరుసగా రెండు విజయాలు సాధించిన చైనా జట్టు క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను దాదాపుగా ఖరారు చేసుకోగా... రెండో బెర్త్ కోసం భారత్, డెన్మార్క్, ఉక్రెయిన్ జట్లు రేసులో ఉన్నాయి. నేడు జరిగే చివరిదైన మూడో రౌండ్ లీగ్ మ్యాచ్‌ల్లో చైనాతో భారత్; డెన్మార్క్‌తో ఉక్రెయిన్ తలపడతాయి. -
సూపర్ జపాన్
తొలిసారి థామస్ కప్ కైవసం న్యూఢిల్లీ: సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ చైనాపై సాధించిన విజయం గాలివాటం ఏమీ కాదని జపాన్ జట్టు నిరూపించింది. అద్వితీయ ఆటతీరుతో తొలిసారి పురుషుల టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ ‘థామస్ కప్’ను సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో జపాన్ 3-2తో గతంలో ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచిన మలేసియాను ఓడించింది. తొలి మ్యాచ్‌లో ప్రపంచ నంబర్‌వన్ లీ చోంగ్ వీ 21-12, 21-16తో కెనిచి టాగోపై నెగ్గి మలేసియాకు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. రెండో మ్యాచ్‌లో హయకావా-హిరోయుకి ఎండో జోడి 12-21, 21-17, 21-19తో బూన్ తాన్-థియెన్ హూన్ జంటను ఓడించి జపాన్ స్కోరును 1-1తో సమం చేసింది. మూడో మ్యాచ్‌లో కెంటో మొమొటా 21-15, 21-17తో వీ ఫెంగ్ చోంగ్‌పై గెలిచి జపాన్ను 2-1తో ఆధిక్యంలో నిలిపాడు. నాలుగో మ్యాచ్‌లో షెమ్ గో-వీ కియోంగ్ తాన్ ద్వయం 19-21, 21-17, 21-12తో కీగో సోనోదా-కమూరా జోడిపై గెలిచి మలేసియా 2-2తో స్కోరును సమం చేసింది. నిర్ణాయక ఐదో మ్యాచ్‌లో టకూమా ఉయెదా 21-12, 18-21, 21-17తో డారెన్ లూపై గెలిచి జపాన్‌కు 3-2తో చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. సెమీఫైనల్స్‌లో ఓడిన చైనా, ఇండోనేసియా జట్లకు కాంస్య పతకాలు లభించాయి.


