తార్నాక ఫ్లైఓవర్‌పై కార్లో మంటలు
హైదరాబాద్‌సిటీ: తార్నాక ఫ్లైఓవర్‌పై వెళ్తున్న కార్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ కారును వెంటనే అక్కడే ఆపేసి బయటకు దిగేయడంతో ప్రమాదం తప్పింది. షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగి ఉంటాయని అనుమానిస్తున్నారు. ప్రమాద సమయంలో కారు హబ్సిగూడ నుంచి మెట్టుగూడ వైపు వెళ్తోంది. అగ్నిమాపక సిబ్బంది వచ్చేసరికి కారు పూర్తిగా కాలిపోయింది.