రాచెల్, రోహన్‌లకు టైటిల్స్
సాక్షి, హైదరాబాద్: టాలెంట్ సిరీస్ అండర్–16 టెన్నిస్ టోర్నమెంట్లో రాచెల్ ఏంజెలా, రోహన్ కుమార్ విజేతలుగా నిలిచారు. నూర్ టెన్నిస్ అకాడమీలో జరిగిన ఈ టోర్నీలో టైటిళ్లను కైవసం చేసుకున్నారు. బాలికల సింగిల్స్ టైటిల్‌పోరులో రాచెల్ ఏంజెలా 6–3, 6–3తో వేదరాజు ప్రపూర్ణపై విజయం సాధించింది. బాలుర తుదిపోరులో రోహన్ కుమార్ 6–0, 6–0తో రోహిత్ బిశ్వాస్‌ను ఓడించి టైటిల్‌ను సాధించాడు.