breaking news
talakondapallli
-
ఒక్కటి చేసిన టిక్‌టాక్
రాజాపేట: ఏడేళ్ల క్రితం తప్పిపోయిన ఓ యువకుడిని కొందరు యువకులు చేసిన టిక్‌టాక్ వీడియో తల్లిదండ్రుల వద్దకు చేర్చింది. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లికి చెందిన దుగ్గాపురం పద్మ, పెంటయ్యల కొడుకు ఖాసీం ఏడేళ్ల క్రితం ఇంటి నుంచి తప్పిపోయాడు. ఈనెల 8న చల్లూరు గ్రామంలోని యువకులకు ఖాసీం కనిపించగా.. అతనికి మాటలు రాకపోవడంతో టిక్‌టాక్‌లో అతనితో కలసి దిగిన ఫొటోను పోస్టు చేసి స్థానిక పోలీసులకు అప్పగించారు. ఈ పోస్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో చివరకు ఖాసీమ్ తల్లిదండ్రులకు తెలిసింది. తలకొండపల్లికి చెందిన తుమ్మ వీణ శనివారం సికింద్రాబాద్‌లో ఖాసీంను గుర్తించి అతడి తల్లిదండ్రుల వద్దకు చేర్చింది. దీంతో తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. -
విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టండి
తలకొండపల్లి: ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా నాణ్యతతో కూడిన మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులకు అందించాలని ఏంపీడీఓ శ్రీనివాసాచార్య వంట ఏజెన్సీలతో పాటు, ఉపాధ్యాయులకు సూచించారు. బుధవారం మండల పరిధిలోని యడవల్లిలో అంగన్వాడీ, ప్రాథమిక పాఠశాల, చెన్నారంలో ఆసరా పింఛన్ల పంపిణీతో పాటు, ప్రాథమిక పాఠశాలలను సందర్శించి తనిఖీ చేశారు. చెన్నారం, చుక్కాపూర్లలోని ఉపాధి హామి పనులను పరిశీలించారు. యడవల్లిలో అంగన్వాడీ కార్యకర్త గైర్హాజరీపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రాథమిక పాఠశాలలో వారంలో రెండు గుడ్లు మాత్రమే విద్యార్థులకు అందిస్తున్నారని తెలుసుకుని ఆగ్రహించారు. వారంలో తప్పనిసరిగా మూడు గుడ్లను విద్యార్థులకు అందించాలని సూచించారు. ఆయా పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి ప్రభుత్వం సూచించిన మెనూ ప్రకారం భోజనాన్ని అందించాలన్నారు. కార్యాచరణ ప్రణాళిక ప్రకారం ఉపాధి పనులను చేపట్టి, వ్యవసాయాభివృద్ధి పనులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ఉపాధి సిబ్బందికి సూచించారు.