breaking news
Sweden girl
-
పిట్టకొంచెం కూత ఘనం!
పట్టుమని పదిహేనేళ్ళు కూడా లేని స్వీడన్‌కి చెందిన ఓ చిన్నారి ప్రస్తుతం పర్యావరణాన్ని కాపాడేందుకు నడుంబిగించి ప్రపంచనేతలే తలదించుకునేలా చేసింది. పర్యావరణ మార్పులను అంగీకరించని రాజకీయనాయకుల వ్యాఖ్యలను తిప్పికొట్టే ప్రసంగాలతో ఆకట్టుకుంటోంది. మీరు ఔనన్నా కాదన్నా యువతరం భవిష్యత్తుని పర్యావరణ కాలుష్యం కబళిస్తోందనీ, కాలుష్యానికి కారణమైన కర్బన ఉద్గారాలను అరికట్టాలనీ ఐక్యరాజ్యసమితి పర్యావరణ సదస్సు గత పాతికేళ్ళుగా బతిమాలుతోంది. అయితే తను మాత్రం పర్యావరణ పరిరక్షణ కోసం నేతలను బతిమిలాడబోననీ యునైటెడ్ నేషన్స్ క్లయిమేట్ చేంజ్ సమ్మిట్ ఛిౌp24 ని ఉద్దేశించి పదిహేనేళ్ళ గ్రేటా థన్‌బెర్గ్ తేల్చి చెప్పింది. భావితరాల భవిష్యత్తుని అంధకారంగా మారుస్తోన్న కాలుష్యాన్ని నివారించి, పర్యావరణ పరిరక్షణ బాధ్యతని భుజాలకెత్తుకోవాల్సిన పెద్దతరం చేష్టలుడిగిందనీ, అందుకే ఈతరం ఆ బాధ్యతను తలకెత్తుకుం దనీ పోలండ్‌లో జరుగుతోన్న ప్రపంచ పర్యావరణ సదస్సుని ఉద్దేశించి ప్రసంగించి అందరి దృష్టినీ ఆకర్షించింది. ప్రపంచ సదస్సు వేదికను పంచుకోకముందే గత ఆగస్టునుంచి ఈ చిన్నారి పర్యావరణ పరిరక్షణ కోసం నిరసనోద్యమాన్ని చేపట్టింది. ఉష్ణోగ్రతల్లో అనూహ్యమైన మార్పులు, వాతావరణంలో సమతుల్యతలోపించడం, గ్లోబల్ వార్మింగ్ అంతిమంగా భవిష్యత్ తరాలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తోందన్న వాదనను ట్రంప్‌లాంటి వారు అవహేళన చేస్తుండడాన్ని నిరసిస్తూ పర్యావరణ బాధ్యతను పాలకులు గుర్తించాలంటూ పాఠశాల ముందు సమ్మెకు దిగింది. నేతలు ఓట్ల కోసమైనా పర్యావరణ సమస్యను గుర్తించక తప్పదనీ, అంతవరకూ తన పోరాటాన్ని ఆపేదిలేదంటోన్న ఆ చిన్నారి పట్టుదలకు అంతా నివ్వెరపోతున్నారు. ‘‘మా భవిష్యత్తుని ఛిద్రం చేస్తోన్నందుకే నేనీ ఉద్యమాన్ని చేపట్టాను’’అనే నినాదాలను కరపత్రాల రూపంలో స్వీడన్ పార్లమెంటు ఎదుట పంచుతోంది. ఇదే అంశమై ప్రపంచబ్యాంకు లాంటి అంతర్జాతీయ సంస్థలు ప్రముఖ పర్యావరణ వేత్తలతో నిర్వహించిన చర్చాకార్యక్రమాల్లో పాల్గొని శెభాష్ అనిపించుకుంటోంది గ్రేటా. పర్యావరణ పోరాటాన్ని అందిపుచ్చుకున్న ఆస్ట్రేలియా, బ్రిటన్,అమెరికాలాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో దాదాపు 270 పట్టణాలూ, ప్రపంచవ్యాప్తంగా 20,000 మంది విద్యార్థులూ యిప్పుడు గ్రేటా థన్‌బర్గ్ ఉద్యమంలో భాగ స్వాములయ్యారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఉపన్యాసాలకే పరిమితం కాకుండా గ్రేటాథన్ బర్గ్ ఆచరణలో కూడా ముం దుంది. సోలార్ బ్యాటరీస్‌ని ఉపయోగించడం, విమాన ప్రయాణాలు చేయకపోవడం, తన కూరగాయలను తనే పండించుకోవడం లాంటి కార్యక్రమాలతో ప్రపంచం దృష్టిని ఆకట్టుకుంటోంది. -
ఎల్లలు దాటిన తరతరాల ప్రేమ
⇒పెందుర్తి అబ్బాయి.. స్వీడన్ అమ్మాయికి వివాహం ⇒30 ఏళ్ల క్రితం వరుడి తండ్రిదీ అదే తరహాలో పెళ్లి ⇒చూటముచ్చటగా సాగిన వివాహ తంతు తండ్రి ప్రేమ ఎల్లలు దాటింది. ఉపాధి నిమిత్తం స్వీడన్ వెళ్లిన ఆ తండ్రి అక్కడే ఓ మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మూడు దశాబ్దాల క్రితం తండ్రి నడిచిన బాటలోనే నేడు కొడుకు నడిచాడు. అదే దేశానికి చెందిన ఓ యువతిని వలచి భారతీయ సంప్రదాయంతో మనువాడాడు. ఆ జంటను ఇరుదేశాల పెళ్లిపెద్దలతో పాటు సీతారాములు ఆశీర్వదించారు. పెందుర్తి: పెందుర్తి అబ్బాయి స్వీడన్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. పెందుర్తి సమీపంలోని పులగాలిపాలెంలోని రాములవారి సన్నిధిలో ఈ జంట ఒక్కటైంది. చూడముచ్చటైన ఈ వివాహబంధం పూర్వాపరాలివి.. పెందుర్తికి చెందిన పెంటకోట అప్పారావు 40 ఏళ్ల క్రితం స్వీడన్ దేశానికి ఉపాధి నిమిత్తం వెళ్లిపోయారు. పదేళ్లకు అక్కడే స్థిరపడ్డ అప్పారావు ఇవా అనే మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు మగ సంతానం. వీరిలో పెద్ద కుమారుడు జాన్ సంజీవ్ స్వీడన్ దేశానికే చెందిన ఎలిన్ లండన్ అనే యువతిని ఇష్టపడ్డాడు. విషయం ఇరువురి తల్లిదండ్రులకు చేరడంతో వారు పెళ్లికి అంగీకరించారు. అయితే తన సొంత ప్రాంతంలోనే పెళ్లి చేయాలని సంకల్పించిన పెంటకోట అప్పారావు–ఇవా దంపతులు సంజీవ్, ఎలిన్ల పెళ్లి పెందుర్తి సమీపంలోని పులగాలిపాలెంలో చేయాలని నిర్ణయించారు. బుధవారం గ్రామంలోని రామాలయంలో అచ్చమైన తెలుగుదనం ఉట్టిపడేలా సంజీవ్–ఎలిన్ల వివాహం అంగరంగ వైభవంగా జరిపించారు. సీతారాముల సన్నిధిలో సంజీవ్ తాళి కడుతుండగా ఎలిన్ సిగ్గుమొగ్గలైంది. నూతన దంపతులు ముత్యాల తలంబ్రాలు పోటాపోటిగా పోసుకుని సందడి చేశారు. పెళ్లిలో మహిళలు పట్టుచీరలు దరించి భారతీయ సంప్రదాయాన్ని సగర్వంగా చాటిచెప్పగా పురుషులు పట్టుపంచెలు దరించి ఉగాది ముందు అచ్చమైన తెలుగు సంప్రదాయాన్ని రుచి చూపించారు. ఈ వివాహ వేడుకను చూసేందుకు చుట్టు పక్కల గ్రామాల నుంచి ప్రజలు తరలిరావడం విశేషం.