breaking news
SVVU
-
ఎస్వీవీయూ, తిరుపతిలో ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు
తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ (ఎస్వీవీయూ).. రాష్ట్రవ్యాప్తంగా ఒప్పంద ప్రాతిపదికన ల్యాబ్ టెక్నీషియన్ (బ్యాక్లాగ్ పోస్టులు) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. (సైనిక్ స్కూల్, కలికిరిలో 18 ఖాళీలు) ► పోస్టులు: ల్యాబ్ టెక్నీషియన్(బ్యాక్లాగ్) ► మొత్తం పోస్టుల సంఖ్య: 13 ► అర్హత: మెడికల్ ల్యాబ్ టెక్నాలజీలో రెండేళ్ల డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. ఏపీ పారా మెడికల్ బోర్డులో తప్పనిసరిగా రిజిస్టర్ అయి ఉండాలి. ► వయసు: 01.07.2021 నాటికి 18 నుంచి 42ఏళ్ల మధ్య ఉండాలి. ► వేతనం: నెలకు రూ.17,500 చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: డీఎంఎల్టీలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 03.08.2021 ► వెబ్సైట్: https://svvu.edu.in -
వేదాల పరిరక్షణే టిటిడి ధ్యేయం:ఈఓ గోపాలన్
తిరుపతి: వేదాలను పరిరక్షించడమే తిరుమల తిరుపతి దేవస్థానం(టిటిడి) ధ్యేయం అని ఈఓ గోపాలన్ చెప్పారు. శ్రీవెంకటేశ్వర వేదిక్ విశ్వవిద్యాలయం(ఎస్వివియు) రెండవ స్నాతకోత్సవం ముగిసింది. ఈ సందర్భంగా గోపాలన్ మాట్లాడుతూ వేదాలలో నిక్షిప్తమైన జ్ఞానాన్ని వెలుగులోకి తెస్తున్నట్లు చెప్పారు. అన్ని వేద పాఠశాలలో ఒకే కరికులం ఉండేలా చర్యలు తీసుకుంటామని గోపాలన్ అన్నారు.