Sun Pharmaceutical Industries
-
సన్ ఫార్మా.. సూపర్
న్యూఢిల్లీ: హెల్త్‌కేర్ రంగ దేశీ దిగ్గజం సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) తొలి త్రైమాసికంలో టర్న్అరౌండ్ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ1(ఏప్రిల్–జూన్)లో రూ. 1,444 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 1,656 కోట్ల నికర నష్టం ప్రకటించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 7,585 కోట్ల నుంచి రూ. 9,719 కోట్లకు ఎగసింది. లోబేస్తోపాటు.. కీలక ఫార్మా బిజినెస్‌లో సాధించిన వృద్ధి ఇందుకు సహకరించినట్లు కంపెనీ ఎండీ దిలీప్ సంఘ్వీ పేర్కొన్నారు. కోవిడ్–19 ప్రొడక్టులు సైతం ఇందుకు మద్దతిచ్చినట్లు తెలియజేశారు. ఫార్ములేషన్స్ జూమ్ క్యూ1లో సన్ ఫార్మా దేశీ బ్రాండెడ్ ఫార్ములేషన్స్ అమ్మకాలు 39 శాతం జంప్‌చేసి రూ. 3,308 కోట్లను అధిగమించాయి. మొత్తం ఆదాయంలో ఇవి 34 శాతం వాటాకు సమానంకాగా.. టారోతో కలిపి యూఎస్ విక్రయాలు 35 శాతం వృద్ధితో రూ. 2,800 కోట్లను తాకాయి. వీటి వాటా 29 శాతం. ఇక వర్ధమాన మార్కెట్ల ఆదాయం సైతం 25 శాతం పురోగమించి రూ. 1,605 కోట్లను అధిగమించింది. మొత్త ఆదాయంలో ఈ విభాగం 17 శాతం వాటాను ఆక్రమిస్తోంది. మార్కెట్ క్యాప్ అప్ ఫలితాల నేపథ్యంలో సన్ ఫార్మా షేరు ఎన్ఎస్ఈలో 10 శాతం దూసుకెళ్లి రూ. 774 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 784 సమీపానికి చేరింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. బీఎస్ఈలో కంపెనీ మార్కెట్ క్యాప్(విలువ) రూ. 16,971 కోట్లు బలపడింది. వెరసి రూ. 1,85,704 కోట్లకు చేరింది. ఎన్ఎస్ఈలో 3.58 కోట్లు, బీఎస్ఈలో 20.34 లక్షల షేర్లు చొప్పున ట్రేడయ్యాయి. -
సన్‌ఫార్మా లాభాలు నామమాత్రం
ముంబై: దేశీయ అతిపెద్ద ఔషధ తయారీ సంస్థ సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ మంగళవారం త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. అమెరికా మరియు భారతీయ మార్కెట్లలో అమ్మకాలు నెమ్మదించడంతో థర్డ్ క్వార్టర్ లో లాభాలు నామామాత్రంగా నమోదు చేసింది. డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో 5 శాతం నికర లాభాలు క్షీణించి రూ.1472 కోట్లను ప్రకటించింది. అంతకు ముందు సంవత్సరంలో రూ.1545 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. మొత్తం ఆదాయం8 శాతం పెరిగి 7683 కోట్లకు చేరింది. నిర్వహణ లాభం(ఇబిటా) 9 శాతం పుంజుకుని రూ. 2,453 కోట్లకు చేరింది. ఇబిటా మార్జిన్లు 31.5 శాతం నుంచి 31 శాతానికి బలహీనపడ్డాయి. పన్ను వయ్యాలు రూ. 59 కోట్ల నుంచి రూ. 373 కోట్లకు పెరిగాయి. -
సన్ ఫార్మా ఫలితాలపై ర్యాన్‌బాక్సీ భారం
- 60 శాతం తగ్గిన నికర లాభం న్యూఢిల్లీ: ఫార్మా దిగ్గజం సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ నికర లాభం(కన్సాలిడేటెడ్) ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక కాలంలో 60 శాతం తగ్గింది. గత క్యూ1లో రూ. 1,205 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.479 కోట్లకు తగ్గిందని సన్ ఫార్మా ఇండస్ట్రీస్ ఎండీ దిలీప్ సంఘ్వి చెప్పారు. రాన్‌బ్యాక్సీ విలీనం కారణంగా రూ.685 కోట్ల వన్టైమమ్ మినహాయింపు చార్జీల కారణంగా నికర లాభం భారీ స్థాయిలో తగ్గిందని వివరించారు. మొత్తం ఆదాయం రూ.6,341 కోట్ల నుంచి రూ.6,768 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. ర్యాన్‌బాక్సీ, సన్ఫార్మాల వ్యాపారాలను విలీనం చేసే క్రమంలో తలెత్తిన ఒక్క సారి మినహాయింపు చార్జీల భారం ఈ క్వార్టర్ ఆర్థిక ఫలితాలపై పడిందని దిలీప్ సంఘ్వి పేర్కొన్నారు. -
మళ్లీ ముఖేష్దేమొదటి స్థానం
వాషింగ్టన్: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ మరోసారి భారత్‌లో అత్యధిక సంపన్నుల జాబితాలో మొదటి స్థానంలో నిలిచారు. 23.6 బిలియన్ డాలర్ల ఆస్తితో ఆయన ఈ స్థానాన్ని కైవసం చేసుకున్నారని పోర్బ్స్ పత్రిక వెల్లడించింది. ముఖేశ్ ఆస్తి గత ఏడాది కంటే 2.6 బిలియన్లు పెరిగింది. దీంతో ఆయన వరుసగా ఎనిమిదో ఏడాది కూడా భారత్‌లో అత్యధిక సంపన్నుల జాబితాలో తొలి స్థానాన్ని కొనసాగించారని పేర్కొంది. భారత్‌లో 100 అత్యధిక సంపన్నుల తాజా జాబితాను గురువారం వాషింగ్టన్లో విడుదల చేసింది. ఈ జాబితాలో మొదటి వంద మంది భారతీయులేని బిలయనీర్లేనని తెలిపింది. కేంద్రంలో కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దేశంలో స్టాక్ మార్కెట్ కొత్త పుంతలు తొక్కిందని అభిప్రాయపడింది. అలాగే రెండవ స్థానాన్ని ప్రముఖ ఔషధ కంపెనీ సన్ ఫార్మా వ్యవస్థాపకుడు దిలీప్ సింఘ్వీ అక్రమించారని చెప్పింది. ఇప్పటివరకు ఆ స్థానంలో ఉన్న ఎన్నారై వ్యాపారీ, ఉక్కు వ్యాపార దిగ్గజం లక్ష్మీ మిట్టల్‌ను ఐదో స్థానానికి నెట్టి మరీ దిలీప్ రెండవ స్థానాన్ని అందుకున్నారని పేర్కొంది. ఆ తర్వాత ఎనిమిది స్థానాలు వరుసగా 16.4 బిలియన్ డాలర్లతో విప్రో అధినేత అజీమ్ ప్రేమ్ జీ, 15.9 బిలియన్ డాలర్లతో టాటా గ్రూప్ అధినేత పల్లొంజి మిస్త్రీ, 15.8 బిలియన్లతో లక్ష్మీ నివాస్ మిట్టల్, 13.3 బిలియన్లతో హిందూజా బ్రదర్స్, రూ. 12.5 బిలియన్లతో శివ నాడర్, 11.6 బిలియన్లతో గోద్రెజ్ ఫ్యామిలీ, 9.2 బిలియన్లతో కుమార్ బిర్లా, రూ.7.8 బిలియన్లతో సునీల్ మిట్టల్ ఉన్నారని పోర్బ్స్ విడుదల చేసిన జాబితాలో వెల్లడించింది. -
కుబేరుల ఖిల్లా.. భారత్!
-
కుబేరుల ఖిల్లా.. భారత్!
న్యూఢిల్లీ: భారత్‌లో సంపన్నుల సంఖ్య అంతకంతకూ ఎగబాకుతోంది. ప్రపంచవ్యాప్తంగా కుబేరుల సంఖ్య పరంగా భారత్ అయిదోస్థానాన్ని చేజిక్కించుకుంది. దేశంలో మొత్తం 70 మంది బిలియనీర్లు లెక్కతేలారు. చైనాకు చెందిన రీసెర్చ్ సంస్థ హురున్... ప్రపంచ సంపన్నుల జాబితా-2014లో ఈ వివరాలను వెల్లడించింది. కాగా, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీయే ఈసారి కూడా భారత్‌లో అత్యంత ధనిక వ్యక్తిగా నిలిచినట్లు తెలిపింది. ఆయన వ్యక్తిగత సంపద 18 బిలియన్ డాలర్లు(దాదాపు 1.12 లక్షల కోట్లు)గా అంచనా. కాగా, ప్రపంచ బిలియనీర్ల జాబితాలో ఆయన 41వ ర్యాంక్‌లో నిలిచారు. నంబర్ వన్ స్థానం బిల్‌గేట్స్‌కు దక్కింది. ఆయన సంపద 68 బిలియన్ డాలర్లు(సుమారు రూ.4.22 లక్షల కోట్లు). భారత్‌లో జోరు... ప్రపంచ టాప్ బిలియనీర్లలో భారత్ నుంచి చోటు దక్కించుకున్నవారిలో ఉక్కు దిగ్గజం లక్ష్మీ మిట్టల్ 49 ర్యాంక్‌లో ఉన్నారు. ఆయన వ్యక్తిగత సంపద 17 బిలియన్ డాలర్లు. సన్ ఫార్మా వ్యవస్థాపకుడు, ఎండీ అయిన దిలీప్ సంఘ్వీ, విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీలు సంయుక్తంగా 77వ స్థానంలో నిలిచారు. వీళ్లిద్దరి సంపద చెరో 13.5 బిలియన్ డాలర్లుగా అంచనా. కాగా, టాటా సన్స్‌కు చెందిన పల్లోంజీ మిస్త్రీ(12 బిలియన్ డాలర్లు), హిందూజా గ్రూప్‌నకు చెందిన ఎస్పీ హిందుజా కుటుంబం(12 బిలియన్ డాలర్లు) కూడా 93 ర్యాంక్‌లో ఉన్నారు. గడిచిన ఏడాది వ్యవధిలో డాలరుతో రూపాయి మారకం విలువ 12 శాతం పైగా క్షీణించడంతో బిలియనీర్ల ర్యాంకింగ్స్‌లో భారతీయులు కొంత వెనుకబడటానికి కారణమైందని హురున్ పేర్కొంది. అయినప్పటికీ.. 2013తో పోలిస్తే 17 మంది కుబేరులు పెరిగినట్లు వెల్లడించింది. జర్మనీ, స్విట్టర్లాండ్, ఫ్రాన్స్, జపాన్ల కంటే భారత్‌లోనే బిలియనీర్లు అధికంగా ఉండటం విశేషం. కాగా, మొత్తం 70 మంది భారతీయ కుబేరుల సంపద విలువ 390 బిలియన్ డాలర్లుగా అంచనా. హురున్ జాబితాలో ఇతర ముఖ్యాంశాలివీ... గేట్స్ తర్వాత బెర్క్‌షైర్ హ్యాత్వే అధిపతి వారెన్ బఫెట్ 64 బిలియన్ డాలర్ల సంపదతో 2వ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. స్పెయిన్‌కు చెందిన ఇండిటెక్స్ గ్రూప్ చైర్మన్, సహ వ్యవస్థాపకుడు అమన్షియో ఒర్టెగా 3వ ర్యాంక్‌లో నిలిచారు. ఆయన సంపద 62 బిలియన్ డాలర్లు. నాలుగో స్థానంలో మెక్సికో టెలికం దిగ్గజం కార్లోస్ స్లిమ్ హెలూ కుటుంబం(60 బిలియన్ డాలర్లు), ఐదో ర్యాంక్‌లో ఒరాకిల్ సీఈఓ లారీ ఎలిసన్(60 బిలియన్ డాలర్లు) నిలిచారు. కుబేరుల సంఖ్య పరంగా 481 మందితో అమెరికా అగ్రస్థానంలో ఉంది. తర్వాత స్థానంలో చైనా(358 మంది బిలియనీర్లు) నిలిచింది. ప్రపంచ కుబేరుల్లో సగం మంది ఈ రెండు దేశాల్లోనే ఉన్నారు. ముంబైలో 33 మంది బిలియనీర్లు ఉన్నారు. అత్యధిక సంపన్నులున్న ప్రపంచ నగరాల్లో ఆరో స్థానం. న్యూయార్క్ నగరం 84 మంది కుబేరులతో ప్రపంచ బిలియనీర్ల రాజధానిగా నంబర్ వన్ ర్యాం క్‌ను చేజిక్కించుకుంది. గతేడాది ఈ సంఖ్య 70. అమెరికా డాలర్లలో సంపదను లెక్కించారు. ఈ ఏడాది జనవరి 17 నాటి గణాంకాల ఆధారంగా జాబితాను రూపొందించారు. మొత్తం ఈ సూపర్ రిచ్ లిస్ట్‌లో 68 దేశాల నుంచి 1,867 మంది బిలియనీర్లు లెక్కతేలారు. వీళ్ల మొత్తం సంపద కళ్లు చెదిరేరీతిలో 6.9 లక్షల కోట్లు. ఈ ఏడాది లిస్ట్‌లో ప్రతి 9 మందిలో ఒకరు మహిళ కావడం గమనార్హం. 2013లో ప్రతి పది మందిలో ఒక మహిళా బిలియనీర్ ఉన్నారు.