
సన్ ఫార్మా ఫలితాలపై ర్యాన్‌బాక్సీ భారం
ఫార్మా దిగ్గజం సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ నికర లాభం(కన్సాలిడేటెడ్) ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక కాలంలో 60 శాతం తగ్గింది...
- 60 శాతం తగ్గిన నికర లాభం
న్యూఢిల్లీ: ఫార్మా దిగ్గజం సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ నికర లాభం(కన్సాలిడేటెడ్) ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక కాలంలో 60 శాతం తగ్గింది. గత క్యూ1లో రూ. 1,205 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.479 కోట్లకు తగ్గిందని సన్ ఫార్మా ఇండస్ట్రీస్ ఎండీ దిలీప్ సంఘ్వి చెప్పారు. రాన్‌బ్యాక్సీ విలీనం కారణంగా రూ.685 కోట్ల వన్‌టైమమ్ మినహాయింపు చార్జీల కారణంగా నికర లాభం భారీ స్థాయిలో తగ్గిందని వివరించారు. మొత్తం ఆదాయం రూ.6,341 కోట్ల నుంచి రూ.6,768 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. ర్యాన్‌బాక్సీ, సన్‌ఫార్మాల వ్యాపారాలను విలీనం చేసే క్రమంలో తలెత్తిన ఒక్క సారి మినహాయింపు చార్జీల భారం ఈ క్వార్టర్ ఆర్థిక ఫలితాలపై పడిందని దిలీప్ సంఘ్వి పేర్కొన్నారు.