breaking news
Summer schools
-
మొక్కు‘బడులు’
నిజాంసాగర్, న్యూస్‌లైన్: రాజీవ్ విద్యామిషన్ ఆధ్వర్యంలో ఈనెల 10 నుంచి ప్రారంభించిన వేసవి బడులు నామమాత్రం గా కొనసాగుతున్నాయి. చదువులో వెనుకబడిన విద్యార్థుల కోసం వేసవి బడులను తెరచినా ఆదరణ కరువైంది. ప్రాథమిక స్థాయిలో అక్షరాభ్యాసానికి దూరమతున్న విద్యార్థుల్లో నెపుణ్యతను పెంపొందించడంతో పాటు వారిని ముందుకు తీసుకురావడానికి చేపట్టిన ప్రణాళిక నీరుగారుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో కొనసాగుతున్న వేసవి బడుల్లో వెనుకబడిన విద్యార్థులు కనిపించడం లేదు. జిల్లాలో.. జిల్లావ్యాప్తంగా 229 క్లస్టర్లకు గాను ప్రస్తుతం 228 క్లస్టర్లలో వే సవి బడులను ఆర్వీఎం సహకారంతో నిర్వహిస్తున్నారు. ప్రాథమిక స్థాయిలోని 1, 2, 3, 4, 5 తరగతుల్లో వెనుకబడిన (సీ గ్రేడ్) విద్యార్థులను క్లస్టర్ల వారీగా ఉన్న పాఠశాలల ప్రధానోపాధ్యాయులు గుర్తించారు. వేసవి సెలవుల్లో వీరు అభ్యసనకు దూరం కాకుండా ఉండేందుకు ఆటపాటల ద్వారా చదువు నేర్పించేందుకు వేసవి బడులను ప్రారంభించారు. అభ్యసన పుస్తకాలను ఆర్వీఎం అధికారులు మండలాల వారీగా పాఠశాలలకు పంపిణీ చేశారు. ఒక్కో వేసవి బడిలో 30 మంది విద్యార్థుల చొప్పున గుర్తించారు. వేసవి బడుల నిర్వహణ కోసం ఆయా క్లస్టర్ల వారీగా ఉన్న సీఆర్పీలు బడులను నిర్వహిస్తున్నారు. బడులు ప్రారంభమైన వారం రోజుల పాటు సీ గ్రేడ్ విద్యార్థులు ఆసక్తి చూపారు. కాని గడిచిన వారం రోజుల నుంచి కొన్ని బడులకు విద్యార్థులు రావడం లేదు. ఆయా క్లస్టర్ల వారీగా కొనసాగుతున్న వేసవి బడుల నిర్వహణపై ఆర్వీఎం అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో సీఆర్పీలు మొక్కుబడిగా వాటి ని నిర్వహిస్తున్నారు. ఏ గ్రేడ్ విద్యార్థులు హాజరు వెనుకబడిన విద్యార్థుల కోసం ప్రభుత్వం ప్రారంభించిన వేసవి బడుల్లో ఏ గ్రేడ్ విద్యార్థులు ఉం టున్నారు. సోమవారం మహమ్మద్‌నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోని వేసవి బడిలో పలువురు ఏ గ్రేడ్ విద్యార్థులు కనిపించారు. ఇక్కడ తొమ్మిది మంది సీ గ్రేడ్ విద్యార్థులుండగా.. వారు వేసవి బడికి రాకుండా వీధుల్లో ఆడుకోవడానికే ఆసక్తి చూపుతున్నట్లు తెలిసింది. -
వేసవి బడులకు విశేష స్పందన
నాగిరెడ్డిపేట, న్యూస్‌లైన్ : ‘అందరూ చదవాలి..అందరూ ఎదగాలి’ అనే లక్ష్యసాధన దిశగా..ప్రభుత్వ పాఠశాలల్లో వెనుకబడిన విద్యార్థులను రాణించేలా చేయాలనే ఉద్దేశం తో వేసవి సెలవుల్లో ఆర్వీఎం అధికారులు అభ్యాస దీపికలను అందజేసి పాఠశాలల సముదాయాల్లోనే వేసవిబడులను ప్రారంభించారు. గ్రామాల్లో వేసవి తరగతులను సీఆర్పీలు నిర్వహిస్తున్నారు. 1 నుంచి 5వ తరగతి వరకు తెలుగు, ఆంగ్లం, గణితాల్లో విద్యార్థులలో కనీస సామర్థ్యాలను పెంపొందించాలనే ఆశయంతో ప్రభుత్వం ఈ తరగతులను ప్రారంభించింది. వేసవి సెలవుల్లో విద్యార్థులు అభ్యాసదీపికకు కొంతసమయం కేటాయించి ఆడుతూ, పా డుతూ ఆనందంతో అభ్యాసాలు, కృత్యాలు చేసే ఉపయోగకరంగా ఉండేవిధంగా కృషి చేస్తున్నారు. మం డలంలోని గోపాల్పేట కాంప్లెక్స్ పరిధిలో గల గోపాల్పేట, బొల్లారం కాంప్లెక్స్ పరిధిలోని బొ లా ్లరం ప్రాథమిక పాఠశాల, తాండూర్ కాంప్లెక్స్పరిధిలోని కిచ్చన్నపేట ప్రాథమిక పాఠశాల, మాల్తుమ్మెద కాం ప్లెక్స్ పరిధిలోని గోలిలింగాల ప్రాథమికొన్నత పాఠశాలలో వేసవి తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు రెండు గంటలు ప్రతిరోజు ఉదయం 7.30 గంటల నుంచి 9.30గంటల వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. 1-5వ తరగతిలో విద్యనభ్యసించే విద్యార్థుల్లో ‘సి’గ్రేడ్‌లో ఉన్న విద్యార్థులను గుర్తించి వారిలో కనీస సామర్థ్యాలను పెంపొందించడమే ఈ తరగతుల ముఖ్య ఉద్దేశం. ఈ నెల 10న జిల్లావ్యాప్తంగా పాఠశాలల కాంప్లెక్స్‌ల్లో సంబంధిత సీఆర్పీలు వేసవి బడులను ప్రారంభించారు. తెలుగులో వర్ణమాల-కృత్యాలు, సరళ, గుణింత, దిత్వాక్షర, సంయుక్తాక్షర పదాలు, చిన్న చిన్న వా క్యాలు, పొడుపుకథలు, సామెతలు, చిత్రకథ , ఎత్తుకుపై ఎ త్తు, కోతి-క్రికెట్ వంటి వాటిని వేసవి తరగతుల్లో సీఆర్పీలు గేయకథల రూపంలో విద్యార్థులకు బోధిస్తారు. ఆంగ్లంలో వర్క్‌బుక్, అల్ఫాబిట్ తదితర వాటిని విద్యార్థులకు నేర్పిస్తారు. గణితంలో సంఖ్యల గురించి తెలియజేయడం, కూడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగహారాలు నేర్పిస్తారు. తల్లిదండ్రులకు సైతం పెరిగిన ఆసక్తి వేసవిబడులకు విద్యార్థులను పంపించేందుకు వారి తల్లిదండ్రులు సైతం ఆసక్తిని కనబరుస్తున్నారు. వేసవి సెలవుల్లో కేవలం ఉదయంపూట చల్లని వాతావరణంలో రెండుగంటలపాటు తరగతులు నిర్వహించడం వల్ల విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని వారు పే ర్కొంటున్నారు. పాఠశాలలు పునఃప్రారంభమైన తరువాత వారు కింది తరగతుల్లో నేర్చుకున్న అంశాలను మర్చిపోతారని, అలాకాకుండా వేసవి తరగతులు నిర్వహించడం వల్ల విద్యార్థులకు పునశ్చరణ స్పష్టంగా ఉంటుందని అభిప్రాయ పడుతున్నారు.