breaking news
straik
-
రోడ్లపై నోట్లు ఇలా చల్లుతున్నాడేంటి?
-
రైల్వే చార్జీలను తగ్గించాలి
- కాంగ్రెస్ నాయకుల డిమాండ్ - రైల్వేస్టేషన్ ఎదుట ధర్నా - ప్రధాని దిష్టిబొమ్మ దహనం నిజామాబాద్ సిటీ : పెంచిన రైలు చార్జీలను వెంటనే తగ్గించాలని కోరుతూ జిల్లా, నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్ ఆవరణలో ధర్నా నిర్వహించారు. ఎన్డీఏ ప్రభుత్వం 14 శాతం రైలు చార్జీలు పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తాహెర్, నగర అధ్యక్షుడు కేశవేణు, మున్సిపల్ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పార్టీ కార్యాలయం నుంచి రైల్వేస్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. స్టేషన్ ఎదుట బైఠాయించి పెంచిన రైలు చార్జీలను వెంటనే తగ్గించాలని, దేశ ప్రధాని నరేంద్ర మోడీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం ప్రధాని దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు తాహెర్ మాట్లాడుతూ.. ఎన్డీఏ ప్రభుత్వం ప్రజలకు చెప్పేది ఒకటని, చేసేది ఒకటని చెప్పడానికి రైలు చార్జీల పెంపు ఒక నిదర్శనమన్నారు. రైల్వే బడ్జెట్ను ప్రవేశ పెట్టక ముందే రైలు చార్జీలు పెంచి బడుగు, బలహీన వర్గాల ప్రజలపై ఎనలేని భారం మోపడం సరికాదన్నారు. పెంచిన రైలు చార్జీలను వెంటనే తగ్గించి, సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా బడ్జెట్ను ప్రవేశపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకులు రైల్వేస్టేషన్ లోపలకు వెళ్ళకుండా స్థానిక ఒకటో టౌన్ పోలీసులు అడ్డుకున్నారు. ధర్నా అనంతరం రైల్వే పోలీసులు నాయకుల వద్దకు చేరుకుని ధర్నాలో పాల్గొన్నవారి వివరాలు సేకరించారు. ధర్నాలో టీపీసీసీ సహాయ కార్యదర్శి రత్నాకర్, కార్పొరేటర్లు దారం సాయిలు, మాయావార్ సాయిరాం, డీసీసీ ప్రధాన కార్యాదర్శి పోలా ఉషా, కోశాధికారి మీసాల సుధాకర్, యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బొబ్బిలి రామకృష్ణ, అర్బన్ అధ్యక్షుడు బంటురాము, ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షుడు సుమన్, మాజీ కార్పొటర్ బంటు శంకర్, నాయకులు ఫయాజుద్దీన్, సిర్పరాజ్, రాజేష్, పార్ధసారధి,హరికిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
రైలు చార్జీల పెంపును నిరసిస్తూ కమ్యూనిస్టుల ధర్నా
ఏలూరు (ఫైర్స్ట్టేషన్ సెంటర్) : పెంచిన రైలు చార్జీలను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సీపీఎం, సీపీఐ ఎంఎల్ (న్యూడెమోక్రసీ) కార్యకర్తలు ఏలూరు పవర్పేట రైల్వే స్టేషన్ వద్ద ఆదివారం ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీపీఎం నాయకులు ఎ.రవి, బి.జగన్నాథం మాట్లాడుతూ రైల్వేచార్జీల పెంపును ప్రజలంతా ఐక్యంగా వ్యతిరేకించాలన్నారు. బి.సోమయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధిక ధరలు నియంత్రించలేక పోయిందని విమర్శించి అధికారంలోకి వచ్చిన బీజేపీ కూడా అవే విధానాలను అవలంభించడం సిగ్గుచేటన్నారు. ప్రజలపై భారాలు మోపితే ప్రతిపక్ష పాత్ర పోషిస్తానన్న జనసేన నాయకుడు పవన్ కల్యాణ్ ఎందుకు మాట్లాడటంలేదని ప్రశ్నించారు. ధర్నా అనంతరం నాయకులు కార్యకర్తలు పవర్ పేట నుంచి ప్రభావతి ఆసుపత్రి వరకు నినాదాలు చేస్తూ ప్రదర్శన నిర్వహించారు. న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో ఏలూరు పెద్ద రైల్వేస్టేషన్ వద్ద ధర్నా నిర్వహించారు. నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కె.పొలారి, యు.వెంకటేవ్వరరావు, బద్దా వెంకట్రావు, కాకర్ల అప్పారావు తదితరులు నాయకత్వం వహించారు.