breaking news
Srikantacari
-
శ్రీకాంతాచారి కలలు నిజం చేయాలి
నల్లగొండ రూరల్ :అమరుడు శ్రీకాంతాచారి కన్న కలలను నిజం చేయడానికి ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని కలెక్టర్ చిరంజీవులు పిలుపునిచ్చారు. తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరుడు కాసోజు శ్రీకాంతాచారి 5వ వర్ధంతిని బుధవారం నల్లగొండలోని క్లాక్‌టర్‌సెంటర్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకాంతాచారి విగ్రహానికి కీరాభిషేకం చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడారు. శ్రీకాంతాచారి మరణం తెలంగాణ మలిదశ ఉద్యమానికి ఆజ్యం పోసిందన్నారు. అగ్నికి ఆహుతవుతూ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడటానికి కారకుడయ్యాడన్నారు. ఆయన స్ఫూర్తితో ఉద్యమం ఎగిసి స్వరాష్ట్ర సాధనకు కారణమైందన్నారు. శ్రీకాంతాచారి త్యాగం వృథాకాలేదని పేర్కొన్నారు. ఎస్పీ డాక్టర్ ప్రభాకర్‌రావు మాట్లాడుతూ శ్రీకాంతాచారి తెలంగాణ కోసం తన ప్రాణాన్ని త్యాగం చేశాడన్నారు. ఆయన ఆశయ సాధన కోసం అందరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వేణుగోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. శ్రీకాంతాచారి ఆశయాలు సాధించేందుకు కృషిచేయాలి నల్లగొండ రూరల్ : తెలంగాణ ఉద్యమంలో అమరుడైన శ్రీకాం తాచారి ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి పిలుపునిచ్చా రు. బుధవారం శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా స్థానిక క్లాక్‌టవర్ సెంటర్లో ఆయన విగ్రహానికి పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ దుబ్బాక నర్సింహరెడ్డితో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. అంతకు ముందు తెలంగాణ విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో పాల్గొని శ్రీకాంతాచారి చిత్రపటానికి నివాళులర్పించారు. రక్తదాన శిబిరం శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా తెలంగాణ విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘం ఆధ్వర్యంలో నల్లగొండలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకాంతాచారి చిత్రపటానికి కలెక్టర్ టి. చిరంజీవులు ఎస్పీ డాక్టర్ ప్రభాకర్‌రావు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ రాములునాయక్, సీఐ ఆదిరెడ్డి, వన్‌టౌన్ సీఐ రవీందర్, ఆర్డీఓ వెంకటాచారి ,జిల్లా అధ్యక్షుడు విశ్వనాథం, చొల్లేటి రమేష్, శంకరాచారి, లక్ష్మణాచారి, కృష్ణాచారి, అర్జున్, ఆంజనేయులు, పర్వతం అశోక్, విజయ్, మధు, కొండయ్య, నర్సింహాచారి, టీఆర్ఎస్ నాయకులు బక్క పిచ్చయ్య, ఫరీద్, మాలే శరణ్యారెడ్డి, గుం టోజు వెంకటాచారి, మైనం శ్రీనివాస్, అభిమన్యు శ్రీనివాస్, రేఖల భద్రాద్రి, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ కంచర్ల భూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పొడిచేడుకు శ్రీకాంతాచారి పేరు
విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి హామీ మోత్కూరు: తెలంగాణ మలిదశ ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంతాచారి స్వగ్రామమైన పొడిచేడుకు శ్రీకాంతాచారి గ్రామంగా నామకరణం చేసేందుకు కృషి చేస్తానని విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి హామీ ఇచ్చారు. శ్రీకాంతాచారి ఐదవ వర్ధంతి సభ బుధవారం ఆయన నల్లగొండ జిల్లా మోత్కూరు మండలం పొడిచేడులో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శ్రీకాంతాచారి ప్రాణత్యాగం, కీర్తి దేశానికే గర్వకారణమన్నారు. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ, బంగారు తెలంగాణ ఉద్యమంలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అంతకు ముందు శ్రీకాంతాచారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళుర్పించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గాదరి కిశోర్, వేముల వీరేశం, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణ కోసమే ఆ బలిదానం
శ్రీకాంతాచారి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం అలీ హైదరాబాద్: తెలంగాణ కోసమే శ్రీకాంతాచారి బలయ్యాడని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్‌అలీ అన్నారు. శ్రీకాంతాచారి జయంతి సందర్భంగా ఎల్బీ నగర్ రింగురోడ్డులో అతని విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రితో పాటు హోంమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి, రవాణా మంత్రి పట్నం మహేందర్‌రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మహమూద్ అలీ మాట్లాడుతూ తెలంగాణ మహాత్ముడు కేసీఆర్ అని, ఆయన చేపట్టిన ఉద్యమం అనిర్వచనీయమని పేర్కొన్నారు. హోంమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి మాట్లాడుతూ ఎల్బీనగర్లో శ్రీకాంతాచారి విగ్రహాన్ని ఆవిష్కరించడంతో తన జన్మ ధన్యమైందని అన్నారు. ఈ సందర్భంగా శ్రీకాంతాచారి విగ్రహశిల్పి మాయాచారిని మంత్రులు సన్మానించారు.