breaking news
Soundaraja
-
నటుడు రాజ-తమన్నాల పెళ్లి
మధురై: ప్రముఖ తమిళనటుడు సౌందర రాజ ఓ ఇంటివాడయ్యాడు. గ్రీన్ యాపిల్ ఎంటర్టైన్మెంట్ సంస్థ సీఈవో తమన్నాతో రాజా పెళ్లి శుక్రవారం ఘనంగా జరిగింది. టెంపుల్ సిటీ మధురైలో జరిగిన వేడుకకు ఇరు కుటుంబాలు, స్నేహితులు హాజరయ్యారు. సౌందర రాజ.. ‘సుందరపాండియన్’, ‘జిగర్తాండా’, ‘ఎనక్కు వేరు ఎంగుమ్ కిలైగళ్ కడియాదు’ తదితర సినిమాల్లోని పాత్రలతో కోలీవుడ్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని, గుర్తింపును సొంతంచేసుకున్నాడు. తమిళ సినీ పరిశ్రమకు చెందిన పలువులు ఈ కొత్త జంటను ఆశీర్వదిస్తూ ప్రకటనలు చేశారు. రాజ ప్రస్తుతం ‘కల్లాన్’, కాదయ్కుట్టి సింగమ్’’ లాంటి సినిమాలతో బిజీగా ఉన్నాడు. -
సెప్టెంబర్లో ఒరు కనవు పోల
తమిళసినిమా: ఒరు కనవు పోల చిత్రం సెప్టెంబర్లో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. ఇరైవన్ సినీ క్రియేషన్స్ పతాకంపై సీ.సెల్వకుమార్ నిర్మించిన చిత్రం ఒరు కనవు పోల. రామకృష్ణన్, సౌందర్రాజా కథానాయకులుగా నటించిన ఇందులో అమల అనే నూతన నటి కథానాయకిగా నటించింది. ఇతర ముఖ్య పాత్రల్లో అరుళ్దాస్, చార్లీ,మియిల్సామి, వెట్ట్రివేల్రాజా, కవి పెరియతంబి, విన్నర్ రామచంద్రన్, శ్రీలత, బాలాంభిక తదితరులు ముఖ్య పాత్రలను పోషించారు.కాగా ఒక ప్రధాన పాత్రలో మలయాళ దర్శకుడు మధుపాల్ నటించారు. ఈయన జాతీయ అవార్డు గ్రహీత అన్నది గమనార్హం. ఎన్.అళగప్పన్ ఛాయాగ్రహణను, ఇఎస్.రామ్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రానికి కథ,కథనం, దర్శకత్వం బాధ్యతలను వీసీ.విజయశంకర్ నిర్వహించారు. చిత్ర వివరాలను ఈయన తెలుపుతూ మంచి కథా బలం,వైవిధ్యభరిత కథనాలతో కూడిన చిత్రాలకు ప్రేక్షకుల ఆదరణ ఎప్పుడూ ఉంటుందన్నారు. అందుకు ఉదాహరణ బాహుబలి 2, విక్రమ్వేదా, మీసైమురుక్కు లాంటి చిత్రాలని పేర్కొన్నారు. ఆ వరుసలో విభిన్న కథనంతో తెరకెక్కించిన చిత్రం ఒరు కనవు పోల అని అన్నారు. ఈతరం యువత స్నేహం గురించి ఆవిష్కరించే చిత్రంగా ఒరు కనవు బోల చిత్రం ఉంటుందన్నారు. చిత్ర నిర్మాణ కార్యక్రమాలు పూర్తి అయ్యాయని, సెప్టెంబర్ నెలలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు తెలిపారు.