breaking news
slits
-
వివాహేతర సంబంధం.. నిర్జన ప్రదేశానికి పిలిచి.. కత్తితో..
కర్ణాటకాలోని చిక్కబళ్లాపూర్ జిల్లాలో అమానవీయ ఘటన జరిగింది. వివాహేతర సంబంధంపై వచ్చిన కలహాలతో ఓ వ్యక్తి మరో వ్యక్తి గొంతును కోసేశాడు. అనంతరం బాధితుని గొంతు నుంచి రక్తాన్ని తాగే ప్రయత్నం చేశాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. నిందితునిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు నిందితున్ని విజయ్‌గా గుర్తించారు. నిందితుడు మరేశ్ అనే వ్యక్తి భార్యతో వివాహేతర సంబంధాన్ని కలిగి ఉన్నాడు. ఈ క్రమంలో ఇరువురి మధ్య పలుమార్లు తగాదా కూడా జరిగింది. ఆ అంశంపై చర్చించడానికి బాధితున్ని విజయ్ నిర్జన ప్రదేశానికి పిలిచాడు. వాగ్వాదంలో విచక్షణ కోల్పోయిన నిందితుడు.. మరేశ్ గొంతును కత్తిరించాడు. అనంతరం పక్కనే కూర్చుని రక్తాన్ని తాగే ప్రయత్నం చేశాడు. ఓ బాటసారి వీడియో తీసి పోస్టు చేయగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బాధితుడు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇదీ చదవండి: కారు పార్క్ చేసిన మహిళ.. ఒక్కసారిగా వరద రావడంతో.. -
సుప్రీం కోర్టు వద్ద చేయి కోసుకున్నాడు
న్యూఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానం వద్ద శుక్రవారం చిన్నపాటి కలకలం చోటుచేసుకుంది. సుప్రీం కోర్టు పరిసరాల్లో ఓ వ్యక్తి తన చేతిని కత్తితో కోసుకున్నారు. దీంతో వెంటనే అక్కడ ఉన్న భద్రత సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతనికి రక్తస్రావం కావడంతో చేతికి గుడ్డ కట్టి అక్కడి నుంచి తరలించారు. కాగా, ఈ చర్యకు పాల్పడిన వ్యక్తి వివరాలు తెలియరాలేదు. -
దారుణం..అనుమానంతో భార్య పీక కోసిన భర్త
-
అనుమానంతో భార్య పీక కోసిన భర్త
పశ్చిమ గోదావరి జిల్లా : నిడదవోలు మండలం అట్లపాడు గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. భార్య పీక కోసి అనంతరం తాను కూడా అదే బ్లేడుతో భర్త పీక కోసుకున్నాడు. ఈ సంఘటన బుధవారం ఉదయం చోటుచేసుకుంది. వివరాలు..చాగల్లు మండలం చంద్రవరం గ్రామానికి చెందిన పుచ్చకాయల వెంకటేశ్వరరావుకు నిడదవోలు మండలం పురుషోత్త పల్లి గ్రామానికి చెందిన స్వర్ణతో 13 సంవత్సరాల క్రితం వివాహమైంది. ఇదే క్రమంలో కుటుంబ పోషణ నిమిత్తం స్వర్ణ, కువైట్ వెళ్లి 15 రోజుల క్రితం స్వగ్రామం వచ్చింది. అప్పటి నుంచి భార్యపై భర్త వెంకటేశ్వరరావు అనుమానం పెంచుకున్నాడు. ఈ విషయమై ఇరువురి మధ్య పెనుగులాట జరిగింది. ఆగ్రహంతో వెంకటేశ్వరరావు బ్లేడుతో స్వర్ణ పీకను కోసి తాను కూడా కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంకటేశ్వర రావు పరిస్థితి విషమంగా ఉందని, భార్య స్వర్ణకు ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
స్లిట్ స్టైల్‌తో చింపెయ్!
ఏదైనా పని గొప్పగా చేస్తేచింపేశారు అంటారు.వేసుకునే దుస్తులు కూడాఅంతే గొప్పగా ఉంటేచింపేశారు.. అనరా!ఈ స్లిట్ ఫ్యాషన్వేసెయ్.. చింపెయ్! ‘డ్రెస్ చాలా ట్రెడిషనల్‌గా ఉంది...కాస్త స్టైలిష్ లుక్ ఇస్తే బాగుండు ఎలా..’అనుకుంటున్నారా! చాలా సింపుల్. ఇలా ఒక స్లిట్ఇచ్చి చూడండి. నేటి తరానికి బాగా నప్పేఈ డిజైన్ సమ్మర్లో సౌకర్యంగానూ ఉంటుంది. సంప్రదాయ టాప్‌కి స్టైలిష్ స్లిట్ పెళ్లికి వెళ్లాలంటే సంప్రదాయ దుస్తులు ముఖ్యంగా లెహంగా ధరించాల్సిందే అని పెద్దవాళ్లు పట్టు బడితే మీ స్టైల్‌కి ఒక అదనపు హంగును ఎలా చేర్చాలా అని పెద్దగా ప్రయాసపడనక్కర్లేదు. టాప్‌గా ధరించే ట్రెడిషనల్ కుర్తీ, ట్యునిక్ వంటి వాటికి ఇలా స్లిట్స్ ఇస్తే చాలు. మీ వార్డ్‌రోబ్‌లో ట్రెడిషనల్ స్లిట్ టాప్ ఒకటి చేర్చండి. అది బెనారస్ లేదా జరీ వర్క్‌తో ఉన్నది ఏదైనా ఎంచుకోండి. అయితే, టాప్–బాటమ్ ఎప్పుడూ కాంట్రాస్ట్ ఉండేలా జాగ్రత్తపడండి. దేశీయ పట్టుకువెస్ట్రన్ స్లిట్ బెనారస్, కంజీవరం వంటి పట్టు ఫ్యాబ్రిక్‌ను కూడా ఆధునికపు హంగులతో కొత్త లుక్ తీసుకురావచ్చు. లాంగ్ స్లిట్ కుర్తీకి బాటమ్ పార్ట్ జత చేయడంతో ట్రెడిషనల్ లుక్ వచ్చింది. ఓవరాల్‌గా చూస్తే పూర్తి వెస్ట్రన్ లాంగ్ గౌన్లా, దేశీయ పట్టు ఫ్యాబ్రిక్ అవడంతో సంప్రదాయపు సొబగులతో ఆకట్టుకుంటుంది. సమ్మర్‌కి సరికొత్త స్లిట్ వేసవి కాలం సౌకర్యంగా లేని దుస్తులు ధరిస్తే చికాకు మరీ ఎక్కువ అవుతుంది. గెట్ టు గెదర్ వంటి పార్టీలకు స్టైలిష్‌గా అదే టైమ్‌లో కంఫర్ట్ అనిపించే డ్రెస్‌లో వెళ్లాలంటే ఇలాంటి స్పెషల్ స్లిట్ డ్రెస్ ఎంచుకుంటే చాలు. బాటమ్‌గా జీన్స్.. టాప్‌గా స్లిట్ లాంగ్ కుర్తీ ధరించండి. వేదికల మీద వెలిగిపోయే స్లిట్ పెద్ద పెద్ద ఈవెంట్స్‌కి ఇలాంటి ఇండో వెస్ట్రన్ డ్రెస్‌లు బాగా నప్పుతాయి. స్కర్ట్ మోడల్ని తలపించే ఫ్రిల్స్ బాటమ్ టాప్‌కి జత చేశారు. లాంగ్ స్లీవ్స్ ట్యూనిక్‌కి ముందు భాగంలో స్లిట్ ఇవ్వడంతో కుచ్చుల భాగం ఆకర్షణీయంగా కనిపిస్తుంది. పూర్తి డ్రెస్ ఆధునికపు హంగులతో ఆకట్టుకుంటుంది. సౌకర్యవంతమైన స్లిట్ క్యాజువల్ లుక్‌తో సౌకర్యంగా అనిపించే ఇలాంటి డ్రెస్సులు వేసవికి ప్రత్యేకతను తీసుకువస్తాయి. టు పీస్ ఫ్రాక్ను ఎంచుకోవాలి. టాప్ పీస్‌కి కుచ్చులున్న ముందు భాగంలో స్లిట్ ఇవ్వాలి. రెండు ఫ్లోరల్ ప్రింట్స్ అయినా కాంట్రాస్ట్ కాంబినేషన్స్ అవడంతో లుక్ స్టైలిష్‌గా మారిపోతుంది. ఇలా మీరూ ప్రయత్నించవచ్చు. అది సంప్రదాయ దుస్తులైనా, వెస్ట్రన్ డ్రెస్ ఏదైనా స్లిట్ ఉంటే స్టైలిష్‌గా వెలిగిపోవచ్చు.-నిర్వహణ: ఎన్.ఆర్. -
చైనా గోడకు బీటలు
-
కోటకు బీటలు
శిథిలావస్థల్లో కట్టడం వందల ఏళ్లనాటి కట్టడంపై నిర్లక్ష్యం పట్టించుకోని అధికారులు కట్టడాలు కాపాడాలని స్థానికుల విన్నపాలు పెద్దశంకరంపేట: వందల ఏళ్ల నాటి చరిత్రకు నిదర్శనంగా నిలిచిన అపురూప చారిత్రక కట్టడాలు బీటలు వారుతున్నాయి. తరతరాల చరిత్రకు సాక్షాలుగా మిగిలే కట్టడాలను కాపాడి రేపటి తరాలకు చూపాల్సిందిపోయి అధికారుల, పాలకుల, పురావస్తు శాఖ అధికారుల నిర్లక్ష్యంతో చారిత్రక కట్టడంపై మొక్కలు పెరిగి కూలడానికి సిద్ధమయ్యాయి. పెద్దశంకరంపేట గ్రామంలో ఉన్న 40 అడుగుల ఎత్తుగల కోటను 1764లో రాణి శంకరమ్మ కట్టించినట్లు ఆధారాలున్నాయి. నిజాం పరిపాలనలో అతిపెద్ద సంస్థానాలుగా ఉన్న పెద్దశంకరంపేట, పాపన్నపేటలను రాజధానిగా చేసుకొని శంకరమ్మ వారి వారసులు 12 తరాల పాటు ఈ కోటనుంచే పాలించినట్లు గత చరిత్ర తెలుపుతోంది. అప్పటి కళావైభవానికి ప్రతీకగా నిలిచే ఈ కోటను చతురస్రాకారంలో, నాలుగు బురుజులతో నిర్మించారు. దీనిలో గుర్రపు శాలలు, ఎనుగు శాలలు ఉన్నాయి. వీటితో పాటు కోటలో ఉన్న సొరంగం ఒకటి గురుపాదగుట్టకు, గ్రామ శివారుకు దారితీస్తోందని పూర్వీకులు చెబుతుంటారు. రాణి శంకరమ్మ పేరు మీదుగా పేటకు శంకరంపేట అనే పేరొచ్చింది. ఇప్పటికీ చుట్టుపక్కల గ్రామాలతో పాటు పేటకు వచ్చిన ప్రతీ కొత్త వారు ఈ కోటను సందర్శిస్తుంటారు. ఇంత ఘన చరిత్ర కలిగిన ఈ కోటపై రావిచెట్లు, మర్రిచెట్లు మొలవడంతో ఈ కోట బీటలు వారుతోంది. దీంతో కూలేందుకు సిధ్దంగా ఉంది. ఇప్పటికి ఎంతో విలువైన సంపద కోట, సొరంగంలో నిక్షిప్తమై ఉందని స్థానికులు చెబుతుంటారు. అలాంటి ఈ కోటను పురావస్తు శాఖ అధికారులు ఏమాత్రం పట్టించుకోక పోవడం పేట ప్రజలను మనోవేదనకు గురిచేస్తోంది. ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి చారిత్రక కట్టడాలను సంరక్షించాలని వారు కోరుతున్నారు.