breaking news
seva awards
-
అభినందన్ వర్ధమాన్‌కు వీరచక్ర
న్యూఢిల్లీ: పాకిస్తాన్‌కు చెందిన శత్రు విమానాన్ని కూల్చేసిన అనంతరం మూడు రోజులపాటు పాక్‌లో బందీగా ఉన్న భారత వాయుసేన (ఐఏఎఫ్) వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్‌కు వీరచక్ర శౌర్య పురస్కారం లభించింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సైనిక పురస్కారాలను రక్షణ శాఖ ప్రకటించింది. ఆర్మీలో రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన సప్పర్ ప్రకాశ్ జాధవ్‌కు ఆయన మరణానంతరం రెండో అత్యున్నత శౌర్య పురస్కారమైన కీర్తి చక్రను కేంద్రం ఇచ్చింది. ఫిబ్రవరి 27న పాకిస్తాన్‌తో భారత్ ఆకాశంలో తలపడినప్పుడు స్క్వాడ్రన్ లీడర్‌గా ఉండి విమానాలను నియంత్రించిన మింటీ అగర్వాల్‌కు యుద్ధ సేవా పతకం దక్కనుంది. వాయుసేనకు 5 యుద్ధ సేవ, 7 వాయుసేన పతకాలు సహా మొత్తం 13 పురస్కారాలు దక్కనున్నాయి. ఫిబ్రవరి 26న పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసిన ఐదుగురు యుద్ధ పైలట్లకు పురస్కారాలు లభించాయి. ఆర్మీకి 8 శౌర్య చక్ర పురస్కారాలు, 98 సేనా పతకాలు దక్కాయి. నౌకాదళానికి ఒక శౌర్య చక్ర పురస్కారం లభించింది. పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో ఉన్న జైషే మహ్మద్ ఉగ్రసంస్థ శిక్షణా శిబిరంపై ఫిబ్రవరి 26న భారత వాయుసేన దాడులు చేయడంతో మరుసటి రోజే పాక్ ప్రతిదాడికి ప్రయత్నించడం తెలిసిందే. ఆ సమయంలో పాక్‌కు చెందిన ఎఫ్–16 విమానాన్ని వర్ధమాన్ కూల్చేశారు. తాను నడుపుతున్న మిగ్–21 విమానం దాడికి గురవ్వడంతో ఆయన కిందకు దూకేసి ప్రాణాలతో బయటపడినప్పటికీ పాకిస్తాన్లో దిగారు. దీంతో ఆయనను పాకిస్తాన్ మూడురోజులపాటు బందీగా ఉంచుకున్న అనంతరం భారత్‌కు అప్పగించింది. ముంబైలో జాతీయ జెండాతో సినీ నటి నిత్యా మీనన్ -
ఉత్తమ సేవలతోనే గుర్తింపు
- సీమ ఐజీ శ్రీధర్‌రావు కర్నూలు : శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన వారికి పోలీసు శాఖలో మంచి గుర్తింపు ఉంటుందని రాయలసీమ ఐజీ శ్రీధర్‌రావు అన్నారు. తెలుగు సంవత్సరాది ఉగాది 2017 పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం జిల్లా పోలీసు శాఖలోని డీఎస్పీలు, పోలీసు సిబ్బందికి పలు సేవా పతకాలను జారీ చేసింది. మంగళవారం ఉదయం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో ఉత్తమ సేవ, సేవా పతకాలు సాధించిన డీఎస్పీలు, పోలీసు సిబ్బందిని ఐజీ శ్రీధర్‌రావు, డీఐజీ రమణకుమార్, ఎస్పీ ఆకే రవికృష్ణ నేతృత్వంలో అభినందన సభ నిర్వహించి సత్కరించారు. ఈ సందర్భంగా ఐజీ మాట్లాడుతూ పోలీసుల పనితీరును గుర్తించడానికి డీజీపీ సాంబశివరావు ఆదేశాల మేరకు ఏ,బీ,సీ,డీ అవార్డులు అందజేస్తున్నారన్నారు. మంచి పనులు చేసేవారిని గుర్తించాలని సూచించారు. డీఐజీ రమణకుమార్ మాట్లాడుతూ సేవా పతకాలు సాధించిన వారిని స్ఫూర్తిగా తీసుకుని జిల్లా పోలీసులందరూ బాగా పనిచేసి రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలవాలని సూచించారు. విధి నిర్వహణ, కేసుల పరిశీలనలో టెక్నాలజీని ఉపయోగించాలన్నారు. సన్మాన గ్రహీతలు... డీఎస్పీలు... రాజశేఖర్‌రాజు (డీటీసీ) ఇండియన్ పోలీస్ పతకం, బాబు ప్రసాద్ (స్పెషల్ బ్రాంచ్) ఉత్తమ సేవా పతకం, కె.ఎస్.వినోద్‌కుమార్ (ఆత్మకూరు ఇన్చార్జి) సేవా పతకం. సీఐలు... పార్థసారధి రెడ్డి (పాణ్యం) సేవా పతకం, ఆర్.శివారెడ్డి (ఫింగర్ ప్రింట్స్ బ్యూరో) సేవా పతకం. ఏఎస్ఐలు... ఎల్.రఘురామయ్య (స్పెషల్ బ్రాంచ్) సేవా పతకం, రంగయ్య (స్పెషల్ బ్రాంచ్) సేవా పతకం. హెడ్ కానిస్టేబుళ్లు.. డి.మౌలాలి (స్పెషల్ బ్రాంచ్–2) ఉత్తమ సేవా పతకం, రఘురామయ్య గౌడు (సీసీఎస్) ఉత్తమ సేవా పతకం, ఉస్మాన్ బాషా(ఓఎస్డీ ఆఫీస్) సేవా పతకం, వెంకటాచలపతి (ఫింగర్ ప్రింట్స్ బ్యూరో) సేవా పతకం, వసూరప్ప (డీసీఆర్బీ) సేవా పతకం. కానిస్టేబుళ్లు... పి.వెంకటేశ్వర్లు (స్పెషల్ బ్రాంచ్–2) సేవా పతకం, రామాంజనయ్య (డోన్ పీఎస్) సేవా పతకం, ఫయాజుద్దీన్ (కర్నూలు తాలూకా పీఎస్) సేవా పతకం, బి.వి.రామరాజు (డీటీసీ) సేవా పతకం.