breaking news
	
		
	
  Selfie-Focused Smartphone
- 
      
                   
                               
                   
            సెల్ఫీ ఫోకస్డ్ జియోనీ ఫోన్ వచ్చేసింది

 చైనీస్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ జియోనీ, సెల్ఫీ ఫోకస్డ్ ఎస్6 ఎస్ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లోకి ఆవిష్కరించింది. రూ.17,999కు ఈ ఫోన్‌ను విడుదల చేసింది. ఫ్రంట్ ఫేసింగ్ ఫ్లాష్ మోడ్యుల్తో ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. ఎక్స్‌క్లూజివ్‌గా అమెజాన్లోనే ఈ ఫోన్‌ను ప్రస్తుతం అందుబాటులో ఉండనుంది. అనంతరం అన్నీ ఫిజికల్ రిటైల్ సోర్లకు, ఇతర ఆన్లైన్ రీటైల్ పార్టనర్లకు అందుబాటులోకి రానుంది.
 
 జియోనీ ఎస్ఎస్ ఫీచర్లు..
 5.50 అంగుళాల డిస్ ప్లే
 1.3 గిగా హెడ్జ్ ప్రాసెసర్
 1080x1920 పిక్సెల్స్ రెజుల్యూషన్
 ఆండ్రాయిడ్ 6.0 ఓఎస్
 3 జీబీ ర్యామ్
 32 జీబీ స్టోరేజ్
 13 ఎంపీ రియర్ కెమెరా
 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా
 3150 ఎంఏహెచ్ బ్యాటరీ - 
      
                    
సెల్ఫీ-ఫోకస్డ్ కూల్‌ప్యాడ్ వచ్చేసింది!

 కూల్‌ప్యాడ్ మెగా 2.5డీ సెల్ఫీ-ఫోకస్డ్ స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్లోకి వచ్చేసింది. రూ.6,999లకు ఈ ఫోన్‌ను ఆవిష్కరిస్తున్నట్టు ఈ చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారి తెలిపింది. వివిధ బడ్జెట్ స్మార్ట్ఫోన్లను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టిన కూల్‌ప్యాడ్ బుధవారం సెల్ఫీ-ఫోకస్డ్ డివైజ్‌తో వినియోగదారుల ముందుకు వచ్చింది. ఈ ఫోన్ మొదటి ఫ్లాష్ అమ్మకాలు ప్రత్యేకంగా అమెజాన్ ప్లాట్‌ఫామ్‌పై ఆగస్టు 24వ తేదీన మధ్యాహ్నం రెండు గంటల నుంచి ప్రారంభం కానున్నాయి. నేటి సాయంత్రం నుంచి ఈ ఫోన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభించినున్నట్టు కంపెనీ ప్రకటించింది. మేక్ ఇన్ ఇండియా కింద ఈ ఫోన్‌ను ఆవిష్కరించినట్టు కూల్‌ప్యాడ్ తెలిపింది. నేడు లాంచ్ చేసిన కూల్‌ప్యాడ్ మెగా 2.5డీ, గత నెల చైనాలో ఆవిష్కరించిన కూల్‌ప్యాడ్ స్కై 3 దాదాపు ఒకే మాదిరిగా ఉన్నాయి. చిన్న చిన్న మార్పులతో ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది.
 
 కూల్‌ప్యాడ్ మెగా 2.5డీ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు...
 5.5 అంగుళాల హెచ్డీ(720x1280 పిక్సెల్స్) ఐపీఎస్ డిస్ప్లే
 ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో
 4జీ ఎల్టీఈ, వాయిస్ ఓవర్ ఎల్టీఈ
 3 జీబీ ర్యామ్
 16 జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజ్
 32 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమరీ
 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాలు
 డ్యుయల్ సిమ్
 2500 ఎంఏహెచ్ బ్యాటరీ
 140 గ్రాములు, 7.85ఎంఎం థిక్ 


