Sakinala Narayana
-
కోర్టు ఆవరణలో కత్తితో పొడుచుకుని..
హోంగార్డుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆత్మహత్యాయత్నం బెల్లంపల్లి: ఏడేళ్ల నుంచి తనకు, హోంగార్డులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపిస్తూ హోంగార్డుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సకినాల నారాయణ మంగళవారం కోర్టు ఆవరణలో కత్తితో పొడుచుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఓ కేసు విషయంలో నారాయణ మంగళవారం బెల్లంపల్లి జూనియర్ సివిల్ కోర్టుకు హాజరయ్యారు. న్యాయమూర్తి బదిలీ కావడంతో కోర్టు క్లర్క్ మరో తేదీ ఇచ్చి కోర్టుకు హాజరు కావాలని సూచించారు. కోర్టు హాలులో నుంచి బయటకు వస్తూనే నారాయణ వెంట తెచ్చుకున్న కత్తితో తొలుత చేతిపై కోసుకున్నాడు. ప్రధాన ద్వారం వద్దకు వచ్చి కడుపులో పొడుచుకోవడంతో తీవ్ర రక్తస్రావం జరిగింది. ఇది చూస్తున్నవారు బలవంతంగా ఆ కత్తిని లాక్కున్నారు. అంతలోనే నారాయణ కోర్టు ఆవరణలో నుంచి బయట రోడ్డు పైకి వచ్చి కూలబడ్డారు. సమాచారం అందుకున్న టూటౌన్ ఎస్‌హెచ్‌వో కె.స్వామి, వన్‌టౌన్ ఎస్సై గంగరాజగౌడ్ వచ్చి తమ వాహనంలో నారాయణను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ విషయమై నారాయణ మాట్లాడుతూ తనకు హోంగార్డు ఉద్యోగం లేకుండా చేశారని, హోంగార్డుల సమస్య లను కూడా పరిష్కరించకుండా అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. అందుకే మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేశానన్నారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన నారాయణపై కేసు నమోదు చేసినట్లు టూటౌన్ ఎస్‌హెచ్‌వో కె.స్వామి తెలిపారు. -
దీక్ష భగ్నం.. హోంగార్డు ఆత్మహత్యాయత్నం
-
దీక్ష భగ్నం.. హోంగార్డు ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్: అంబర్‌పేటలో హోంగార్డుల దీక్షను అర్థరాత్రి పోలీసులు భగ్నం చేశారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ హోంగార్డుల అసోసియేషన్ తెలంగాణ చైర్మన్ సకినాల నారాయణ ఆధ్వర్యంలో రెండు రోజులుగా హోంగార్డులు అమరణ నిరాహారదీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు దీక్షను భగ్నం చేయడంతో మనస్తాపం చెందిన హోంగార్డు రమేష్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. దీక్షను పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట చోటుచేసుకుంది. పోలీసులకు, హోంగార్డులకు మధ్య జరిగిన తోపులాటలో పలువురికి గాయాలు కాగా, వారిని ఆస్పత్రికి తరలించారు. రమేష్ పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అరెస్టైన హోంగార్డులు, ఓయూ, అంబర్‌పేట పోలీస్ స్టేషన్లకు తరలించినట్టు సమాచారం. -
తిలక్‌నగర్‌లో హోంగార్డుల ఆందోళన
-
తిలక్‌నగర్‌లో హోంగార్డుల ఆందోళన
హైదరాబాద్: నగరంలోని తిలక్‌నగర్‌లో హోంగార్డులు ఆందోళనకు దిగారు. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి పర్మినెంట్ చేయాలని ఆదివారం ఉదయం ధర్నాకు దిగారు. స్థానిక హోంగార్డుల కార్యాలయంలో ఆ సంఘం చైర్మన్ సకినాల నారాయణ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని చేపట్టిన ఈ ఆందోళనలో సుమారు 200 మంది హోంగార్డులు పాల్గొన్నారు.