breaking news
Rs 110 crore
-
రోబోరా.. రోబో!
110 కోట్లు... సినిమా రిలీజైన తర్వాత వచ్చే వసూళ్లు కాదు. సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న ‘2.0’ సినిమా శాటిలైట్ హక్కుల రేటు 110 కోట్లు. రజనీ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘రోబో’ సూపర్ హిట్టయింది. ‘రోబో’కి సీక్వెల్‌గా వస్తున్న ‘2.0’ సినిమాపై భారీ అంచనాలున్నాయి. దాంతో ఈ సినిమా శాటిలైట్ హక్కులకు విపరీతమైన పోటీ నెలకొంది. చివరకు ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్ ‘జీ టీవీ’ తెలుగు, తమిళ, హిందీ భాషల శాటిలైట్ హక్కులను 110 కోట్లకు సొంతం చేసుకుంది. సౌత్‌లో ఈ రేంజ్లో అమ్ముడైన ఫస్ట్ సినిమా ఇదే. ‘కబాలి’లో రజనీ ‘నిప్పురా..’ అంటారు. అలా ‘రోబోరా.. రోబో’ అనాలేమో. ఓ పాట, కొంత ప్యాచ్ వర్క్ మినహా షూటింగ్ పూర్తయిన ఈ సినిమాలో అమీ జాక్సన్ హీరోయిన్. హిందీ హీరో అక్షయ్‌కుమార్ విలన్‌గా నటిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిస్తోన్న ఈ చిత్రాన్ని దీపావళికి విడుదల చేయాలని లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్ణయించింది. -
రూ.110 కోట్ల మత్తుపదార్థాలు స్వాధీనం
అమృతసర్: భారత కస్టమ్స్ అధికారులు, బీఎస్ఎఫ్ ఉమ్మడిగా ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి రూ.110 కోట్ల విలువైన హెరాయిన్ పట్టుకున్నారు. పాకిస్థాన్ నుంచి కొందరు వ్యక్తులు దీనిని సరిహద్దు గుండా భారత్‌కు తరలించే ప్రయత్నం చేసినట్లు గుర్తించారు. పోలీసుల సమాచారం ప్రకారం పాక్‌తో ఉన్న అంతర్జాతీయ సరిహద్దు వెంబడి గత రాత్రి కొన్ని అనుమానిత కదలికలు కనిపించాయి. దీంతో తెల్లవారగానే గాలింపు చర్యలు చేపట్టిన సరిహద్దు రక్షణ దళానికి మొత్తం 22 కేజీల హెరాయిన్ కంటబడింది. దీనిని స్వాధీనం చేసుకొని కస్టమ్స్ అధికారులకు అప్పగించారు. దీనికి సంబంధించి ఎలాంటి అరెస్టు ఇంకా చోటు చేసుకోలేదు.