breaking news
rpo
-
మూడో వంతు పునరుత్పాదక విద్యుత్తే!
సాక్షి, హైదరాబాద్: తప్పనిసరిగా పునరుత్పాదక విద్యుత్ కొనుగోళ్లు (రెన్యూవబుల్ పవర్ పర్చేజ్ ఆబ్లిగేషన్/ఆర్పీఓ) విషయంలో రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం భారీ లక్ష్యాలను విధించింది. కేంద్రం ప్రకటించిన లక్ష్యాల ప్రకారం 2022–23లో రాష్ట్రా ల విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు కొనుగోలు చేసే మొత్తం విద్యుత్‌లో ఏకంగా 24.61 శాతం తప్పనిసరిగా పునరుత్పాదక విద్యుత్ ఉండాల్సిందే. ఏటా క్రమంగా కొనుగోళ్ల శాతాన్ని పెంచుకుంటూ 2029–30 నాటికి 43.33 శాతానికి చేరాల్సి ఉంటుంది. 2022–23 నుంచి 2029–30 మధ్య తప్పనిసరిగా కొనుగోలు చేయాల్సిన పునరుత్పాదక విద్యుత్ లక్ష్యాలను తాజాగా కేంద్ర విద్యుత్ శాఖ ప్రకటించింది. ఏటా ఎంత శాతం మేరకు పవన, జల, ఇత ర పునరుత్పాదక విద్యుత్ కొనుగోళ్లు చేయాలో ఇందులో పొందుపర్చింది. ‘ఇతర పునరుత్పాదక వి ద్యుత్’ కేటగిరీలో సౌర విద్యుత్‌తోపాటు చిన్న, మధ్యతరహా జలవిద్యుత్ ప్రాజెక్టులు రానున్నాయి. విద్యుత్ కోసం బొగ్గు ఆధారిత థర్మల్ విద్యుత్ ప్లాంట్లపై అధిక శాతం ఆధారపడుతుండటంతో ప్రపంచవ్యాప్తంగా కాలుష్యం పెరిగిపోతోంది. దీంతో థర్మల్ విద్యుత్ ప్లాంట్ల వాడకాన్ని తగ్గించి ప్రత్యామ్నాయంగా కాలుష్యరహిత సౌర, పవన, జలవిద్యుత్ వంటి పునరుత్పాదక విద్యుత్ వినియోగాన్ని పెంచాలని ‘ప్యారిస్ ఒప్పందం’పేరుతో ప్రపంచ దేశాలు తీర్మానించాయి. ఈ క్రమంలోనే కేంద్రం రాష్ట్రాలకు భారీ ఆర్పీఓ లక్ష్యాలను నిర్దేశించింది. రాష్ట్రాల అభ్యంతరాలను కాదని..: నిర్దేశిత వార్షిక లక్ష్యాల మేరకు తప్పనిసరిగా పునరుత్పాదక విద్యుత్ కొనుగోళ్లు జరపాలని లేకుంటే కొనుగోళ్ల లో ఎంత లోటుంటే ఆ మేరకు జరిమానాలు చెల్లించాలనే నిబంధనను కేంద్రం అమలుచేస్తోంది. ఇప్పటికే ఉన్న ఆర్పీఓ లక్ష్యాలపై తెలంగాణ సహా పలు రాష్ట్రాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండగా తాజా గా కేంద్రం లక్ష్యాలను మరిన్ని పెంచింది. ఆర్పీఓ లక్ష్యాలకు తగ్గట్లు సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకోవడానికి తెలంగాణలో సరిపడ స్థలాల్లేవని, లక్ష్యా లు పూర్తి చేయనందుకు జరిమానాలు విధిస్తే డిస్కంలు భారీగా నష్టపోవాల్సి వస్తుందని రాష్ట్రం ఇప్పటికే కేంద్రానికి అభ్యంతరం తెలియజేసింది. శ్రీశైలం, సాగర్ కరెంట్ లెక్కలోకి రాదు.. పాత జలవిద్యుత్ ప్రాజెక్టుల విద్యుత్‌ను తప్పనిసరిగా కొనుగోలు చేయాల్సిన పునరుత్పాదక విద్యుత్‌గా పరిగణించబోమని కేంద్రం కొత్త నిబంధనను తీసుకొచ్చింది. 25 మెగావాట్లు, ఆపై ఉత్పత్తి సామర్థ్యంగల, 2019 మార్చి 8 తర్వాత నిర్మితమైన భారీ జలవిద్యుత్ కేంద్రాలు, పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టుల విద్యుత్‌నే ఆర్పీఓ లక్ష్యాలుగా లెక్కిస్తామని పేర్కొంది. దీంతో ఏపీ, తెలంగాణ పరిధిలోని జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల వంటి జలవిద్యుత్ కేంద్రాల నుంచి ఏటా భారీగా విద్యుత్‌ను కొనుగోలు చేస్తున్న తెలుగు రాష్ట్రాల డిస్కంలకు ఈ నిబంధన తీవ్ర నష్టాన్ని కలిగించనుంది. మరోవైపు 2022 మార్చి 31 తర్వాత పూర్తైన పవన విద్యుత్ ప్రాజెక్టుల నుంచి కొన్న విద్యుత్‌నే ఆర్పీఓ లక్ష్యం కింద లెక్కిస్తామని కేంద్రం స్పష్టం చేసింది. 100 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టుతో గతంలో ఒప్పందం చేసుకున్న తెలంగాణ డిస్కంలకు ఈ నిబంధనతో తీవ్ర నష్టమే జరగనుంది. ఇక విద్యుత్ నిల్వలు తప్పనిసరి: విద్యుత్ నిల్వలను కేంద్రం తప్పనిసరి చేసింది. రాష్ట్రానికి సరఫరా చేసే మొత్తం విద్యుత్‌లో 2022–23లో కనీసం ఒక శాతం నిల్వ చేసిన పవన, సౌర విద్యుత్‌లు ఉండాల్సిందే. 2029–30 నాటికి నిల్వ చేసిన సౌర, పవన విద్యుత్ వాడకం 4 శాతానికి పెరగాలి. బ్యాటరీలు లేదా పంప్డ్ స్టోరేజీ పద్ధతిలో నిల్వ చేసే విద్యుత్‌నే ఈ కేటగిరీ కింద లెక్కిస్తామని కేంద్రం తెలిపింది. -
ఆర్పీవో అశ్వినికి హైకోర్టు జరిమానా
కోర్టు ఆదేశాల అమలులో అలసత్వంపై మండిపాటు సాక్షి, హైదరాబాద్: కోర్టు ఆదేశాలను అమలు చేయడంలో అలసత్వం ప్రదర్శించి నందుకు హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ (ఆర్పీవో) అధికారి అశ్విని సత్తారుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ నిందితురాలి పాస్‌పోర్ట్ స్వాధీనం చేసుకో కుండా.. ఆమె దేశం విడిచి వెళ్లేందుకు కారణమైనందుకు రూ.15 వేల జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని పిటిషనర్‌కు చెల్లించాలని ఆమెను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సురేశ్ కెయిత్ ఇటీవల తీర్పు వెలువరించారు. ఓ క్రిమినల్ కేసులో నిందితులుగా ఉన్న ఇద్దరు వ్యక్తుల పాస్‌పోర్టులను స్వాధీనం చేసుకోవాలని కోరుతూ హైదరాబాద్‌కు చెందిన పి.వెంకటరెడ్డి.. ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారికి వినతిపత్రం సమర్పించారు. అయితే పాస్‌పోర్ట్ అధికారులు తన వినతిపత్రాన్ని పట్టించుకోకపోవడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన హైకోర్టు వెంకటరెడ్డి వినతిపత్రంపై రెండు వారాల్లో తగిన నిర్ణయం తీసుకోవాలని ఈ ఏడాది ఆగస్టులో ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారిని ఆదేశించింది. కాని ఈ ఆదేశాలను అమలు చేయకపోవడంతో వెంకటరెడ్డి.. కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ సురేశ్ కెరుుత్.. ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి అశ్విని వ్యక్తిగత హాజరుకు ఆదేశాలు జారీ చేశారు. కోర్టు ఎదుట హాజరైన ఆమె.. కోర్టు ఉత్తర్వుల అమలులో అలసత్వానికి కారణాలను వివరిస్తూ అఫిడవిట్ దాఖలు చేశారు. దానిపై అసంతృప్తి వ్యక్తం చేసిన న్యాయమూర్తి, కోర్టు ఇచ్చిన ఆదేశాలను అందజేయడానికి పిటిషనర్ పదే పదే తిరిగినా పట్టించుకోకపోవడాన్ని తప్పుపట్టారు.