breaking news
Royal Challengers Bangalore - Hyderabad
-
ఆర్సీబీతో తలపడనున్న ఎస్ఆర్హెచ్.. టాస్ గెలిస్తే..!
SRH vs RCB Match Prediction: ఐపీఎల్-2022లో వాంఖడే వేదికగా ఆదివారం(మే8) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. ఈ మ్యాచ్ మధ్యహ్నం 3:30 గంటలకు ప్రారంభం కానుంది. ఇక వరుసగా మూడు ఓటుములతో డీలా పడ్డ ఎస్ఆర్హెచ్.. ఆర్సీబీపై విజయం సాధించి తిరిగి తమ విన్నింగ్ ట్రాక్‌ను పొందాలని భావిస్తోంది. ఇప్పటి వరకు 10 మ్యాచ్‌లు ఆడిన సన్‌రైజర్స్.. 5 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. ఇక బ్యాటింగ్ పరంగా ఎస్ఆర్హెచ్ అద్భుతంగా రాణిస్తోంది. బౌలర్లు మాత్రం భారీగా పరుగులు సమర్పించుకుంటున్నారు. గత మూడు మ్యాచ్‌ల్లో కూడా ఎస్ఆర్హెచ్ బౌలర్లు ఘోరంగా విఫలమయ్యారు. ఇక అఖరి మ్యాచ్‌కు దూరమైన నటరాజన్ తిరిగి జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఇక వరుస అపజయాలతో సతమతమైన ఆర్సీబీ గత మ్యాచ్‌లో సీఎస్కేపై విజయం సాధించి తిరిగి గాడిలో పడింది. బౌలింగ్, బ్యాటింగ్ పరంగా ఆర్సీబీ రాణిస్తోంది. ఈ మ్యాచ్‌లో ఎటువంటి మార్పులు లేకుండా ఆర్సీబీ బరిలోకే దిగే అవకాశం ఉంది. ఈ సీజన్లో ఇప్పటి వరకు 11 మ్యాచ్‌లు ఆడిన బెంగళూరు.. 6 మ్యాచ్‌ల్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. ఇక ఇరు జట్లు ముఖాముఖి 21 సార్లు తలపడగా.. ఎస్ఆర్హెచ్ 12 మ్యాచ్‌లల్లో విజయం సాధించగా.. ఆర్సీబీ 8 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. మరో మ్యాచ్‌లో ఎటువంటి ఫలితం తేలలేదు. పిచ్ రిపోర్ట్ వాంఖడే స్టేడియం వేదికగా రాజస్తాన్, కోల్‌కతా మధ్య జరిగిన గత మ్యాచ్‌లో పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించింది. 153 పరుగుల లక్ష్యాన్ని కేకేఆర్ సునాయాసంగా ఛేదించింది. టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా ఫీల్డింగ్ చేసే అవకాశం ఉంది. తుది జట్లు(అంచనా) సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిషేక్ శర్మ, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రామ్, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), శశాంక్ సింగ్, సీన్ అబాట్, శ్రేయాస్ గోపాల్, భువనేశ్వర్ కుమార్, టి. నటరాజన్ ఉమ్రాన్ మాలిక్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, రజత్ పాటిదార్, గ్లెన్ మాక్స్వెల్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), మహిపాల్ లోమ్రోర్, వనిందు హసరంగా, హర్షల్ పటేల్ చదవండి: IPL 2022: స్టేడియంలో సందడి చేసిన రణవీర్ సింగ్.. సెలబ్రేషన్స్ మామూలుగా లేవుగా -
ఐపీఎల్ ఉత్కంఠ
నేడు తలపడనున్న బెంగళూరు, హైదరాబాద్ జట్లు ‘చెన్నై’ పేలుళ్ల నేపథ్యంలో ‘చిన్నస్వామి’కి భారీ భద్రత రంగంలోకి సాయుధ బలగాలు, సీసీ కెమెరాల ఏర్పాటు బెంగళూరు, న్యూస్‌లైన్ : నగరంలో ఐపీఎల్ సందడి నెలకొంది. చిన్నస్వామి స్టేడియంలో బెంగళూరు రాయల్ చాలెంజర్స్- సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు ఆదివారం తలపడనున్నాయి. గతంలో చిన్నస్వామి స్టేడియం దగ్గర బాంబు పేలుళ్లు, ప్రస్తుతం చెన్నై రైల్వే స్టేషన్లో పేలుళ్ల నేపథ్యంలో పోలీసు అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు వెయ్యి మంది సిటీ పోలీసులకు రంగంలోకి దింపారు. శనివారం నుంచే భారీ స్థాయిలో పోలీసులను మొహరించారు. డీసీపీలు, ఏసీపీలు, డీఎస్పీలు, ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, ఏఎస్ఐలు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఎలాంటి అంవాఛనీ య సంఘటనలు చోటుచేసుకోకుండా జాగ్రతలు తీసుకున్నారు. స్టేడియం పరిసర ప్రాంతాల్లో 12 వాచ్ టవర్లను (పోలీసులు బైనాక్యూలర్లతో పరిశీలించేందుకు ఎతైన టవర్లు) ఏర్పాటు చేశారు. మ్యాచ్‌కు వచ్చే వారిని క్షుణ్ణంగా పరిశీలించడానికి 87 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. మహాత్మగాంధీ సర్కిల్ నుంచి చిన్నస్వామి స్టేడియం వరకు మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. మ్యాచ్ చూడటానికి వచ్చే ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా పరిశీలించి స్టేడియం లోపలికి పంపించేలా చర్యలు తీసుకున్నారు. సాయుధ బలగాలతో పాటు కేఎస్ఆర్పీ బలగాలనూ రంగంలోకి దింపారు. స్టేడియం చుట్టుపక్కల ప్రాంతా ల్లో పార్కింగ్ నిషేధించారు. మ్యాచ్ చూసి ఇంటికి వెళ్లే వారికి కోసం బీఎంటీ సీ అధికారులు జీ-1 నుంచి జీ-12 వరకు ప్రత్యేక సర్వీలు ఏర్పాటు చేశారు.