breaking news
ropes
-
వీళ్లకు వీర‘తాళ్లు’ వేయాల్సిందే
భారీ ఓడలు సముద్రంలో లంగరు వేయాలన్నా.. ఆలయ వీధుల్లో రథాలు పరుగులు తీయాలన్నా.. ఆ ఊళ్లో తయారయ్యే భారీ తాళ్లు, పగ్గాలను వాడాల్సిందే. తాళ్ల తయారీలో యంత్రాలు రంగప్రవేశం చేసినా.. ఆ ఊరి కార్మికుల పనితనం ముందు దిగదుడుపే. నౌకల్లో ఉపయోగించే భారీ మోకులు.. తాళ్లు.. పగ్గాల తయారీకి వందల ఏళ్ల నుంచీ తాళ్లరేవు గ్రామం ప్రసిద్ధి చెందింది. సాక్షి ప్రతినిధి, కాకినాడ: కాకినాడ–అమలాపురం మధ్య జాతీయ రహదారిపై వెళ్లే ప్రతి ఒక్కరి చూపు తాళ్లరేవు రాగానే టక్కున ఆగిపోతుంది. తాళ్లే కదా.. ఎక్కడైనా తయారవుతాయనుకుంటే పొరబడ్డట్టే. ఇక్కడ తయారయ్యే తాళ్లకు పెద్ద చరిత్రే ఉంది. పెద్ద, పెద్ద కర్మాగారాల్లో తయారయ్యే తాళ్లు ఇక్కడ చేతితో తయారుచేసే తాళ్ల ముందు నిలవలేవంటే ఆశ్చర్యమేస్తుంది. అత్యధిక నాణ్యత.. 50 శాతం తక్కువ ధరల్లో ఇక్కడ తాళ్లు లభిస్తాయి. పాత తాళ్లు కొత్తగా అలంకరించుకోవాలన్నా.. తక్కువ ధరకే అవి దొరకాలన్నా తాళ్లరేపు పేరును తలవాల్సిందే. సెకండ్ హ్యాండ్ (పాత తాళ్ల)ను రీ ప్రాసెసింగ్ చేసి కొత్తవిగా తయారు చేయడంలో చేయి తిరిగిన నైపుణ్యం అక్కడి వారి సొంతం. 200 ఏళ్ల క్రితం సంభవించిన జల ప్రళయంతో.. ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపారం కోసం ఇక్కడకు వచ్చి స్థావరాలు ఏర్పాటు చేసుకోవడంతో ఇప్పుడున్న కోరంగి అభయారణ్య ప్రాంతం అప్పట్లో పట్టణంగా విరాజిల్లింది. అమెరికా, రష్యా, ఇరాన్, ఇరాక్ తదితర దేశాల నుంచి ఓడలు కోరంగి రేవు ద్వారానే ఎగుమతి, దిగుమతులు సాగించేవి. కోరంగి నుంచి కేంద్రపాలిత యానాం వరకు విస్తరించి ఉన్న సముద్ర తీరానికి ఓడలు, పెద్దపెద్ద బోట్లు రాకపోకలు సాగించేవి. 2 వేల నుంచి 20 వేల టన్నుల సామర్థ్యం గల ఓడలు సైతం ఇక్కడకు వచ్చేవి. సుమారు 200 ఏళ్ల క్రితం సంభవించిన జల ప్రళయంలో ఓడలు, ఓడరేవుతో సహా కొట్టుకుపోయాయి. అప్పట్లో వేటకు వెళ్లిన వందలాది మత్స్యకారులు మృత్యువాతపడ్డారు. ఇంటి యజమానులు మృత్యువాత పడటంతో జీవనోపాధి కోసం ఇక్కడి మహిళలు కొబ్బరి, తాటి నారతో తాళ్లు తయారుచేసి విక్రయించడం ప్రారంభించారు. అలా మొదలైన తాళ్ల తయారీ తాళ్లరేవులో కుటీర పరిశ్రమగా మారింది. ప్రస్తుతం మహిళలు, పురుషులు సైతం తాళ్లను తయారు చేస్తూ ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరుకుంది. తాళ్లరేవు ప్రాంతంలో కొబ్బరి, తాటి, నైలాన్, ప్లాస్టిక్ తాళ్లను తయారు చేస్తున్నారు. అర అంగుళం నుంచి అడుగున్నర మందంతో భారీ తాళ్లను సైతం ఇక్కడ తయారు చేస్తున్నారు. ఓడలకు, ఫైబర్ బోట్లకు వినియోగించే తాళ్లు కూడా ఇక్కడ తయారవుతున్నాయి. రథాలకు వినియోగించే పగ్గాలను సైతం ఇక్కడే తయారు చేస్తున్నారు. ఏటా 900 టన్నుల తాళ్ల ఎగుమతి ఏటా 900 టన్నుల వరకు తాళ్లు ఇక్కడ తయారవుతున్నాయి. తెలంగాణ, గుజరాత్, పశ్చిమ బెంగాల్ తదితర ప్రాంతాలకు ఇక్కడి తాళ్లను ఎగుమతి చేస్తున్నారు. ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపార లావాదేవీలు ప్రారంభించిన సందర్భంలో కోరంగిలో ఓడలు రాకపోకలకు వీలుగా ఓడ రేవును ఏర్పాటు చేయడమే తాళ్ల పరిశ్రమలు ఏర్పాటుకు దోహదం చేసింది. మేడిది.. పెమ్మాడి వంశీకులతో మొదలై.. తొలుత ఈస్ట్ ఇండియా వ్యాపారులతో పెనవేసుకున్న తాళ్ల బంధం కాస్తా వారసత్వ సంపదగా మారింది. తొలినాళ్లలో తాళ్లరేవుకు చెందిన మేడిది, పెమ్మాడి వంశీయులు తాళ్లు తయారుచేసే వారు. తాళ్ల తయారీ వంశపారంపర్యంగా మారి నాలుగు తరాలుగా నేటికీ కొనసాగుతుండటం విశేషం. ఇక్కడ తయారయ్యే తాళ్లను టన్నుల కొద్దీ చెన్నై, కేరళ, ముంబై, కోల్కతా, గుజరాత్ తదితర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. ఓడలు, బోట్లలో వినియోగించిన అనంతరం వృథాగా వదిలేసే పగ్గాలను తక్కువ ధరకు తాళ్లరేవు గ్రామస్తులు వేలంలో కొనుగోలు చేస్తుంటారు. రాష్ట్రంలోని పలు పోర్టులతోపాటు ఇతర రాష్ట్రాల్లోని పోర్టులలో వేలం వేసే పాత తాళ్లను కొనుగోలు చేస్తుంటారు. వాటిని గ్రేడింగ్ చేసి.. శుద్ధిచేసి కొత్త తాళ్లు తయారు చేసి విక్రయిస్తున్నారు. బ్రిటిష్ కాలం నుంచీ.. బ్రిటిష్ కాలం నుంచి తాళ్లరేవు, కోరంగిలలో తాళ్లు తయారు చేస్తున్నాం. నాలుగు తరాలుగా తాళ్ల తయారీలో నిపుణులు ఇక్కడ ఉన్నారు. కోరంగిలో ఓడరేవు ఉండడంతో ఓడలు భారీ స్థాయిలో ఇక్కడికి వచ్చేవి. ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రతినిధులు, బ్రిటిషర్లు కోరంగిని వ్యాపార కేంద్రంగా ఎంచుకోవడంతో భారీ నౌకలు, బోట్లు, నావలను తాళ్లరేవులో తయారు చేసేవారు. అలా ఓడలకు అవసరమైన తాళ్లు, మేకులు తదితర పరిశ్రమలు అప్పట్లో కోరంగి పరిసర ప్రాంతాల్లో ఏర్పాటయ్యాయి. ఇప్పటికీ తాళ్ల తయారీని కొనసాగుతోంది. – పెమ్మాడి కాశీ విశ్వనాథం, బోట్ల తయారీ యూనిట్ ప్రతినిధి ప్రత్యేక ప్రావీణ్యత ఉంది మా తాత ముత్తాతల నుంచి తాళ్లు తయారు చేస్తున్నాం. తాళ్ల తయారీయే వృత్తిగా కొనసాగుతోంది. రోజుకు రూ.300 నుంచి రూ.600 వరకు సంపాదిస్తాం. తాళ్ల తయారీకి సంబంధించి మాకు ప్రత్యేక ప్రావీణ్యత ఉంది. మా దగ్గర తాడు తీసుకెళ్లిన వారు మళ్లీమళ్లీ కొనుగోలు చేస్తుంటారు. – మందపల్లి జ్యోతిబాబు, తాళ్ల తయారీ కార్మికుడు -
‘ఈ నెల 14కి పది ఉరితాళ్లను సిద్ధం చేయండి'
పాట్నా: ఏడేళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత నిర్భయ అత్యాచార కేసుకు సంబంధించి దోషులకు ఉరిశిక్ష వేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో బిహార్లోని బక్సర్ జైలుకు ఉన్నతాధికారులనుంచి ఓ సందేశం వచ్చింది. డిసెంబరు 14 నాటికి 10 ఉరితాళ్లను సిద్ధం చేయాలన్నది ఆ సందేశంలోని సారాంశం. ఉరితాళ్లను రూపొందించడంలో బక్సర్ జైలుకు ఎంతో పేరుందన్న విషయం తెలిసిందే. గతంలో పార్లమెంటుపై దాడులు చేసిన అఫ్జల్ గురును ఉరితీసేందుకు ఉపయోగించిన తాడును కూడా ఈ జైల్లోనే తయారుచేశారు. తాజాగా.. మరోసారి ఉరితాళ్లు పంపించాలని బక్సర్ జైలుకు జైళ్ల శాఖ డైరెక్టరేట్ నుంచి వచ్చిన సందేశం ద్వారా ఆ ఉరితాళ్లు నిర్భయ నిందితుల కోసమేననని భావిస్తున్నారు. చదవండి: 'నిర్భయకేసు దోషులకు త్వరలో మరణశిక్ష' దీనిపై బక్సర్ జైలు సూపరింటెండెంట్ విజయ్ కుమార్ అరోరా మాట్లాడుతూ.. డిసెంబర్ 14లోగా 10 ఉరితాళ్లను సిద్దం చేయాలని మాకు ఆదేశాలొచ్చాయి. ఇవి ఎక్కడ ఉపయోగించబోతున్నారో మాకు తెలియదు. బక్సర్ జైలుకి ఉరితాళ్లను సిద్ధం చేయడంలో మంచి అనుభవం ఉంది. ఒక్క ఉరితాడును సిద్ధం చేయడానికి మూడు రోజులు పడుతుంది. ముఖ్యంగా వీటి తయారీకి యంత్రాలను తక్కువగా ఉపయోగించడం వల్ల శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. 2016-17లో కూడా పాటియాలా జైలు నుంచి మాకు ఉరితాళ్లు సిద్ధం చేయాలని ఆదేశాలు వచ్చాయి. చివరిసారిగా బక్సర్ జైలు నుంచి పంపించిన ఉరితాడు ధర రూ.1,725అని అరోరా తెలిపారు. ఇనుము, ఇత్తడి ధరలలో తేడాల కారణంగా వీటి ధర ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుందని అరోరా తెలిపారు. ఈ లోహాలను తాడు మెడను గట్టిగా చుట్టి ఉండేలా చూసుకోవడానికి ఉపయోగిస్తారని జైలు సూపరింటెండెంట్ వివరించారు. చదవండి: ఆ పిటిషన్ నేను పెట్టుకోలేదు: నిర్భయ కేసు దోషి -
'మన్ పసంద్' చాన్స్ కొట్టేసిన అమ్మడు
మన్ పసంద్ బీవరేజస్ బ్రాండ్ అంబాసిడర్ గా ప్రముఖ హీరోయిన్ తాప్సీ పన్ను ఎంపికైంది. ప్రముఖ ఫ్రూట్ జ్యూస్ తయారీ సంస్థ మన్ పసంద్ లిమిటెడ్ కు చెందిన బ్రాండ్ 'ఫ్రూట్స్ అప్ ' కు బ్రాండ్ అంబాసిడర్ గా నటి తాప్సీ నియమించి నట్టు మేనేజింగ్ డైరెక్టర్, ఛైర్మన్ ధీరేంద్ర సింగ్ వెల్లడించారు. విలక్షణమైన, క్లిష్టమైన పాత్రల ద్వారా , విమర్శకులు, సినీ పెద్దల ప్రశంసలందుకున్న తాప్సీ త్వరలో తమ ప్రకటనల్లో కనిపించనున్నట్టు చెప్పారు. ఫ్రూట్స్ అప్ బ్రాండ్ లో 16-17 శాతం పల్ప్ తో మామిడి, ఆపిల్, జామ, లీచీ, నారింజతో పాటు మిక్స్ డ్ ఫ్రూట్ లాంటి వేర్వేరు రుచులలో ప్రీమియం పండ్ల రసాలను అందిస్తుంది గుజరాత్ లోని వడోదరలో రెండు తయారీ యూనిట్టు, ఉత్తరప్రదేశ్, వారణాసిలో డెహ్రాడూన్ లో హర్యానా ఉత్తరాంచల్, అంబాలా ఒక్కోటి చొప్పున ఉన్నాయి. ఈ మధ్యకాలంలో డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్ ను భారీగా విస్తరించిన మన్ పసంద్ కొత్త ప్రోడక్ట్ లను లాంచ్ చేసింది. ఫ్రూట్స్ అప్, కోకోనట్ వాటర్ బ్రాండ్ కోకో సిప్ ను కొత్తగా ప్రవేశపెట్టింది. తద్వారా మరింత వృద్ధి సాధించాలని యోచిస్తోంది. కాగా తెలుగులో అగ్రహీరోలందరి సరసన మెప్పించిన తాప్సీ ఇటీవల పింక్ మూవీలో బిగ్ బి తో కలిసి నటించే చాన్స్ కొట్టేసిన ఈ అమ్మడు బాలీవుడ్ లో స్టార్ ఇమేజ్ కోసం శ్రమిస్తున్న సంగతి తెలిసిందే. -
ఐ వాంట్ గెస్ట్ రోల్స్ అంటున్న వెంకీ