breaking news
risked
-
మహిళ సాహసం
-
బీరూట్ బీభత్సం : మహిళ సాహసం
బీరూట్ : లెబనాన్ రాజధాని బీరూట్ నెత్తురోడింది. మంగళవారం సంభవించిన భారీ పేలుళ్లు బీభత్సం సృష్టించాయి. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం 78 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు నాలుగు వేల మందికి పైగా క్షతగాత్రులయ్యారు. దీంతో బీరూట్ నగరమంతా ఎక్కడ చూసినా హృదయ విదారక దృశ్యాలే దర్శన మిస్తున్నాయి. ఈ పేలుడు ధాటికి సంబంధించిన శబ్దాలు 240 కిలోమీటర్ల దూరంలోని సైప్రస్ ద్వీపం వరకూ వివినిపించినట్టు తెలుస్తోంది. బీరూట్ నగరంలో చాలా భవనాలు ధ్వంసమయ్యాయి. పరిసరాల ప్రాంతాల భవనాల కిటికీల అద్దాలు పగిలి పోవడంతో ప్రజలు దిగ్భ్రాంతికి గురయ్యారు. దీనికి సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి. ముఖ్యంగా ఒక మహిళ తన యజమాని బిడ్డను కాపాడేందుకు చేసిన సాహసం విశేషంగా నిలిచింది. పేలుడు సమయంలో ఆ ఇంటి పనిమనిషి తన ప్రాణాలను పణంగా పెట్టి మరీ బిడ్డను కాపాడిన వీడియో చూస్తే.. ఒక్క క్షణం నిశ్చేష్టులవడం ఖాయం. [ చదవండి: బీరట్ విధ్వంసానికి అసలు కారణం ఇదేనా? ] ఈ ఘటనపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇది బాంబు దాడి కావచ్చనే అనుమానం వ్యక్తం చేశారు. ఇది భయంకరమైన దాడిలా ఉందని ట్రంప్ వైట్ హౌస్ వద్ద విలేకరులతో అన్నారు. అయితే పోర్ట్సైడ్ గిడ్డంగిలో కొన్నేళ్లుగా నిల్వ ఉంచిన 2,750 టన్నుల వ్యవసాయ ఎరువు అమ్మోనియం నైట్రేట్ కారణంగా పేలుడు సంభవంచి ఉంటుందని ప్రధాని హసన్ డియాబ్ అన్నారు. ఇలా నిల్వ చేయడం ఏమాత్రం ఆమోదయోగ్యమైనది కాదంటూ లెబనాన్ అధ్యక్షుడు మికెల్ ఒవాన్ ట్వీట్ చేశారు. అయితే పేలుడు ఎలా జరిగిందన్న విషయంపై విచారణ సాగుతోందని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని లెబనాన్ సుప్రీం డిఫెన్స్ కౌన్సిల్ హెచ్చరించింది. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
లేజర్ హెయిర్ రిమూవల్ తో సమస్యే..
చర్మ సౌందర్యం కోసం... ఫ్యాషన్ గా అందంగా కనిపించడం కోసం ఇటీవల అమ్మాయిలు లేజర్ హెయిర్ రిమూవల్ ట్రీట్మెంట్ చేసుకోవడం మామూలైపోయింది. అయితే దాంతో ప్రమాదాలే ఎక్కువ అంటున్నారు ప్రముఖ నవలా రచయిత్రి మరియన్ కెఎస్. తాను అనుభవ పూర్వకంగా చెప్తున్నానని, లేజర్ హెయిర్ రిమూవల్ తో వచ్చే నొప్పి చావుకు అంచులుదాకా తీసుకెడుతుందని, ఒక్కోసారి ఆ నొప్పికి ఉపశమనంకోసం వాడే క్రీములవల్ల కూడ చనిపోయే ప్రమాదం ఉంటుందని ఆమె హెచ్చరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పేరొందిన నవలా రచయిత్రి అయిన మరియన్ కెఎస్... ఆక్స్ ఫర్డ్ లిటరరీ ఫెస్టివల్ సందర్భంగా మాట్లాడుతూ... లేజర్ హెయిర్ రిమూవల్ ట్రీట్మెంట్ చేయించుకుంటే మీరు గుడ్లు బయట పడేలా ఏడ్వాల్సి వస్తుందని, నొప్పితో చచ్చిపోవాల్సి వస్తుందని... ఇది నా కథ అని, దయచేసి మీరు దీని జోలికి వెళ్ళకండి అంటూ హెచ్చరించారు. అయితే తాను ఫెమినిస్టునే అయినా కాళ్ళపై తీవ్రంగా ఉండే జుట్టును తీయకుండా ఉండలేకపోయేదాన్నని, అందుకే నెలకోసారి వాక్సింగ్ తో కాళ్ళమీద జుట్టును తొలగించుకునే ప్రయత్నం చేసేదాన్నని చెప్పారు. ఆ నొప్పి తగ్గించుకునేందుకు ఎనస్థెటిక్ క్రీములు వాడానని, ఆ క్రీములవల్ల కూడ క్రమంగా ప్రాణ భయం ఉంటుందని డాక్టర్లు చెప్తున్నారని , అనుభవజ్ఞులైన డాక్టర్ల అనుమతితో తప్పించి వాడకూడదని సౌందర్య ప్రేమికులకు ఆమె సలహా ఇస్తున్నారు. తాను చేసుకున్న మొదటి లేజర్ హెయిర్ రిమూవల్ ట్రీట్ మెంట్ తర్వాత... 51 ఏళ్ళ ఐరిష్ నవలా రచయిత్రి తన భయంకరమైన అనుభవాలను పంచుకున్నారు. తన అనుభవం సౌందర్య ప్రేమికులకు హెచ్చరికేనంటున్నారు. లేజర్ హెయిర్ రిమూవల్ వల్ల వచ్చే నొప్పి అంతా ఇంతా కాదని, మొదటి ట్రీట్ మెంట్ తోనే తనకు జీవితానికి సరిపడే అనుభవం వచ్చిందన్నారు. ఆ నొప్పిని తగ్గించుకునేందుకు లోకల్ ఎనస్థెటిక్ క్రీమ్ ను ఆశ్రయించాల్సి వచ్చిందని, అయతే అటువంటి క్రీమ్ లు కూడ ప్రాణాలకు నష్టాన్ని కలిగిస్తాయని వైద్యులు చెప్తున్నారని అన్నారు. అయితే క్రీమ్ రాసిన తర్వాత గాని తనకు ఉపశమనం లభించడం లేదని, లోకల్ ఎనస్థెటిక్ క్రీమ్ లు కూడ అధికంగా వాడటం వల్ల 'ఎనస్థెటిక్ టాక్సిసిటీ' సంభవిస్తుందని, అది ప్రాణానికే ప్రమాదమని డాక్టర్లు హెచ్చరిస్తున్నారన్నారు.