breaking news
rg-1
-
క్రీడలతో మానసికోల్లాసం
ఆర్జీ–1 సీజీఎం సీహెచ్ వెంకటేశ్వర్రావు గోదావరిఖని : క్రీడలతో మానసికోల్లాసం పెంపొందుతుందని ఆర్జీ–1 సీజీఎం సీహెచ్.వెంకటేశ్వర్రావు అన్నారు. వర్క్ పీపుల్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ 2015–16 సంవత్సరానికి సంబంధించిన క్రీడా వార్షికోత్సవాన్ని స్థానిక జవహర్‌లాల్‌నెహ్రూ స్టేడియంలోని ఇండోర్ షటిల్ కోర్టులో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా హాజరైన సీజీఎం వెంకటేశ్వర్రావు, సేవా అధ్యక్షురాలు కళావతి మాట్లాడుతూ క్రీడలతో శారీరక దృఢత్వం, ఏకాగ్రత నైపుణ్యత, మంచి క్రమశిక్షణ అవవడుతాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ క్రీడల్లో రాణించాలని కోరారు. కార్యక్రమంలో టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్‌అహ్మద్, ఎస్‌ఓటూ సీజీఎం ఎ.సుధాకర్‌రెడ్డి, సీనియర్ పర్సనల్ ఆఫీసర్ సమ్మయ్య, స్పోర్ట్స్ సూపర్వైజర్ రాజనారాయణరెడ్డి, నాయకులు ఆరెళ్లి పోచం, యాదగిరి సత్తయ్య, సారంగపాణి, గండ్ర దామోదర్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
సింగరేణిలో ప్రతిష్టాత్మకంగా హరితహారం
సీజీఎం వెంకటేశ్వర్రావు గోదావరిఖని : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన హరితహారం రెండవ దశలో భాగంగా సింగరేణి సంస్థ రామగుండం ఏరియా–1 ఆధ్వర్యంలో ముస్త్యాల వెళ్లే రహదారి పక్కన మంగళవారం పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆర్జీ–1 సీజీఎం సీహెచ్.వెంకటేశ్వర్రావు మాట్లాడుతూ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో నాలుగు విడుతలుగా మొక్కలను నాటామని, మంగళవారం 3 వేల మొక్కలు నాటినట్లు తెలిపారు. ఇప్పటి వరకు మొత్తంగా 4,97,300 మొక్కలను ఆర్జీ–1 ఏరియాలో నాటామన్నారు. పర్యావరణ అధికారి అంబటి శ్రీనివాస్ పర్యావరణ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో పర్సనల్ డీజీఎం బి.హనుమంతరావు, మేడిపల్లి ఓసీపీ ప్రాజెక్టు ఆఫీసర్ నాగేశ్వర్రావు, సివిల్ డీజీఎం సూర్యనారాయణ, డీజీఎం సాయిరాం, పర్సనల్ మేనేజ ర్ ఎం.శ్రీనివాస్, సీఎంఓఏఐ ప్రధాన కార్యదర్శి రమేశ్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ డెప్యూటీ మేనేజర్ కర్ణానాయక్, గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల నాయకులు సారంగపాణి, ఆరెళ్లి పోచం, యాదగిరి సత్తయ్య, ఖయ్యూం, సుందిళ్ల సర్పంచ్ రుద్రబట్ల సునీతరఘు, ముస్త్యాల సర్పంచ్ సుంకరి మాధవి, సింగరేణి పాఠశాల, గాంధీ జూనియర్ కళాశాల, సెయింట్ పాల్స్ స్కూల్ విద్యార్థులు, స్కౌట్స్ అండ్ గైడ్స్, రోవర్స్, పోలీస్ శిక్షణ అభ్యర్థులు పాల్గొన్నారు.